Best Web Hosting Provider In India 2024

Telugu Serial: 1500 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న తెలుగు సీరియల్ – లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్‌గా రికార్డ్
Telugu Serial: జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న ప్రేమ ఎంత మధురం సీరియల్ అరుదైన మైలురాయిని చేరుకుంది. శుక్రవారం నాటితో 1500 ఎపిసోడ్లు పూర్తిచేసుకున్నది. ప్రస్తుతం జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న సెకండ్ లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్‌గా ప్రేమ ఎంత మధురం రికార్డ్ క్రియేట్ చేసింది.
ఐదేళ్లుగా…
ప్రేమ ఎంత మధురం సీరియల్ 2020 ఫిబ్రవరి 10న మొదలైంది. ఐదేళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోంది. ఈ రొమాంటిక్ డ్రామా సీరియల్‌లో శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్‌కే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సీరియల్‌లో ఆనంద్, ఆర్యవర్ధన్, సూర్య అనే మల్టీపుల్ షేడ్స్ క్యారెక్టర్‌లో శ్రీరామ్ వెంకట్ నటించాడు. అను, అపర్ణ, రాజీ అనే పాత్రల్లో వర్హ కనిపించింది. నలభై ఏళ్ల వ్యాపారవేత్తకు ఇరవై ఏళ్ల డిగ్రీ స్టూడెంట్‌కు మధ్య మొదలైన ప్రేమకథతో డైరెక్టర్ సాయి వెంకట్ ఈ సీరియల్‌ను రూపొందించాడు. లీడ్ రోల్‌లో నటిస్తోన్న శ్రీరామ్ వెంకట్ ఈ సీరియల్‌కు ప్రొడ్యూసర్ కావడం గమనార్హం.
సెకండ్ జనరేషన్…
పునర్జన్మల నేపథ్యంలో ప్రేమ ఎంత మధురం సీరియల్ సాగుతుంది. ఫస్ట జనరేషన్ పూర్తయింది. ప్రస్తుతం సెకండ్ జనరేషన్‌ను కథ నడుస్తోంది. ఈ సీరియల్‌లో రాంజగన్, జబర్ధస్థ్ వర్ష, దివ్య, కళ్యాణ్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. మరాఠీలో విజయవంతమైన తులా పహతేరే సీరియల్‌కు రీమేక్‌గా ప్రేమ ఎంత మధురం రూపొందుతోంది. మరాఠీ వెర్షన్‌తో పోలిస్తే తెలుగులో చాలా మార్పులు చేశారు.
టైమ్ ఛేంజ్…
ప్రేమ ఎంత మధురం మొదలైనప్పటి నుంచి రాత్రి తొమ్మిది గంటలకు ఈ సీరియల్‌ను టెలికాస్ట్ చేస్తూ వచ్చింది జీ తెలుగు. నాలుగేళ్ల తర్వాతగత ఏడాది జూన్‌లో సీరియల్ టైమింగ్‌ను మార్చారు. ప్రస్తుతం రాత్రి పది గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతోంది.
గుండమ్మ కథ ఫస్ట్ ప్లేస్…
ప్రస్తుతం జీ తెలుగులో లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్‌గా గుండమ్మ కథ ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతుంది. శుక్రవారం నాటితో 2030 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్నది. గుండమ్మ కథ తర్వాత సెకండ్ ప్లేస్‌లో ప్రేమ ఎంత మధుర సీరియల్ కొనసాగుతోంది. త్రినయని సీరియల్ మూడో ప్లేస్‌లో కొనసాగుతూ వచ్చింది. గత జనవరిలో త్రినయని సీరియల్‌కు మేకర్స్ ఎండ్ కార్డ్ వేశారు. 1438 ఎపిసోడ్స్‌తో ఈ సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం