AP Model Schools: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో అడ్మిషన్లకు నోటిఫికేషన్, ఏప్రిల్ 20న ప్రవేశపరీక్ష

Best Web Hosting Provider In India 2024

AP Model Schools: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో అడ్మిషన్లకు నోటిఫికేషన్, ఏప్రిల్ 20న ప్రవేశపరీక్ష

Sarath Chandra.B HT Telugu Feb 22, 2025 04:00 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu
Feb 22, 2025 04:00 AM IST

AP Model Schools: ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 164 మోడల్ స్కూల్స్‌లో 2025-26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 20వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

AP Model Schools: ఆంధ్రప్రదేశ్‌లోని ఆరో తరగతి ప్రవేశాల కోసం అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 164 మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఏ మండలంలో ఆదర్శ పాఠశాల ఉంటుందో అదే పాఠశాలలో ఏప్రిల్ 20వ తేదీన ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.ప్రవేశ పరీక్షకు హాజరు కావడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.ప్రవేశ పరీక్షను తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలో నిర్వహిస్తారు.ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి బోధన ఇంగ్లీష్‌ మీడియంలోనే సాగుతుంది. ఈ స్కూళ్లలో విద్యాభ్యాసానికి ఎలాంటి ఫీజులు వసూలు చేయరు.

ప్రవేశ పరీక్షకు అర్హతలు…

ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌ స్కూల్స్‌లో అడ్మిషన్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎంట్రన్స్‌ పరీక్షకు దరఖాస్తు చేసే విద్యార్థులు ఓసీ,బీసీ కులాలకు చెందిన వారైతే 2013 సెప్టెంబర్ 1 నుంచి 2015 ఆగష్టు 31 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు 2011 సెప్టెంబర్ 1 నుంచి 2015 ఆగస్టు 31 మధ్య పుట్టి ఉండాలి.

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసే విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24, 24-25 విద్యా సంవత్సరాల్లో చదివి ఉండాలి. 2024-25 విద్యా సంవత్సరంలో 5వ తరగతి నుంచి ప్రమోట్ అయ్యుండాలి.

దరఖాస్తు చేయడానికి పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ https://cse.ap.gov.in/ లేదా https://apcfss.in/ లో అడ్మిషన్‌ నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుంది.

దరఖాస్తు ఇలా చేయాలి…

ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో ఆరో తరగతిలో ప్రవేశాలకు అభ్యర్థుల అర్హతలు పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లించేందుకు అనుమతిస్తారు. ఫిబ్రవరి 24వ తేదీుంచి పరీక్ష ఫీజులు చెల్లించిన వారికి జనరల్ అలాట్‌మెంట్‌ నంబరు కేటాయిస్తారు. ఈ నంబరు ద్వారా ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.ఫీజుల్ని ఈ వెబ్‌సైట్‌ల ద్వారా చెల్లించవచ్చు.

ఓసీ,బీసీలకు రూ.150పరీక్ష ఫీజు, ఎస్సీ, ఎస్టీలకు రూ.75 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షలో ఓసీ,బీసీ విద్యార్థులు 35మార్కులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 30మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ప్రవేశపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్‌ ప్రకారం సీట్లను కేటాయిస్తారని పాఠశాల విద్యా కమిషనర్‌ విజయరామరాజు తెలిపారు. ప్రవేశ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇతర వివరాలకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌ లేదా జిల్లా విద్యా శాఖాధికారిని సంప్రదించాలి.

ముఖ్యమైన తేదీలు…

అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల తేదీ ఫిబ్రవరి 21

పరీక్ష ఫీజు చెల్లింపు ప్రారంభం : ఫిబ్రవరి 24

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ : ఫిబ్రవరి 25

ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : మార్చి 31

పరీక్ష తేదీ : ఏపిల్ 20

మెరిట్ లిస్ట్‌ ప్రకటించే తేదీ : ఏప్రిల్ 27

సెలక్షన్ తేదీ : ఏప్రిల్ 27

సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ : ఏప్రిల్ 30

తరగతులు జూన్‌లో ప్రారంభం అవుతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

AdmissionsTeluguTelugu NewsAndhra Pradesh NewsSchools
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024