


Best Web Hosting Provider In India 2024

Methi Tepla Recipe: గోధుమ పిండితో రోటీన్ రొట్టెలకు బదులుగా మేతీ థెప్లాస్ తయారు చేశాంటే మిమ్మల్ని మెచ్చుకోని వారుండరు!
Methi thepla Recipe: గోధుమపిండితో రోజూ చేసుకునే రొట్టెలకు బదులుగా మేతీ థెప్లాస్ తయారు చేసుకుని తినండి. గుజరాతీయల ఫేమస్ డిష్ అయిన ఈ వంటకం తిన్నారంటే ఇంట్లో అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు.
గోధుమపిండి చపాతీలు, రొటీలు రోజూ చేసుకునేలా కాకుండా కొత్తగా తినాలని అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుంది. గుజరాతీయుల ఫేమస్ డిష్ అయిన మేతీ థెప్లాస్ రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్గానూ, రాత్రిపూట అల్పాహారంగానూ తినచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకూ, ఫిట్ నెస్ ప్రియుల నుంచి పేషెంట్ల వరకూ ప్రతి ఒక్కరూ వీటిని నిస్సందేహంగా తినచ్చు.
ఈ మేతీ థెప్లాస్లను ఒక్కసారి చేసుకున్నారంటే వారం రోజుల పాటు తినచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు చేయాలనుకునే వారు వీటిని చేసుకుని బయల్దేరారంటే వారం రోజుల పాటు ఆహారం విషయంలో బాధపడాల్సిన అవసరం ఉండదు. గుజరాతీ స్టైల్ రొట్టెలు అదేనండీ మేతీ థెప్లాస్ తయారీకి ఏయే పదార్థాలు కావాలో, తయారు చేసే పద్దతి ఏంటో తెలుసుకుందాం రండి.
మేతీ థెప్లాస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
- గోధమపిండి – ఒక కప్పు
- శనగపిండి – పావు కప్పు
- మెంతి ఆకులు -ఒక కప్పు
- కారం పొడి- అర టీస్పూన్
- పసుపు – పావు టీ స్పూన్
- ఉప్పు – అర టీ స్పూన్
- నూనె – ఒక టీస్పూన్
- పెరుగు – రెండు టీస్పూన్లు
- నీరు- తగినంత
మేతీ థెప్లాస్ తయారు చేసే విధానం..
- మేతీ థెప్లాస్ తయారు చేయడం కోసం ముందుగా మెంతి కూరను తీసుకుని ఆకులను సపరేట్ చేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి.
- తరువాత మెంతి ఆకులను చిన్నగా తరిగి పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో గోధుమి పిండి, శనగపిండి, సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి ఆకులు, కారం పొడి, పసుపు, నూనె, పెరుగుతో పాటు రుచికి తగినంత ఉప్పు వేసి కలపండి.
- ఇప్పుడు కొద్దిగా కొద్దిగా నీరు పోసుకుంటూ పిండిని రోటీలు తయారు చేసుకునేందుకు తగినట్లుగా తయారు చేసుకోండి.
- తర్వాత ఈ పిండిని చిన్న చిన్న వుండలుగా చేసుకుని చపాతీల్లాగా థెప్లాలను తయారు చేసుకోండి. ఇవి మరీ పలచగా కాకుండా, మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఉండేలా చేసుకోండి.
- ఇప్పుడు పెనం తీసుకుని దాని మీద ముందుగా తయారు చేసి పెట్టుకున్న థెప్లాలను ఒక్కొక్కటిగా వేసి నూనె వేస్తూ చపాతీలను కాల్చినట్టు కాల్చిండి.
- థెప్లాలు రంగు మారేంత వరకూ మీడియం ఫ్లేం మీద మాత్రమే కాల్చండి.
అంతే ఆరోగ్యకరమైన, రుచికరమైన గుజరాతీ స్టైల్ మేతీ థెప్లాస్ తయారు అయినట్టే.
వీటిని గుజరాతీయులు నూనెలో వేయించుకున్న పచ్చిమిరపకాయలతో కలిపి తింటారు, లేదా నచ్చిన గ్రేవీ కూరలు లేదా టమాటో కెచప్ వంటి వాటిని నంచుకుని తినేస్తారు. మీరు కూడా మీకు నచ్చిన రోటీ కర్రీలతో లేదా ఏదైనా చట్నీలతో మీ స్టైల్లో వీటిని లాగించేయండి.
మేథీ థెప్లాస్ లోని గోధుమపిండి, మెంతి ఆకులు, శనగపిండి అన్నీ మితంగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎలాంటి హాని తలపెట్టవు. బరువు విషయంలో కూడా ఎలాంటి చింత అవసరం ఉండదు. వీటిని తినడం వల్ల మంచి రుచిని ఆస్వాదించడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచే జరుగుతుంది.
సంబంధిత కథనం