



Best Web Hosting Provider In India 2024

Suriya Sister: హీరో సూర్య చెల్లెలు ఓ సింగర్ – అలియాభట్‌కు డబ్బింగ్ చెప్పింది – ఆమె చేసిన సినిమాలు ఏవంటే?
Suriya Sister: కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తి చెల్లెలు బృంద సింగర్‌గా తమిళంలో పలు సినిమాల్లో పాటలు పాడింది. బ్రహ్మాస్త్ర తమిళ వెర్షన్‌లో అలియాభట్‌కు డబ్బింగ్ చెప్పింది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బృంద శివకుమార్ చేసిన సినిమాలు ఏవంటే?
Suriya Sister: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సినీ నేపథ్యమున్నవారే. సూర్య తండ్రి శివకుమార్ 1980 -90 దశకంలో తమిళంలో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. శివకుమార్ బాటలోనే ఆయన తనయులు సూర్య, కార్తి యాక్టింగ్‌వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం సూర్య పాన్ ఇండియన్ హీరోగా ఇమేజ్‌ను సొంతం చేసుకోగా…డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ వెర్సటైల్ హీరోగా కార్తి కొనసాగుతోన్నాడు. సూర్య భార్య జ్యోతిక కూడా తెలుగు, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాలు చేసింది.
బృంద కూడా…
శివకుమార్‌కు సూర్య, కార్తి మాత్రమే కాకుండా బృంద అనే కూతురు కూడా ఉంది. అన్నయ్యల బాటలోనే బృంద కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. యాక్టర్‌గా కాదు సింగర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే అన్నయ్యల మాదిరిగా సక్సెస్ కాలేకపోయింది బృంద.
మిస్టర్ చంద్రమౌళి మూవీతో,…
తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ మిస్టర్ చంద్రమౌళితో సింగర్‌గా మారింది బృంద. టైటిల్ సాంగ్‌ను ఆలపించింది. ఆ తర్వాత రాక్షసి, జాక్‌పాట్, పొన్‌మగల్ వంధాల్‌తో పాటు ఓ2 సినిమాల్లో పాటలు పాడింది. తన సింగింగ్ జర్నీలో బృంద శివకుమార్ కేవలం ఐదు పాటలు మాత్రమే పాడింది. అందులో మూడు సినిమాలు జ్యోతిక నటించినవే కావడం గమనార్హం. జ్యోతిక హీరోయిన్‌గా నటించిన పొన్‌మగల్ వంధాల్‌లో బృంద శివకుమార్ పాడిన వా చెల్లామ్ పాట పెద్ద హిట్టయింది.
అలియాభట్‌కు డబ్బింగ్…
రణ్‌భీర్‌కపూర్, అలియా భట్ జంటగా నటించిన బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర తమిళ వెర్షన్‌కు బృంద శివకుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. ఈ మూవీలో అలియాభట్ పాత్రకు తమిళంలో బృంద డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బృంద శివకుమార్ పనిచేసిన ఒకే ఒక మూవీ బ్రహ్మాస్త్ర కావడం గమనార్హం.
వ్యాపారవేత్తతో పెళ్లి…
సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తమిళంలో పలు అవకాశాలు వచ్చినా కుటుంబ బాధ్యతల కారణంగా ఎక్కువగా సినిమాలు చేయలేకపోయింది. బృంద భర్త వ్యాపారవేత్త. ఆయన పేరు కూడా శివకుమార్ కావడం గమనార్హం.
సంబంధిత కథనం