



Best Web Hosting Provider In India 2024

Suicidal Thoghts: ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావడానికి ఈ విటమిన్ లోపం కూడా కారణమేనట
Suicidal Thoghts: కష్ట సమయాల్లో కొంతమందిలో ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. అలాంటి ఆలోచనలు రావడానికి 60 శాతం మందిలో ఒక విటమిన్ లోపం కూడా కారణమని తెలుస్తోంది.
ఆత్మహత్య ఆలోచనలు వచ్చి ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నిజానికి చిన్న చిన్న సమస్యలకే అలాంటి ఆలోచనలు కొంతమందికి వస్తాయి. ఒక వ్యక్తిలో ఆత్మహత్య ఆలోచనలు రావడానికి ఒక విటమిన్ లోపం కూడా కారణమేనని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ విటమిన్ లోపం వల్లే
కొంతమందికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాంటివారు ఆ ఉద్రేకంలో ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రం ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వస్తూ పోతూ ఉంటుంది. ఇలాంటి వారు మాత్రం తమకు ఏదైనా పోషకాహార లోపం ఉందేమోనని చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ డి లోపం వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తుంటాయి.
ఈ పరిశోధనలో మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హ్యూమన్ మెడిసిన్ వారు, స్వీడన్లోని యూనివర్సిటీ పరిశోధకులతో కలిసి చేశారు. విటమిన్ డి లోపం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుందని, ఇది ఆత్మహత్యా ప్రయత్నాలను పెంచుతుందని ఈ అధ్యయనంలో గుర్తించారు. ఆత్మహత్యకు ప్రయత్నించే వ్యక్తులలో విటమిన్ డి చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు.
పరిశోధన ఇలా…
ఈ అధ్యయనంలో భాగంగా ఆత్మహత్యకు ప్రయత్నించి బతికి బట్ట కట్టిన 59 మంది వ్యక్తులపై పరిశోధనా చేశారు. వారి ఆరోగ్య డేటాను పోల్చారు. వారిలో 60 శాతం మందికి విటమిన్ డి లోపం ఉన్నట్టు గుర్తించారు. విటమిన్ డి లోపం వల్ల వారు తీవ్రమైన డిప్రెషన్ బారిన పడినట్టు కనిపెట్టారు. దానివల్లే వారికి ఆత్మహత్య ఆలోచనలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయని గుర్తించారు.
విటమిన్ డి లోపం ఉన్నవారి రక్తంలో ఇన్ఫ్లమేషన్ సంకేతాలు అధికంగా ఉంటాయి. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా డిప్రెషన్ బారిన త్వరగా పడతారు. డిప్రెషన్ వల్ల జీవితంలో నిరాశ కమ్మేస్తుంది. ఆత్మహత్య ఆలోచనలను నియంత్రించలేక పోతారు.
కాబట్టి మానసిక ఆరోగ్య నిపుణులు విటమిన్ డి లోపం రాకుండా చూసుకోవాలని చెబుతూ ఉంటారు. ఎవరైనా రోగులు తమ దగ్గరికి వచ్చిన వారికి విటమిన్ డి క్యాప్పుల్స్ కూడా అందిస్తూ ఉంటారు. ఎందుకంటే విటమిన్ డి స్థాయిలు ఎప్పుడు తగ్గుతాయో అప్పుడు మానసిక సమస్యలు రావడం మొదలవుతాయి.
కాబట్టి మీ మానసిక స్థితి ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి లోపం రాకుండా చూసుకోండి. విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలను తినడానికి ప్రయత్నించండి. మష్రూమ్స్, కోడి గుడ్డు ప్రత్యేకంగా తినండి. అలాగే ఎండలో ప్రతిరోజూ ఒక గంట పాటు లేదా అరగంట పాటు ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడే శరీరానికి విటమిన్ డి పుష్కలంగా అందుతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం