Thandel Collection: 77 శాతం పతనమైన తండేల్ కలెక్షన్స్.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు, లాభాలు వచ్చాయంటే?

Best Web Hosting Provider In India 2024

Thandel Collection: 77 శాతం పతనమైన తండేల్ కలెక్షన్స్.. 15 రోజుల్లో ఎన్ని కోట్లు, లాభాలు వచ్చాయంటే?

 

Thandel 15 Days Worldwide Box Office Collection: తండేల్ మూవీ కలెక్షన్స్ సుమారుగా 77 శాతం పతనమైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ రెండో వారం (ఫిబ్రవరి 20) పూర్తి చేసుకుంది. మరి ఈ నేపథ్యంలో తండేల్ 15 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

 
తండేల్ 15 డేస్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్
తండేల్ 15 డేస్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్
 

Thandel Box Office Collection 2nd Week: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే, తాజాగా రెండో వారం (ఫిబ్రవరి 20కి) పూర్తి చేసుకుంది తండేల్ చిత్రం. అయితే, మొదటి వారంతో పోలిస్తే సెకండ్ వీక్ సుమారుగా 77 శాతం తండేల్ కలెక్షన్స్ పతనం అయినట్లు ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ సంస్థ తెలిపింది.

 

77.13 శాతం పతనమైన తండేల్ కలెక్షన్స్

చందూ మొండేటి దర్శకత్వం వహించిన తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా తండేల్ రెండవ వారంలో థియేటర్లలో భారీగా 77.13 శాతం వరకు ఆదాయం పడిపోయినట్లు చెప్పుకొచ్చింది. ఈ రెండో వారంలో తండేల్ మూవీకి రూ. 11.3 కోట్లు నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అదే మొదటి వారంలో రూ. 49.4 కోట్లు సంపాదించింది.

15వ రోజు తండేల్ వసూళ్లు

ఇక తండేల్ సాధించిన రెండవ వారం కలెక్షన్స్ లో థియేటర్లలో సంపాదించిన రూ. 11.30 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్‌లోలో రూ. 11.24 కోట్లు దాని తెలుగు వెర్షన్ నుంచి రాగా.. హిందీ వెర్షన్ నుంచి రూ. 1 లక్ష, తమిళం ద్వారా రూ. 5 లక్షలు వచ్చాయి. ఇక 15వ రోజు అయిన శుక్రవారం (ఫిబ్రవరి 21) తండేల్ సినిమాకు రూ. 50 లక్షల వరకు ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు సక్నిల్క్ తెలిపింది.

తండేల్ థియేటర్ ఆక్యుపెన్సీ

దీంతో మూడో వారంలోకి అడుగుపెట్టింది తండేల్ సినిమా. అయితే, 15 రోజుల్లో ఇండియాలో తండేల్ సినిమాకు రూ. 61.20 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అలాగే, తండేల్ తెలుగు వెర్షన్ శుక్రవారం నాడు 15.83 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. ఇక, తండేల్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 15వ రోజు రూ. 49 లక్షలు వచ్చినట్లు సమాచారం.

 

తండేల్ గ్రాస్ కలెక్షన్స్

నాగ చైతన్య తండేల్ సినిమాకు ఓవర్సీస్‌లో 15 రోజుల్లో రూ. 11.5 కోట్ల గ్రాస్ రాగా ఇండియాలో రూ. 71.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లి పలు వెబ్‌సైట్స్ తెలిపాయి. అలాగే, ప్రపంచవ్యాప్తంగా రూ. 82.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తండేల్ మూవీకి వచ్చినట్లు సమాచారం.

తండేల్ లాభాలు

ఇదిలా ఉంటే, రూ. 37 కోట్ల బిజినెస్ చేసుకున్న తండేల్ సినిమాకు రూ. 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. అయితే, ఈ టార్గెట్ ఎప్పుడో పూర్తి కాగా 14 రోజుల్లో తండేల్ సినిమాకు రూ. 12.82 కోట్ల లాభాలు వచ్చాయి. దాంతో సూపర్ హిట్‌గా తండేల్ సినిమా నిలిచింది.

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024