



Best Web Hosting Provider In India 2024

SLBC Tunnel Accident : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా, సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్
SLBC Tunnel Accident : ఎస్ఎల్బీసీ టన్నెల్ పైకప్పు కూలి 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన ప్రధాని మోదీ సహాయక చర్యలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఎన్టీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తామని ప్రధాని మోదీ తెలిపారు.
SLBC Tunnel Accident : నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ లో వివరించారు. సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని సీఎం ప్రధానికి తెలిపారు.
సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి వివరించారు. సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీంను పంపిస్తామని సీఎంకు ప్రధాని మోదీ తెలిపారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆరా
నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితికి సమీక్షిస్తున్నారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు.
డీఐజీ, ఐజీ, ఇరిగేషన్ ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు అధికారులు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారందరికీ మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.
ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్ఆర్డీఎఫ్ బృందాలు ప్రమాదస్థలికి చేరుకోనున్నాయి. సహాయక చర్యలు చేపట్టే విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది కార్మికులు
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్(SLBC) వద్ద శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్ పైకప్పు కూలి 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. కార్మికులను రక్షించేందుకు ప్రమాద స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా మంత్రులు తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో ఇద్దరు ఇంజినీర్లు, ఆరుగురు కూలీలు బరదలో వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్‌ను కూడా పిలిపిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్