



Best Web Hosting Provider In India 2024

Nara Lokesh On Group 2: గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా డిమాండ్ పై స్పందించిన మంత్రి లోకేశ్, రోస్టర్ సమస్య పరిష్కరిస్తామని హామీ
Nara Lokesh On Group 2 : ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలని నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. రోస్టర్ లో తప్పులు సరిచేసిన తర్వాత మెయిన్స్ నిర్వహించాలని అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ స్పందించారు.
Nara Lokesh On Group 2 : ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 23న మెయిన్స్ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా…రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహించొద్దని గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళనలు చేస్తు్న్నారు. విశాఖతో పాటు పలు పట్టణాల్లో గ్రూప్-2 అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. గ్రూప్ 2 అభ్యర్థుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
“గ్రూప్ 2 అభ్యర్థుల నుంచి గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయమని నాకు చాలా అభ్యర్థనలు వచ్చాయి. వారి ఆందోళనలను నేను అర్థం చేసుకున్నాను. మా లీగల్ టీమ్ లతో సంప్రదించి, పరిష్కారం కనుగొనడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తాను” అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు.
ఏపీపీఎస్సీ గ్రూప్- 2 మెయిన్స్ పరీక్షలను ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో 175 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 23న గ్రూపు-2 మెయిన్స్ పరీక్షకు ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ తెలిపారు.175 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. ఈ పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు హాజరవుతారని చెప్పారు.
రోస్టర్ విధానంపై ఆందోళనలు
రాష్ట్రంలో 899 పోస్టులు భర్తీ చేసేందుకు గత వైసీపీ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7న నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పుడే గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఆ తరువాత ఎన్నికలు రావడంతో గ్రూప్-2 మెయిన్స్ ఆగిపోయింది. అయితే అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన మెయిన్స్ పరీక్ష ఎట్టకేలకు ఫిబ్రవరి 23 (ఆదివారం) నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 92,250 మంది అభ్యర్థులు గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. 13 ఉమ్మడి 13 జిల్లాల్లోని 175 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
నోటిఫికేషన్‌లో ఇచ్చిన రోస్టర్ విధానంలో పొరపాట్లు జరిగాయని అభ్యర్థులు ముందు నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. విశాఖపట్నం, కాకినాడ వంటి ప్రాంతాల్లో అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ గ్రూప్-2 అభ్యర్థులు వైపు గట్టిగా మాట్లాడింది. రోస్టర్ విధానంలో చోటు చేసుకున్న పొరపాట్లను సరి చేయాలని డిమాండ్ చేసింది.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళనలు పెరిగాయి. హైకోర్టు కూడా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలో తాము జోక్యం చేసుకోలేమని తెగేసి చెప్పింది. అయితే రోస్టర్ విధానంలో తప్పులను సరి చేసేందుకు ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. రోస్టర్ విధానంలో మార్పులు చేసి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది.
సంబంధిత కథనం
టాపిక్