Hyderabad Murder : హైదరాబాద్ లో మరో దారుణ హత్య, నడిరోడ్డుపై తండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు

Best Web Hosting Provider In India 2024

Hyderabad Murder : హైదరాబాద్ లో మరో దారుణ హత్య, నడిరోడ్డుపై తండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు

Bandaru Satyaprasad HT Telugu Feb 22, 2025 05:43 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Feb 22, 2025 05:43 PM IST

Hyderabad Murder : హైదరాబాద్ లో మరో దారుణ హత్య జరిగింది. మద్యం తాగి నిత్యం ఇంట్లో గొడవ చేస్తున్నాడని తండ్రిపై కొడుకు కత్తితో దాడి చేశాడు. ఈసీఐఎల్ బస్ టెర్మినల్ వద్ద నడిరోడ్డుపై తండ్రిని కత్తితో పొడిచి హత్య చేశాడు.

హైదరాబాద్ లో మరో దారుణ హత్య, నడిరోడ్డుపై తండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు
హైదరాబాద్ లో మరో దారుణ హత్య, నడిరోడ్డుపై తండ్రిని కత్తితో పొడిచి చంపిన కొడుకు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Hyderabad Murder : హైదరాబాద్ లో మరో దారుణ హత్య జరిగింది. ఇటీవల మేడ్చల్ లో సోదరుడిపై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కన్న కొడుకే తండ్రిపై కత్తితో దాడి చేసి అతి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన ఆరెల్లి మొగిలి(45), అతడి కుమారుడు సాయి కుమార్ (25) ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. మొగిలి నిత్యం మద్యం తాగి ఇంట్లో గొడవ చేస్తుండడంతో కొడుకు సాయికుమార్‌ విసిగిపోయాడు. దీంతో శనివారం మధ్యాహ్నం లాలాపేట నుంచి మొగిలి బస్సులో బయలుదేరారు. బైక్ పై అతడిని కుమారుడు ఫాలో అయ్యాడు.

సీసీ కెమెరాలో రికార్డు

ఈసీఐఎల్‌ బస్‌ టెర్మినల్‌ సమీపంలో బస్సు దిగిన తండ్రి మొగిలిపై సాయి కుమార్ కత్తితో దాడి చేశాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే మొగిలిని విచక్షణారహితగా పొడిచాడు. తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్న మొగిలిని స్థానికులు సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయి కుమార్ కత్తితో దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మొగిలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాల కారణంగానే తండ్రిపై సాయికుమార్‌ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు.

మేడ్చల్ జాతీయ రహదారిపై మర్డర్

మేడ్చల్‌ జాతీయ రహదారిపై గత ఆదివారం మధ్యాహ్నం దారుణ హత్య జరిగింది. తొడబుట్టిన అన్నను కుటుంబ వివాదాల నేపథ్యంలో సొంత తమ్ముళ్లు కత్తులతో పొడిచి చంపేశారు. ఆ మార్గంలో వెళ్లే వారు ఎవరు హత్యను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కొందరు వీడియోలు తీయడంతో అది వైరల్‌గా మారింది. మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నందుకు తమ్ముళ్లు చంపేసినట్టు పోలీసులు తెలిపారు.

మేడ్చర్‌ నేషనల్‌ హైవే 44పై ఆదివారం(ఫిబ్రవరి 16) మధ్యాహ్నం దారుణం జరిగింది. ఓ వ్యక్తిని అంతా చూస్తుండగానే కొందరు యువకులు వెంటాడి పొడిచి చంపారు. కింద పడిపోయిన వ్యక్తి ప్రాణాలు పోయే వరకు కత్తులతో పొడుస్తూనే ఉన్నారు. ఈ దారుణాన్ని ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నిందితులను మృతుడి సొంత తమ్ముడు, చిన్నాన్న కుమారుడిగా గుర్తించారు. ఇంట్లో నుంచి వెంట పడి, కత్తులతో పొడిచి చంపడం చూసిన వారిని భీతావహుల్ని చేసింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు చెందిన గుగు లోత్ గన్యా మేడ్చల్ ఆర్టీసీ డిపోలో బస్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. గన్యాకు ఇద్దరు కుమారులు ఉమేశ్‌, రాకేశ్‌‌తో పాటు ఒక కుమార్తె హరిణి ఉన్నారు.

గన్యా కుటుంబం మేడ్చల్ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటోంది. మృతుడు ఉమేశ్‌కు భార్య ప్రియాంక, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా మద్యానికి బానిసగా మారిన ఉమేశ్‌ తరచూ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. ఇంట్లో వారిపై కూడా పలుమార్లు దాడులు చేశాడు. కొద్ది రోజుల క్రితం తల్లి దండ్రులతో పాటు తమ్ముడు రాకేశ్‌, అతడి భార్యపై దాడి చేశాడు.

ఆదివారం మద్యం సేవించి మళ్లీ గొడవకు దిగాడు. ఉమేశ్‌ తీరుతో విసిగిపోయిన రాకేశ్, అతడి చిన్నాన్న కుమారుడు లక్ష్మణ్, మరో ముగ్గురు స్నేహితులు వాదనకు దిగారు. ఈ క్రమంలో వారిపై ఉమేశ్ బీరు సీసాతో దాడి చేశాడు. దీంతో వారు ఎదురుదాడి చేశారు. భయంతో ఉమేశ్ ఇంట్లో నుంచి వీధిలోకి పరుగెత్తుకుంటూ వచ్చి జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు. కోపం చల్లారని రాకేశ్, లక్ష్మణ్ అతడిని వదిలి పెట్టలేదు. రోడ్డుపై పట్టుకుని కత్తులతో కసిదీరా పొడవడంతో ఉమేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

HyderabadMurder CaseCrime TelanganaTelangana NewsTelugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024