



Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu: శృతి చేతుల మీదుగా మీనా షాప్ ఓపెన్ – భార్య సర్ప్రైజ్కు బాలు ఫిదా – సత్యం హ్యాపీ!
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంటలు ప్రోమోలో తనను షాప్ ఓనర్‌ను చేసిన బాలుకు మీనా రోజ్ ఫ్లవర్ గిఫ్ట్‌గా ఇస్తుంది. మీనా ఇచ్చిన గిఫ్ట్ చూసి బాలు పొంగిపోతాడు. డబ్బులు ఇచ్చి తనను అవమానించిన బాలుపై రివేంజ్ తీర్చుకుంటానని శపథం చేస్తుంది శృతి.
Gunde Ninda Gudi Gantalu: మీనాను తన ఫ్యామిలీ ఓ పనిమనిషిలా ట్రీట్ చేయడం బాలు సహించలేకపోతాడు. మీనా చేత పూల కొట్టు పెట్టిస్తాడు. ఆ షాప్‌ను శృతి చేత ఓపెన్ చేయిస్తాడు. పూల దుకాణం పెట్టాలనే ఆలోచనకు కారణం శృతినే అని బాలు అంటాడు. రిబ్బన్ కట్ చేసిన శృతికి మీనా చేతుల మీదుగా కవర్ అందజేస్తాడు బాలు. షాప్ ఓ పెనింగ్ చేసినందుకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నానని అంటాడు.
శృతికి డబ్బులు ఇవ్వడానికి మీనా సంకోచిస్తుంది. పని చేసినందుకు నీకు ఇచ్చినప్పుడు…నువ్వు కూడా శృతికి ఇవ్వాలని బాలు అంటాడు. శృతి డబ్బు వద్దని అంటుంది. కానీ సత్యం ఆ డబ్బు తీసుకోమని అనడంతో కోపంగా మీనా చేతిలోని కవర్ అందుకుంటుంది శృతి.
అసూయ, ద్వేషంతో…
బట్టలు ఉతికినందుకు మీనాకు తాను రెండు వేలు ఇచ్చినందుకు ప్రతీకారంగా తనతో బాలు షాప్ ఓపెన్ చేయించాడని శృతి కనిపెడుతుంది. నేను నీ కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వగలనని చెప్పడానికే ఐదు వందలు ఎక్కువగా ఇచ్చాడని తెలిసి కోపంతో రగిలిపోతుంది.
తనపై అసూయ, ద్వేషంతోనే బాలు ఈ పని చేశాడని రవితో అంటుంది. తాను మీనాతో క్లోజ్‌గా ఉండటం బాలు చూడలేకపోతున్నాడని అపార్థం చేసుకుంటుంది. భార్య మాటలను రవి తప్పు పడతాడు. బాలు మంచివాడని వాదిస్తాడు. షాప్ విషయంలో రవితో శృతి గొడవపడుతుంది. బాలు వదిలిపెట్టనని ఛాలెంజ్ చేస్తుంది.
ప్రభావతి చిందులు…
తన పేరు మీద బాలు పూల షాప్ పెట్టడం అవమానంగా ఫీలవుతుంది ప్రభావతి. తన పరువు పోయిందని గగ్గోలు పెడుతుంది.తిండికి గతిలేక పూల షాప్ పెట్టుకున్నానని అందరూ అనుకుంటారని భర్తతో చెబుతుంది ప్రభావతి. కామాక్షితో పాటు బంధువులు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పడంతో ప్రభావతి కోపం రెట్టింపు అవుతుంది. సత్యం మాత్రం మీనా పూల కొట్టు పెట్టిన సంగతి తన స్నేహితులకు చెప్పుకుంటూ సంబరపడిపోతాడు. మీనా ఇంటి పని ఎగ్గొట్టడానికే పూల షాప్ పెట్టిందని ప్రభావతి ఆపోహపడుతుంది. ఆ షాప్‌ను ఎలాగైనా మూయించేయాలని పథకం వేస్తుంది.
బాలుకు గిఫ్ట్…
బాలు మంచి మనసుకు మీనా ఫిదా అయిపోతుంది. తన బాధను, మనసులోని ఆవేదనను అర్థం చేసుకోవడం చూసి సంబరపడుతుంది. మీరు నా పక్కన ఉంటే ఏదైనా సాధించగలనని అనిపిస్తుందని బాలుతో చెబుతుంది. నాకు ధైర్యాన్ని ఇచ్చి…నాపై నాకు నమ్మకం పెంచినందుకు మీకు ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నానని మీనా అంటుంది.
భార్య ఏం బాహుమతి ఇస్తుందోనని బాలు ఎదురుచూస్తాడు. బాలుకు రోజ్ ఫ్లవర్ గిఫ్ట్‌గా ఇస్తుంది మీనా. మీనా ఇచ్చిన రోజ్ ఫ్లవర్ చూసి బాలు సండరపడతాడు? ఆ తర్వాత ఏమైంది? మీనా షాప్‌ను మూయించేందుకు ప్రభావతి ఏం చేసింది అన్నది తెలియాలంటే సోమవారం నాటి గుండె నిండా గుడిగంటలు సీరియల్ చూడాల్సిందే.
సంబంధిత కథనం