



Best Web Hosting Provider In India 2024

Attitude Star: మిస్ ఇండియా ఫైనలిస్ట్‌తో ఆటిట్యూడ్ స్టార్ రొమాన్స్ – రెడ్డి మామ సాంగ్ రిలీజ్ చేసిన దిల్‌రాజు
Attitude Star: రామ్ నగర్ బన్నీ తర్వాత ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. ఈ మూవీలోని రెడ్డి మాట సాంగ్‌ను దిల్‌రాజు రిలీజ్ చేశాడు. ఈ మూవీలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తోన్నాడు.
Attitude Star: రామ్‌నగర్ బన్నీ తర్వాత ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తోన్న మూవీ బరాబర్ ప్రేమిస్తా. ఈ సినిమాకు సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చంద్రహాస్‌కు జోడీగా మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తోంది.
రెడ్డి మామ…
తాజాగా బరాబర్ ప్రేమిస్తా మూవీలోని ఓ మాస్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. ‘రెడ్డి మామ’ అంటూ హుషారుగా సాగే ఈ పాటను సురేష్ గంగుల రచించారు. నకాష్ అజిజ్, సాహితి చాగంటి ఆలపించగా.. ఆర్ఆర్ ధృవణ్ మ్యూజిక్ అందించారు. . ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్‌గా ఈ పాట ఉందని దిల్ రాజు ప్రశంసించారు. క్లాస్‌తో పాటు మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుందని తెలిపారు.
మిస్ ఇండియా ఫైనలిస్ట్…
బరాబర్ ప్రేమిస్తా సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ ఈ సినిమాతోనే హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇష్టంగా మూవీ ఫేమ్ అర్జున్ మహా బరాబర్ ప్రేమిస్తా సినిమాలో విలన్‌గా నటించాడు.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో…
ఇటీవల బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రూపొందుతోన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ యాస, భాషలతో డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించాడు. లవ్ రివేంజ్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. బరాబర్ ప్రేమిస్తా మూవీలో మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
యావరేజ్…
రామ్‌నగర్ బన్నీ మూవీతో హీరోగా టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు చంద్రహాస్. ఈ సినిమాను చంద్రహాస్ తండ్రి, సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ ప్రొడ్యూస్ చేశాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో చంద్రహాస్‌ను ట్రోల్ చేశారు. ఆటిట్యూడ్ స్టార్ అంటూ విమర్శించారు. ఆ పేరునే ట్యాగ్‌లైన్‌గా వాడేసుకున్నాడు చంద్రహాస్.
రామ్‌నగర్ బన్నీతో మరో రెండు సినిమాలు చేస్తున్నాడు చంద్రహాస్. చంద్రహాస్ సోదరి దివిజ ప్రభాకర్ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. హే చికీతా పేరుతో ఓ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
సంబంధిత కథనం