


Best Web Hosting Provider In India 2024

Shivaratri Fasting Benefits: శివరాత్రి ఉపవాసంతో ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్య పరంగా కూడా ప్రయోజనాలే!
Shivaratri Fasting Benefits: శివరాత్రి ఉపవాసం వల్ల కేవలం ఆధ్యాత్మిక సంతృప్తితో పాటు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? ఈ రోజు ఉపవాసం చేయాలనుకునే వారు ఉపవాసంతో ఆరోగ్యానికి లభించే ప్రయోజనాల గురించి తెలుసుకోండి.
భారతదేశ సంప్రదాయాల్లో పండుగలు, పూజలతో పాటు ఉపవాసాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే నిర్వహించే ఉపవాసాన్ని భక్తిశ్రద్ధలతో పాటిస్తారు. హిందూ మతంలో ఉపవాసం అనేది ధర్మం, విశ్వాసంతో ముడిపడి ఉంటుంది. కానీ, ఉపవాసం ఉండటం వల్ల కేవలం ఆధ్మాత్మికంగానే కాదట, అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయట! మరి కొద్ది రోజుల్లో ఆ మహదేవుని భక్తులు ఆశగా ఎదురుచూస్తున్న పర్వదినం మహాశివరాత్రి. ఈ రోజున ఉపవాసం ఉండి తమలోని ఆధ్మాత్మికతనే కాదు ఆరోగ్యాన్ని కూడా పెంచుకోనున్నారు.
ధార్మిక నమ్మకాల ప్రకారం, శివరాత్రి పర్వదినాన పార్వతీ దేవీకి, శంకరుని వివాహం జరిగింది. మీరు కూడా ఈ రోజు ఉపవాసం చేయాలని అనుకుంటే, ఉపవాసంతో కలిగే ఆరోగ్యానికి ప్రయోజనాలను తెలుసుకోండి.
ఉపవాసంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే..:
ఉపవాసం చేయడం వల్ల జీవక్రియ వేగం తగ్గుతుంది. దీనివల్ల శరీరం తనంతట తాను శుభ్రపరచుకోవడానికి సమయం లభిస్తుంది. ఉపవాస దీక్ష పాటించడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోతాయి. ఎన్సిబిఐ (నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్) వెబ్సైట్లో ప్రచురించిన పబ్మెడ్ సెంట్రల్ (PubMed Central) రీసెర్చ్ పేపర్ ప్రకారం, ఆహారం తీసుకోకుండా ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకునే లిక్విడ్ ఫాస్టింగ్ శరీరాన్ని బాగా శుద్ధి చేస్తుంది. ఈ రకమైన ఉపవాసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధిత, చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
జీర్ణ వ్యవస్థ
ఉపవాసం శారీరక, మానసిక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఆత్మ శుద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధిని మాత్రమే కాకుండా, జీర్ణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కూడా ఇస్తుంది. మీరు దీర్ఘకాలంగా జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే, ఉపవాసం మీకు ఉపశమనం కలిగించవచ్చు. ఉపవాసం జీర్ణ వ్యవస్థను మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల మలబద్ధకం, అజీర్ణం, కడుపులో నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
బరువు తగ్గడం
ఉపవాసం చేయడం వల్ల కొవ్వును మండించే ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఉపవాస సమయంలో, శరీరంలో నిల్వ చేయబడిన కొవ్వు శక్తి కోసం ఉపయోగించబడుతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. అయితే, బరువు తగ్గడానికి ఉపవాసంతో పాటు చురుకుగా ఉండటం, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పబ్మెడ్ సెంట్రల్ రీసెర్చ్ పేపర్ ప్రకారం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అధిక కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఉపవాసంలో, ఘనపదార్థాలకు బదులుగా ద్రవ పదార్థాలను తీసుకుంటారు లేదా ఆహార సమయాన్ని మార్చుకుంటారు.
రోగనిరోధక శక్తి
ఉపవాస సమయంలో పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి.
ఏకాగ్రత మెరుగుదల
ఉపవాసం శారీరక ప్రయోజనాలతో పాటు మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఉపవాసం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఆలోచనలపై నియంత్రణను కలిగిస్తుంది. దీనివల్ల ఏకాగ్రత మెరుగుపడి, దృష్టి కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. ఫలితంగా ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయి.
సంబంధిత కథనం