



Best Web Hosting Provider In India 2024

Phool Makhana Making: ఫూల్ మఖానా ఎందుకంత ఖరీదు? వీటిని ఎలా తయారు చేస్తారు?
Phool Makhana Making: ఫుల్ మఖానా లేదా ఫాక్స్ నట్… వీటిని ఖరీదైన ఆహారంగా చెబుతారు. వీటికి ఎందుకంత ఖరీదు, వీటి తయారీ ఎలాగో తెలుసుకోండి.
ఫూల్ మఖానా ఆధునిక తరంలో సూపర్ ఫుడ్ గా పేరు తెచ్చుకున్న ఆహారం. మొన్న కేంద్ర బడ్జెట్లో కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఫుల్ మఖానా కోసం స్పెషల్‌గా ఒక బోర్డుని ఏర్పాటు చేస్తున్నారంటే అవి ఎంత ఆరోగ్యకరమైనవో తెలుసుకోవాలి. ఇవి ఎలా తయారవుతాయో, ఎందుకంharithaత ఖరీదో ఇక్కడ వివరించాము.
ఫూల్ మఖానా పోషకాలు అధికంగా ఉండే స్నాక్ ఐటమ్. ప్రపంచంలోని ఎంతోమంది వైద్యులు వీటిని తినమని సిఫారసు చేస్తారు. దీంతో అనేక రకాల వంటలు కూడా చేయవచ్చు. ఫూల్ మఖానా తయారీ భిన్నంగా ఉంటుంది. అందుకే దీని ఖరీదు ఎక్కువ.
తామర గింజలే…
ఫూల్ మఖానాను యూరియాల్ ఫాక్స్ అని కూడా పిలుస్తారు. మనదేశంలో వీటిని తామర గింజలు అంటారు. నీటిపై పెద్దగా గుండ్రంగా తేలియాడుతూ ఈ తామర మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. వీటి ఆకులు పెద్దపెద్దవిగా ఉంటాయి. వాటి అడుగునా నీటిలోనే ఈ గింజలు ఉంటాయి. వీటిని సేకరించి ఆ తర్వాత మఖానాను తయారు చేస్తారు.
గింజలు సేకరించడం చాలా కష్టం
ఈ తామర గింజలను సేకరించడం అంత సులువు కాదు. ఎందుకంటే ఈ తామర మొక్కలు బురద నీటిలోనే ఏర్పడతాయి. నీటి అడుగుకు వెళ్లి వాటిని సేకరించాలి. చెవులు, కళ్ళు అన్నింట్లోకి బురద వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. చర్మ సమస్యలు కూడా రావచ్చు. అందుకే వాటిని సేకరించే పద్ధతే చాలా కష్టంగా ఉంటుంది. ఈ మొక్కకు ,ముళ్ళు కూడా ఉంటాయి. కాబట్టి గింజలు తీసేటప్పుడు గాయాలు కూడా తగులుతాయి.
ఫూల్ మఖానాకి ఉన్న డిమాండ్ చూసి ఇటీవల రైతులు తమ పొలంలోనే వీటిని సాగు చేయడం మొదలుపెట్టారు. నీటి కుంటలను తవ్వి ఆ నీటిలోనే సాగు చేస్తున్నా.రు అయినా కూడా ఇది కష్టమైన ప్రక్రియ గానే చెప్పుకోవాలి.
బీహార్ లోనే ఎక్కువ పంట
ప్రస్తుతం ప్రపంచంలో పండుతున్న పూల్ మఖానాలో 90 శాతం బీహార్ రాష్ట్రానికి చెందినవే. ఇక్కడ పూల్ మఖానా భారీ ఉత్పత్తి జరుగుతుండడంతో బీహార్లోని మిథిలాంచల్ ప్రాంతంలో తయారు చేసిన మఖానాకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా వచ్చింది.
ప్రపంచంలో ఫూల్ మఖానా భారతదేశం తర్వాత చైనాలో పండిస్తున్నారు. మన దేశం నుంచి విదేశాలకు భారీగా పూల్ మఖానా ఎగుమతి అవుతోంది. మధ్యప్రదేశ్లో కూడా వీటిని పండించేవారు ఉన్నారు.
మఖానా తయారీ
బురద నీటిలో నుంచి ఈ గింజలను సేకరించాక దాని మురికి, మలినాలను తొలగించడానికి పరిశుభ్రంగా కడుగుతారు. ఆ తర్వాత ఎన్నో రోజుల పాటు ఎర్రటి ఎండలో ఎండబెడతారు. ఈ ఎండిన గింజలను మట్టి ఇనుప పాత్రలో వేసి ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేయిస్తారు.
మొదటిసారి కాల్చిన తర్వాత 15 గంటల పాటు అలా వదిలేస్తారు. తర్వాత వాటిని మళ్ళీ రెండో రౌండ్లో కాలుస్తారు. 100 కిలోల పూల్ మఖానా గింజలు కాల్చడానికి 10 మంది వ్యక్తులు అవసరం. ఫూల్ మఖానాను ఎవరు పడితే వారు చేయలేరు దానిపై అవగాహన ఉండాలి. ప్రతి గింజను సరైన ఉష్ణోగ్రతకు ఒత్తిడికి గురి చేసినప్పుడే అది పూల్ మఖానాగా ఉబ్బుతుంది.
తయారుచేసిన పూల మఖానాలను జాగ్రత్తగా ప్యాకేజింగ్ చేయడం కూడా అవసరం. ప్యాకేజింగ్ సరిగా లేకపోతే అది పాడైపోయే అవకాశం ఉంటుంది. ప్యాకేజింగ్ చక్కగా ఉంటే ఉత్పత్తి ధర కూడా పెరుగుతుంది. ఇంత కష్టపడితే తయారు చేస్తారు కాబట్టే పూల్ మఖానాకు ధర ఎక్కువ. అయితే ఇది అందించే పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
ఫూల్ మఖానాలో పోషకాలు
పూల్ మఖానాలో మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం, భాస్వరం, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. కేలరీలు కొవ్వు తక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని ఆరోగ్యకరమైన స్నాక్ గా చెప్పుకుంటారు. కొలెస్ట్రాల్, సోడియం కూడా ఎంతో తక్కువగా ఉంటాయి. కాబట్టి గుండె ఆరోగ్యానికి ఫూల్ మఖానా ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి ఇది సహాయపడుతుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. కాబట్టి డయాబెటిస్ రోగులు సంతోషంగా వీటిని సంతృప్తిగా తినవచ్చు. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మంపై ముడతలు, గీతలు రాకుండా అడ్డుకుంటాయి. అకాల వృద్ధాప్యాన్ని అడ్డుకుంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. కాబట్టి చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు కూడా ఫూల్ మఖానా ఉపయోగపడుతుంది.
సంబంధిత కథనం