



Best Web Hosting Provider In India 2024

Malayalam OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన మలయాళం రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ – ఐఎమ్‌డీబీలో 9.6 రేటింగ్!
Malayalam OTT: మలయాళం రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ ఫిబ్రవరి 14 శనివారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ సినిమాలో హరిత్, ఐశ్వర్య నంబియార్ హీరోహీరోయిన్లుగా నటించారు. 2023లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చింది.
Malayalam OTT: మలయాళం మూవీ ఫిబ్రవరి 14 సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. శనివారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 2023 అక్టోబర్‌లో ఫిబ్రవరి 14 మూవీ థియేటర్లలో రిలీజైంది. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడం గమనార్హం.
ఐఎమ్‌డీబీలో…
ఈ రొమాంటిక్ లవ్ డ్రామా మూవీలో హరిత్, ఐశ్వర్య నంబియార్, నందు, మేఘనాథన్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ చందత్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 14 టైటిల్‌తో పాటు టీజర్, ట్రైలర్‌తో మలయాళం ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నది. కాన్సెప్ట్ బాగున్నా నాయకానాయికల కెమిస్ట్రీ సరిగ్గా కుదరకపోవడంతో యావరేజ్‌గా నిలిచింది. ఐఎమ్‌డీబీలో మాత్రం ఈ మూవీ 9.6 రేటింగ్‌ను దక్కించుకోవడం గమనార్హం.
ఫిబ్రవరి 14 కథ ఇదే…
పదిహేనేళ్ల వయసులోకోల్పోయిన ప్రేమను నలభై ఏళ్లలో ఓ వ్యక్తి ఎలా దక్కించుకున్నాడనే పాయింట్‌తో ఫిబ్రవరి 14 మూవీని డైరెక్టర్ తెరకెక్కించాడు. అనంత్ ఓ రేడియో జాకీ. నలభై ఏళ్లు వచ్చినా పెళ్లిచేసుకోడు. ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా తిరస్కరిస్తుంటాడు. ఓ ఫిల్మ్ డైరెక్టర్‌తో సినిమా కథ రాసేందుకు అనంత్‌ను కలుస్తాడు.
టీనేజ్‌లో ఓ అమ్మాయిని అనంత్ గాఢంగా ప్రేమించిన సంగతి బయటపడుతుంది. తండ్రి కారణంగా అనంత్ లవ్ ఫెయిలవుతుంది. ఆ ఫిల్మ్ డైరెక్టర్ కారణంగా తాను ప్రేమించిన అమ్మాయిని చాలా ఏళ్ల తర్వాత అనంత్ కలుస్తాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ అమ్మాయి కూడా అనంత్‌ను ప్రేమించిందా? కొడుకు ప్రేమకు అనంత్ తండ్రి ఎందుకు అడ్డు చెప్పాడు అన్నదే ఈ మూవీ కథ.
మోహన్‌లాల్ మూవీలో…
ఫిబ్రవరి 14 లో హీరోగా నటించిన హరిత్…మలయాళంలో పలు సినిమాలు చేశాడు. మోహన్‌లాల్ ఒడియన్‌లో నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించాడు. నోట్‌బుక్, ఎంథమ్ సినిమాలు హరిత్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దర్శకుడు విజయ్ చందత్‌కు ఇదే ఫస్ట్ మూవీ. ఈ సినిమా మ్యూజిక్ కూడా విజయ్ సమకూర్చాడు.
ఫిబ్రవరి 14 మూవీలోని అరికిల్ నీ పాట పెద్ద హిట్టయింది. ఈ పాటను దిగ్గజ గాయకుడు కేజే ఏసుదాస్ ఆలపించడం గమనార్హం. ఈ పాటతోనే ఫిబ్రవరి 14 మూవీకి మంచి క్రేజ్ వచ్చింది.
సంబంధిత కథనం