



Best Web Hosting Provider In India 2024

Good Bacteria Deficiency: పేగుల్లో మంచి బ్యాక్టీరియా లోపించిందా? ఈ 5 సమస్యలు రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాల్సిందే!
Good Bacteria Deficiency:పేగుల్లో బ్యాక్టీరియా అనేది చాలా కీలకం. చెడు బ్యాక్టీరియా ఎన్ని ఇబ్బందులు కలగజేస్తుందో, మంచి బ్యాక్టీరియా అన్ని ప్రయోజనాలు ఇస్తుంది. ఫోలిక్ యాసిడ్, నియాసిన్, విటమిన్ బి6, విటమిన్ బి12 వంటి విటమిన్ల తయారు చేసే మంచి బ్యాక్టీరియా లోపిస్తే ఏమేం సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.
ఆహారం జీర్ణం కావడానికి పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉంటాయి. అవి తగ్గిపోతే జీర్ణక్రియ మాత్రమే కాదు, శరీరంలో ఇతర సమస్యలు కూడా వస్తాయి. శరీరంలో చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా ఉంటేనే సమతూకంగా ఉంటుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెంచాలని వైద్యులు అందుకే సూచిస్తుంటారు. నిజానికి, పేగుల్లో లక్షలాది బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌లు ఉంటాయి. అవి గట్ మైక్రోబయోమ్‌ను ఏర్పరుస్తాయి. ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ జీర్ణక్రియతో పాటు రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యానికి కూడా అవసరం.
మీరు తీసుకునే ఆహారంలో లోపాలు ఉన్నట్లయితే, కారణంగా పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి తగ్గిపోతుంది. అలా జరిగినప్పుడు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనికి కేవలం ఉన్న ఒకటే రెమెడీ మంచి బ్యాక్టీరియాను పెంచడమే.
పేగుల్లో మంచి బ్యాక్టీరియా తగ్గిపోతే ఏం జరుగుతుందో తెలుసుకోండి.
జుట్టు రాలడం
మంచి బ్యాక్టీరియా లోపించడం వల్ల కలిగే మార్పుల్లో మొదటిది జుట్టు రాలిపోవడం. ఏ కారణం లేకుండా మీ జుట్టు అకస్మాత్తుగా వేగంగా రాలిపోతుంటుంది. తలలో వెంట్రుకలు చాలా పలుచగా మారిపోతుంటాయి. దానికి కారణం పొట్టలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం తక్కువగా జరుగుతుందనే విషయాన్ని గ్రహించాలి.
చర్మ వ్యాధులు
చర్మంపై అనేక రకాల వ్యాధులు వస్తున్నట్లయితే, దానికి ఒక కారణం పేగుల్లో మంచి బ్యాక్టీరియా లేకపోవడం. మంచి బ్యాక్టీరియా సరైన మొత్తంలో ఉత్పత్తి కాకపోతే సోరియాసిస్, ఎగ్జిమా, రోసియా, పొడి చర్మం, దురద వంటి సమస్యలు వస్తుంటాయి. చెడు బ్యాక్టీరియా అయిన లిపోపాలిసాకరైడ్ చర్మానికి చేరడానికి అనుమతి ఇస్తున్నారని అర్థం. కాబట్టి మంచి బ్యాక్టీరియాను పెంచడానికి ప్రయత్నించండి.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
కోపం, ఒత్తిడి, చిరాకు, ఆందోళన వంటి ఫీలింగ్స్ తరచూ కలుగుతుంటాయి. మనసుకు సంతోషం లేకుండా, రాత్రుళ్లు నిద్ర కూడా సరిపట్టదు. ఒకవేళ నిద్ర మధ్యలో మెలకువ వచ్చిందంటే, ఇక నిద్రపట్టదు. ఎందుకంటే పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే న్యూరోట్రాన్స్‌మిటర్లు లోపం ఉన్నట్లయితే, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది.
జీర్ణక్రియపై ప్రభావం
పేగుల్లో మంచి బ్యాక్టీరియా లోపం చెడు బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. దీని కారణంగా మలబద్ధకం, లూజ్ మోషన్స్ అవడం, అతిసారం లేదా ఉబ్బరం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. తరచూ మీరు మల విసర్జన చేస్తున్న సమయంలో ఇవే లక్షణాలు కనిపిస్తుంటే, ఇది పూర్తిగా మంచి బ్యాక్టీరియా లోపం అనే విషయాన్ని గ్రహించాలి.
జలుబు, ఫ్లూ
గట్ ఆరోగ్యం రోగనిరోధక వ్యవస్థపై చాలా ప్రభావం చూపుతుంది. పేగుల్లో చెడు బ్యాక్టీరియా పెరిగిపోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీని వల్ల సాధారణ జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి.
ఈ సమస్యలను నివారించడానికి మంచి బ్యాక్టీరియాను పెంచాలని ఫిక్స్ అయిపోయారా.. అయితే ప్రోబయాటిక్స్ ఉన్న ఆహారం తీసుకోండి. పేగులకు అనుకూలమైన ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించవచ్చు. ఇవి తెలుసుకున్న తర్వాత జీర్ణక్రియ మెరుగుదలకు, రోగనిరోధక శక్తి బలపడటానికి, మానసిక ఆరోగ్యం బాగుపడటానికి కీలకమైన మంచి బ్యాక్టీరియాను పెంచుకోవాలని ఫిక్సయ్యారా..!
సంబంధిత కథనం