


Best Web Hosting Provider In India 2024

Chiranjeevi: హిచ్‌కాక్ సినీ జీవితంపై తెలుగు బుక్ – సెకండ్ ఎడిషన్ లాంఛ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi: మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్ బుక్ సెకండ్ ఎడిషన్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంఛ్ చేశారు. ప్రపంచ సినిమా చరిత్రలో దిగ్గజ దర్శకుడి గురించి తెలుగులో బుక్ రావడం అభినందనీయమని చిరంజీవి పేర్కొన్నారు.
Chiranjeevi: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఆద్యుడిగా పేరుతెచ్చుకున్న ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ సినీ జీవితంపై తెలుగులో మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్ పేరుతో ఓ బుక్ వచ్చింది. సినీ రచయిత పులగం చిన్నారాయణతో పాటు ఐఆర్‌టీఎస్ అధికారి రవి పాడి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్ బుక్ సెకండ్ ఎడిషన్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంఛ్ చేశారు. తెలుగులో ఇటువంటి పుస్తకం తీసుకు రావడం అభినందనీయం అని చిరంజీవి అన్నారు.
పుస్తకాన్ని చదువుతా…
సెకండ్ ఎడిషన్ లాంఛ్ చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ… ”హిచ్ కాక్ సినిమాలు కొన్నిటిని నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో చూశాను. ఈ పుస్తకాన్ని ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పది పదిహేను రోజుల్లో చదివేస్తాను. ప్రపంచ సినిమా చరిత్రలో దిగ్గజ దర్శకుడి గురించి తెలుగులో బుక్ రావడం అభినందనీయం. ఇలాంటి పుస్తకాలను పులగం చిన్నారాయణ, రవి పాడి మరిన్ని సంకల్పించాలి” అని అన్నారు.
తొలి సినిమా విడుదలై వందేళ్లు..
సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలు అనగానే అందరికి గుర్తొచ్చే పేరు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ .ఆయనను స్ఫూర్తితో అనేక భాషల్లో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఆల్ఫెడ్ హిచ్‌కాక్ 125వ జయంతి తో పాటు ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు అయిన సందర్భంగా హిచ్‌కాక్ సినీ జీవితంపై ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ పేరుతో సినీ రచయిత పులగం చిన్నారాయణ – ఐఆర్‌టిఎస్ అధికారి రవి పాడితో కలిసి పుస్తకం తీసుకొచ్చారు. డిసెంబర్ 18న ఫస్ట్ కాపీ విడుదలైంది. ఐదు రోజుల్లో పుస్తకాలు అన్నీ అమ్ముడు కావడంతో సరికొత్త చేర్పులతో సెకండ్ ఎడిషన్ లాంచ్ చేశారు.
మల్లాది ముందు మాట…
ప్రసిద్ధ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ పుస్తకానికి ముందుమాట రాయడంతో పాటు ఆయన కెరీర్ లో తొలిసారి ఒక పుస్తకాన్ని ప్రశంసిస్తూ పాడ్ కాస్ట్ విడుదల చేశారు. అలాగే సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ కూడా ముందుమాట రాశారు.
62 వ్యాసాలు…
‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’లో 45 మంది దర్శకులు, ఏడు మంది రచయితలు, పది మంది జర్నలిస్టులు రాసిన మొత్తం 62 వ్యాసాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ కూడా బుక్‌పై ప్రశంసలు కురిపించారు.
సంబంధిత కథనం