


Best Web Hosting Provider In India 2024

Romantic Scenes: కిస్సింగ్ సీన్లు, అలాంటి సీన్లు చేయమని ఎంతో ఒత్తిడి తెచ్చారు.. కానీ నో చెప్పాను: హీరో కామెంట్స్ వైరల్
Romantic Scenes: స్క్రీన్‌పై కిస్సింగ్, ఇంటిమేట్ సీన్లు చేయబోనని చెబుతున్నాడు మలయాళ స్టార్ హీరో. ఎంతమంది ఒత్తిడి తెచ్చినా తాను మాత్రం ఈ రూల్ ను ఎప్పుడూ బ్రేక్ చేయలేదని అతడు చెప్పడం విశేషం.
Romantic Scenes: మార్కో మూవీ స్టార్ ఉన్ని ముకుందన్ తెలుసు కదా. అంతకుముందే తెలుగులో భాగమతి, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలు చేశాడు. ఈ హీరో తన కెరీర్లో కిస్సింగ్, రొమాంటిక్ సీన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇన్నేళ్లయినా ఇప్పటికీ అతడు అదే పాలసీని కొనసాగిస్తున్నాడు. ఇక మీదటా అదే పని చేస్తానని స్పష్టం చేశాడు.
కిస్సింగ్, రొమాంటిక్ సీన్లకు నో
మలయాళం సినిమా ఇండస్ట్రీ చరిత్రలో మోస్ట్ వయోలెంట్ మూవీగా నిలిచిన మార్కోతో ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఉన్ని ముకుందన్. బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అయిన ఈ సినిమా.. ఈ మధ్యే సోనీ లివ్, ఆహా వీడియో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు ఉన్ని ముకుందన్ గెట్ సెట్ బేబీ అనే మరో మూవీతో వచ్చాడు. సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 21) రిలీజైంది. ఇందులో అతడు ఓ గైనకాలజిస్ట్ పాత్ర పోషిస్తున్నాడు. ఐవీఎఫ్ స్పెషలిస్ట్ పాత్ర కావడం విశేషం. ఈ సందర్భంగా అతడు ఆన్‌మనోరమతో మాట్లాడాడు.
తాను గత ఏడేళ్లలో రొమాంటిక్ హీరో పాత్ర పోషించలేదని ఈ సందర్భంగా అతడు చెప్పాడు. మెప్పాడియాన్ నుంచి మార్కో వరకు తాను అలాంటి మూవీ చేయలేదని అన్నాడు. అలాంటి పాత్రలు తనకు సవాలుగా ఉంటాయని, ఓ నటుడిగా తన పరిమితి ఇదేనని వెల్లడించాడు.
ఎంతో ఒత్తిడి తెచ్చారు
ఉన్ని ముకుందన్ ఓ నిబంధనను కచ్చితంగా పెట్టుకున్నాడు. మొదటి సినిమా నుంచీ కిస్సింగ్, ఇంటిమేట్ సీన్లలో నటించబోనని అతడు స్పష్టం చేశాడు. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నాడు. తన సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకుల కోసమని కూడా అతడు ఈ సందర్భంగా చెప్పాడు.
తన కెరీర్లో ఎంతో మంది ఫిల్మ్ మేకర్లు ఇలాంటి సీన్లలో నటించాల్సిందిగా ఒత్తిడి తెచ్చరని ఉన్ని వెల్లడించాడు. ఇతర హీరోలు చేస్తున్నట్లే తననూ చేయమన్నారని, అయితే తాను మాత్రం దానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని చెప్పేవాడినని అన్నాడు. యాక్షన్ సీన్లలో ఎలాగైతే అవతలి వ్యక్తిని తాకకుండా కొట్టినట్లుగా చూపిస్తామో.. రొమాంటిక్ సీన్లు కూడా అలాగే ఉండాలని అతడు చెప్పడం విశేషం.
ఉన్ని ముకుందన్ నటించిన మార్కో మూవీ గతేడాది డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజైంది. రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.115 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ మూవీ సోనీలివ్, ఆహా వీడియోలలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం