



Best Web Hosting Provider In India 2024

Hair-Washing Process: జుట్టును బట్టి ఎన్నిసార్లు తలస్నానం చేయాలో తెలుసా? శుభ్రంగా ఉంచుకోవాలనే తపనతో ఈ తప్పులు చేయకండి!
Hair-Washing Process: తలస్నానం చేయడంలో చాలా మంది కామన్‌గా మిస్టేక్స్ చేస్తుంటారు. ఎన్నిసార్లు చేయాలో, ఎలా చేయాలో తెలియకుండానే పదేపదే అదే పొరబాటు చేస్తుంటారు. మరి సరైన విధానం ఏంటో తెలుసుకుందామా?
Hair-Washing Process: మీరెప్పుడైనా ఆలోచించారా? జుట్టును బాగా శుభ్రం చేసేస్తున్నారా? లేదంటే, అవసరం కంటే తక్కువగానే క్లీన్ చేసుకుంటున్నారా? అని. కొందరు వారానికి ఒకసారి తలస్నానం చేస్తే, మరికొందరు ఇష్టమొచ్చినప్పుడు తలంటు పోసుకుని శుభ్రం చేసుకున్నామని ఫీలవుతారు. అసలు ఈ రెండింటిలో ఏది కరెక్ట్? మీ జుట్టును బట్టి మీరెన్నిసార్లు తలస్నానం చేయాలి? వాతావరణం మారితే తలస్నానం చేసే పద్దతి కూడా మార్చాలా? మీ ఈ సందేహాలన్నీ తీర్చే విధంగా, తలస్నానం గురించి పూర్తి సమాచారం ఇక్కడ మీ ముందుంచాం. చూసేయండి మరి!
జుట్టు రకాన్ని బట్టి ఎన్నిసార్లు తలస్నానం చేయాలి?
ఆయిలీ హెయిర్: ఇలాంటి జుట్టు ఉన్న వారికి తలస్నానం చేసిన మరుసటి రోజే జిడ్డుగా అనిపిస్తుంది. ఇటువంటి వారు రెండ్రోజులకు ఒకసారి తలస్నానం చేయొచ్చు. కాకపోతే వారానికి ఒకసారి సల్ఫేట్ ఫ్రీ షాంపూ వాడటం వల్ల సమస్య పెరగకుండా ఉంటుంది.
పొడి లేదా ఉంగరాల జుట్టు: ఉంగరాల జుట్టు త్వరగా పొడిబారి పోతుంటుంది. ఇటువంటి వారు కండీషనర్ తో పాటు లేదా మాయిశ్చర్ తో వారానికి రెండు సార్లు తలస్నానం చేయాలి.
స్ట్రైట్ జుట్టు: స్ట్రైట్ హెయిర్ కి చాలా త్వరగా జిడ్డు పట్టేస్తుంది. ఇటువంటి వారు రెండు-మూడ్రోజులకు ఒకసారి తలస్నానం చేయడం ఉత్తమం. మీ జుట్టు మరింత స్ట్రైట్ చేసేది కాని షాంపూలు వాడితే సరిపోతుంది.
తలస్నానం చేయడాన్ని ప్రభావితం చేసే మరికొన్ని అంశాలు:
వ్యాయామం: మీరు రోజూ వ్యాయామం చేయడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. తల వెంట్రుకల్లో పట్టే ఈ చెమట ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి తరచుగా తలస్నానం చేస్తుండాలి.
వాతావరణం లేదా సీజన్: వేసవి కాలంలో మీ జుట్టు ఎక్కువ జిడ్డుగా మారుతుంది. అదే చలికాలంలో ఎక్కువ రోజుల పాటు తలస్నానం చేయకపోయినా ఇబ్బంది అనిపించదు.
వాడుకునే ప్రొడక్ట్‌లను బట్టి: మీరు స్టైలింగ్ ప్రొడక్టులు ఎక్కువగా వాడుతుంటే కూడా ఎక్కువసార్లు తలస్నానం చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ ప్రొడక్టుల వల్ల జుట్టులో ఇతర కెమికల్ రియాక్షన్స్ జరిగి కేశాలకు ఇబ్బందిగా మారుతుంది.
తలస్నానం చేసే సరైన విధానం:
- మీ వెంట్రుకల కుదుళ్లలో గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసుకోవడం వల్ల జిడ్డు త్వరగా తొలగిపోతుంది.
- వేడి నీళ్లు పోసుకోవడం వల్ల తలలో జిడ్డు అంతగా తొలగిపోదు. దానికి బదులు సాధారణ నీరు వాడితేనే మంచిది.
- కుదుళ్లకు షాంపూ పెట్టడం, కండీషనింగ్ చేయడం మీదే ఫోకస్ ఉంచండి. జుట్టు చివర్లకు షాంపూ అదే చేరుతుంది.
- మైక్రో ఫైబర్ టవల్ తీసుకుని జుట్టును తుడుచుకుని ఆరబెట్టుకోండి.
తలస్నానం చేయడం విషయంలో ఉండే అపోహలు:
“తలస్నానం తక్కువగా చేస్తే వెంట్రుకలు బాగా ఎదుగుతాయి” తలస్నానం చేయడానికి తలలో వెంట్రుకలు ఎదగడానికి ఏ సంబంధం లేదు.
“తలస్నానానికి డ్రై షాంపూ మంచిది” డ్రై షాంపూ తలలో ఉన్న జిడ్డును తొలగిస్తుంది. కానీ, తలలోని డాండ్రఫ్ ను వదిలించలేదు.
“ఎక్కువసార్లు తలస్నానం చేయడం వల్ల తలలో జిడ్డు తక్కువ ఉత్పత్తి అయ్యేలా చేసుకోవచ్చు“ ఆయిల్ ఉత్పత్తులను నియంత్రించడం హార్మోన్లపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువసార్లు తలస్నానం చేస్తే ఈ సమస్య పరిష్కారం కాదు.
సంబంధిత కథనం