


Best Web Hosting Provider In India 2024

Araku Tour Package 2025 : ‘అరకు’ అందాలను చూసొద్దామా..! తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీపై ఓ లుక్కేయండి
Telangana Tourism Araku Package 2025 : తెలంగాణ టూరిజం అరకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ట్రిప్ ను ఆపరేట్ చేస్తారు. ఫిబ్రవరి 26వ తేదీన జర్నీ ఉంది. ఈ ట్రిప్ లో భాగంగా అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరితో పాటు అరకును చూడొచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి….
హైదరాబాద్ – అరకు టూర్ ప్యాకేజీ (image source .istockphoto.com)
అరకు అందాలను చూడాలనుకుంటున్నారా..? అయితే తక్కువ బడ్జెట్ లోనే టూర్ ప్యాకేజీ వచ్చేసింది. ఈ మేరకు తెలంగాణ టూరిజం శాఖ ప్యాకేజీ వివరాలను ప్రకటించింది. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపింది.
“HYDERABAD-VIZAG-ARAKU” పేరుతో తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. 26 ఫిబ్రవరి, 2025వ తేదీన ట్రిప్ అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే… మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి అప్డేట్స్ తెలుసుకోవచ్చు.
హైదరాబాద్ – అరకు ట్రిప్, వివరాలు:
- హైదరాబాద్ నుంచి అరకు ట్రిప్ ను తెలంగాణ టూరిజం శాఖ ఆపరేట్ చేస్తోంది.
- ఈ ట్రిప్ మొత్తం నాలుగు రోజులపాటు ఈ ట్రిప్ ఉంటుంది.
- అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకులోని బొర్రా గుహలు, అనంతగిరి చూడొచ్చు.
- మొదటి రోజు హైదరాబాద్ లోని పర్యాటక భవన్ నుంచి ప్రయాణం మొదలవుతుంది.
- 2వ రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. సింహాచలం, కైలాసగిరి, రుషికొండను చూస్తారు. అంతేకాకుండా…. సబ్ మైరైన్ మ్యూజియంను సందర్శిస్తారు.సాయంత్రం వైజాగ్ బీచ్ ను సందర్శిస్తారు. రాత్రి వైజాగ్ లోనే బస చేస్తారు.
- 3వ రోజు ఉదయం 6 గంటలకు అరకు చేరుకుంటారు. ఈ జర్నీ చాలా బాగుంటుంది. అరకులో ఉంటే ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి, కాఫీ ప్లానిటేషన్, బొర్రా కేవ్స్, థిమ్సా డ్యాన్స్ ను చూస్తారు. రాత్రి అరకులోనే ఉంటారు.
- 4వ రోజు అన్నవరం చేరుకుంటారు. దర్శనం తర్వాత హైదరాబాద్ రిటర్న్ జర్నీ ఉంటుంది. ఐదో రోజు ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది.
- హైదరాబాద్ – అరకు ట్రిప్ ధరలు చూస్తే… పెద్దవారికి రూ. రూ. 6,999గా ఉంది. పిల్లలకు 5.599గా నిర్ణయించారు.
- ఈ లింక్ పై క్లిక్ చేస్తే హైదరాబాద్ – అరకు టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్
IrctcIrctc PackagesTravelHyderabad
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.