


Best Web Hosting Provider In India 2024

Baapu OTT: నిన్న రిలీజైన తెలుగు డార్క్ కామెడీ మూవీ బాపు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే.. కన్ఫర్మ్ చేసిన నటుడు బ్రహ్మాజీ!
Baapu Movie OTT Streaming Platform Confirmed By Brahmaji: ఓటీటీలోకి నిన్న (ఫిబ్రవరి 21) థియేటర్లోల విడుదలైన బాపు మూవీ రానుంది. తెలుగు డార్క్ కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన బాపు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో నటుడు బ్రహ్మాజీ కన్ఫర్మ్ చేశారు. అలాగే, బాపు సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Baapu OTT Release Platform: తెలుగులో అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యాక్టర్ బ్రహ్మాజీ. తనదైన స్టైల్ యాక్టింగ్‌తో కామెడీ, ఎమోషనల్, సీరియస్ పాత్రల్లో మెప్పించారు. బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు డార్క్ కామెడీ డ్రామా చిత్రం బాపు.
బ్రహ్మాజీతోపాటు
కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించిన బాపు సినిమాకు దయా దర్శకత్వం వహించారు. బాపు సినిమాలో బ్రహ్మాజీతోపాటు సీనియర్ హీరోయిన్ ఆమని, బలగం సినిమాతో పేరు తెచ్చుకున్న సుధాకర్ రెడ్డి, యంగ్ హీరోయిన్ ధన్య బాలకృష్ణ, డైరెక్టర్, నటుడు అవసరాల శ్రీనివాస్, మణి ఏగుర్ల ప్రధాన పాత్రలు పోషించారు.
స్టార్ సెలబ్రిటీల ప్రమోషన్స్
బాపు సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి బజ్ ఏర్పడింది. దగ్గుబాటి రానా, రష్మిక మందన్నా వంటి స్టార్ సెలబ్రిటీలు బాపు సినిమాను ప్రమోట్ చేశారు. ఎమోషనల్ అండ్ డార్క్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన బాపు ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైంది. బాపు సినిమాకు ఆడియెన్స్ నుంచి చాలా వరకు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. సినిమా బాగుందని చెబుతున్నారు.
బాపు ఓటీటీ ప్లాట్‌ఫామ్
ఈ నేపథ్యంలో బాపు ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ వివరాలపై ఆసక్తి నెలకొంది. అయితే, బాపు ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో నటుడు బ్రహ్మాజీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనే చెప్పేశారు. సినిమా రిలీజ్‌కు మందు బాపు ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బాపు ఓటీటీ రైట్స్‌తోపాటు సినీ విశేషాలను పంచుకున్నారు యాక్టర్ బ్రహ్మాజీ.
బాపు సినిమాకి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ?
-ఇప్పటివరకూ సినిమా చూసి ప్రతిఒక్కరూ చాలా బావుందని ఫోన్‌లు చేస్తున్నారు. జనరల్ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి గారికి సినిమా చూపించాను. ఆయనకి చాలా నచ్చింది.
ఈ సినిమాని చాలా మంది బలగంతో పోల్చుతున్నారు ?
-అది మంచిదే కదా. అందులోనూ బలగం సుధాకర్ గారు ఉండటంతో ఆ పోలిక మరింతగా వస్తోంది. అయితే బలగం సినిమాకి దీనికి ఏ మాత్రం పోలిక లేదు. ఆ కథ వేరు.. ఈ కథ వేరు.
ఫైనల్ కాపీ చుసినప్పుడు ఏమనిపించింది?
-బాపు సినిమా చాలా బావుంది. ఇప్పుడు చిన్న సినిమాలకి ఓటీటీ అవ్వడం లేదు. కానీ, మా అదృష్టం.. ఈ సినిమాని హాట్ స్టార్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ/జియో హాట్‌స్టార్ ఓటీటీ) వాళ్లు తీసుకున్నారు. థియేటర్ ఆడియన్స్ కచ్చితంగా కనెక్ట్ అవుతారు.
ఈ సినిమాకి అవార్డులు ఆశిస్తున్నారా ?
-అవార్డులు గురించి ఆలోచన లేదు. మంచి సినిమా చేయాలనేది మా ప్రయత్నం. అవార్డ్స్ వస్తే హ్యాపీ.
బాపు మ్యూజిక్ గురించి ?
-ఈ సినిమాకి సాంగ్స్ చాలా హెల్ప్ అయ్యాయి. రెండు పాటలు బాగా పాపులర్ అయ్యాయి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
బాపు ఓటీటీ రిలీజ్ డేట్
ఇలా ఇంటర్వ్యూలో ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చిన యాక్టర్ బ్రహ్మాజీ బాపు ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లేదా జియో హాట్‌స్టార్ కొనుగోలు చేసిందని చెప్పుకొచ్చారు. కాబట్టి బాపు జియో హాట్‌స్టార్‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని కన్ఫర్మ్ అయింది. అయితే, ఇంకా బాపు ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు.
సంబంధిత కథనం
టాపిక్