Best Web Hosting Provider In India 2024

Shriya Saran Fitness Secret: శ్రియా సరన్ 42ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా, అందంగా కనిపించడం వెనక రహస్యం ఇదేనంట!
Shriya Saran Fitness Secret: నలభ్లే ఏళ్లు దాటినా కూడా అందంగా కనిపిస్తూ అందరినీ కవ్విస్తుంటారు నటి శ్రియా సరన్. ఈ వయసులోనూ ఫిట్‌గా కనిపించడం వెనకున్న రహస్యాన్ని తాజాగా బయటపెట్టిందీ బ్యూటీ. ఆమెలా అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే ఏం చేయాలో మీరు కూడా తెలుసుకోండి.
శ్రియా అందంలో ఉంది ఏదో మాయ! 42ఏళ్లు వచ్చినా ఆమె గ్లామర్‌లో ఇసుమంత తేడా లేదు. ఫిట్ నెస్ లో రవ్వంతమార్పు లేదు. చర్మంలో అదే యవ్వనత్వం, అంతే కాంతివంతం. ఇలా ఉండటానికి కారణం ఏంటో, ఇన్నేళ్లుగా ఆమె ఫాలో అవుతున్న సీక్రెట్ టిప్స్ ఏంటో తెలుసుకోవాలని ఉంటే ఇక్కడ ఓ లుక్కేయండి.
శ్రియా తన వృత్తితో పాటు ఆరోగ్యానికి, కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇందుకోసం క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అనుసరిస్తుంది. తెర మీద కనిపించకపోయినా, కుటుంబంతోనే సమయాన్నిగడుపుతున్నా కూడా ఆమె ఫిట్నెస్ కు ప్రాధాన్యత తగ్గదు. ఈ వయసులోనూ ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేందుకు శక్తిని కాపాడుకోవడానికి ఆమె ఎలాంటి ఫిట్నెస్, ఆహార చిట్కాలను పాటిస్తుందో HT లైఫ్‌స్టైల్‌తో పంచుకుంది.
శ్రియా ఎల్లప్పుడూ చురుగ్గా ఎలా ఉంటుంది..
“నేను అన్ని రకాల కదలికలను ఇష్టపడతాను, కాబట్టి నా వ్యాయామాలను ఉత్తేజకరంగా ఉంచుకోవడానికి నేను వాటిని మిళితం చేస్తాను,” అని శ్రియా చెప్పింది. “అంతేకాదు కొన్ని సంవత్సరాలుగా యోగా నా రొటీన్లో భాగం, ఎందుకంటే ఇది నా ఫ్లెక్సిబిలిటీ , పోస్టర్ లతో పాటు మనస్సును మెరుగుపరుస్తుంది. నాకు ఇష్టమైన వాటిలో పైలేట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది నా కోర్‌ను బలపరుస్తుంది, శరీర నియంత్రణను మెరుగుపరుస్తుంది. నేను చురుగ్గా ఉండటానికి మరొక కారణం స్విమ్మింగ్. ఇది చాలా గొప్ప మార్గం. ఇది మొత్తం శరీరాన్ని కాపాడుతుంది, కీళ్లకు బలాన్ని చేకూరుస్తుంది. ”
బలంగా ఉండటానికి శ్రియా ఏం చేస్తుంది?
ఎప్పుడు చూసినా బలంగా, శక్తితో నిండి కనిపించడానికి శ్రియా Strength training చేస్తారట. దీని గురించి ఆమె మాట్లాడుతూ..” Strength training నాకు సహనశక్తిని పెంపొందిస్తుంది, బలంగా ఉండటానికి సహాయపడుతుంది,” అని చెప్పుకొచ్చింది . వ్యాయామాల విషయానికి వస్తే డాన్స్‌పై ఆమెకున్న ప్రేమకు సాటి ఏది లేదు. “డాన్స్ ఎల్లప్పుడూ నా హృదయంలో ఉంటుంది! ఇది గొప్ప వ్యాయామం మాత్రమే కాదు, ఆనందానికి మూలం కూడా. ఫిట్నెస్ అనేది ఆనందదాయకంగా ఉండాలని నేను నిజంగా నమ్ముతున్నాను—మీరు చేస్తున్న పనిని మీరు ఇష్టపడితే, అది ఎప్పుడూ ఒక పనిలా అనిపించదు.” అని చెప్పింది.
వ్యాయామం చేసే ముందు ఆమె ఏమి తింటుంది
వ్యాయామానికి ముందు పోషణ ప్రాముఖ్యత గురించి శ్రియా నొక్కి చెప్పింది. “వ్యాయామం చేసే ముందు తినడం చాలా ముఖ్యం, ఇది నాకు చాలా శక్తినిస్తుంది, అతిగా నిండిన అనుభూతి ఉండదు. వ్యాయామానికి ముందు నేను పోషకాలతో నిందిన తేలికైన ఆహారాన్ని ఎంచుకుంటాను. వ్యాయామానికి ముందు నేను తినే స్నాక్ ఒక అరటిపండు, కొన్ని బాదంపప్పులు. ఆరోగ్యకరమైన ప్రొటిన్లు, కొవ్వులతో సహా 15 ముఖ్యమైన పోషకాలతో నిండిన బాదంపప్పులు నిరంతర శక్తినిస్తాయి, అరటిపండ్లు వేగవంతమైన కార్బోహైడ్రేట్ బూస్ట్‌ను అందిస్తాయి.”
అదనపు సమయంలో ఏం చేస్తుంది
శ్రియా వ్యాయామం మధ్యలో సమయం దొరికితే పోషకాలతో కూడిన స్మూతీని తయారు చేసుకుంటుందట. “నేను బాదంపప్పులు, బెర్రీలు, ఫ్లాక్స్ సీడ్స్‌తో స్మూతీని తయారు చేయడం ఇష్టపడతాను. ఇది పోషకాలతో నిండిన రిఫ్రెషింగ్ డ్రింక్. వ్యాయామానికి ముందు దీన్ని జీర్ణం చేసుకోవడంకూడా సులభం,” అని ఆమె వివరించింది. శ్రియా ఫిట్ నెస్ సీక్రెట్లో హైడ్రేషన్ చాలా ముఖ్యం. “నేను ఎల్లప్పుడూ నా సెషన్ ప్రారంభించే ముందు నీరు త్రాగడానికి జాగ్రత్త వహిస్తాను.”
వ్యాయామం తర్వాత కోలుకోవడం కోసం
వ్యాయామం తర్వాత శీరీరానికి సరైన ఇంధనం చాలా ముఖ్యమని చెబుతున్నారు శ్రియా. “వ్యాయామం తర్వాత కోలుకోవడం కోసం నేను గ్రిల్డ్ కూరగాయలతో క్వినోవా బౌల్ లేదా గుడ్లుతో హోల్ గ్రెయిన్ టోస్ట్ వంటి ప్రోటీన్‌తో నిండిన భోజనం చేస్తాను. వీటి ద్వారా నా శరీరానికి సరైన పోషకాలతో నిండిన ఇంధనం అందుతుంది.” అని ఆమె వివరించింది.
ఇంట్లో తయారుచేసిన స్నాక్‌ను కూడా ఆనందిస్తుంది. “నేను బాదం ఎనర్జీ బైట్స్ తినడం ఇష్టపడతాను ఎందుకంటే అవి ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి, వ్యాయామం తర్వాత స్నాక్‌గా ఇవి చాలా బాగుంటాయి. వీటితో పాటు నేను రోజంతా ఎక్కువ నీటిని త్రాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటాను. కొన్నిసార్లు తీవ్రమైన సెషన్ తర్వాత ఎలక్ట్రోలైట్లను పునరుద్ధరించడానికి కొబ్బరి నీరు త్రాగుతాను.”
బ్యాలెన్స్ కోసం..
శ్రీయాకు దృష్టిలో ఫిట్నెస్ అనేది అతిగా చేయాల్సింది కాదు—ఇది స్థిరమైన, ఆనందదాయకమైన రొటీన్. “ ఫిట్నెస్ అంటే నిలకడగా ఉండటం, జాగ్రత్తగా ఎంపిక చేసుకుని, ప్రక్రియను ఆస్వాదించడం. నేను నన్ను నేను ఎక్కువ కష్టపెట్టాలని అనుకోను కానీ నా శరీరానికి ఇంధనం అందించే, నన్ను బాగుండేలా చేసే పోషకమైన ఆహారాలపై దృష్టి పెడతాను. చిన్న అలవాట్లు పెద్ద మార్పును తీసుకువస్తాయి. చురుకుగా ఉండటం, బాగా తినడం లేదా నాకు సరిపడా విశ్రాంతి తీసుకోవడం వంటివన్నీ నన్ను అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.” అంటూ శ్రియా తన ఫిట్నెస్ సీక్రెట్‌ను వివరించారు.
సంబంధిత కథనం