



Best Web Hosting Provider In India 2024

home remedy for hair lice: పేల సమస్యతో మీ పిల్లలు చదువుకోలేక పోతున్నారా? షాంపూలో వీటిని కలిపారంటే ఒక్క పేను కూడా ఉండదు
home remedy for hair lice: తలలో పేల సమస్య కారణంగా మీ పిల్లలు చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నారా? పరీక్షలు రాకముందే దీనికి పరిష్కారం కావాలని కోరుకుంటున్నారా? అయితే సహజమైన, శక్తివంతమైన ఈ రెమిడీని ట్రే చేయండి. ఇది తలలో ఒక్క పేను కూడా లేకుండా చేస్తుంది.
తలలో పేల సమస్య పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఉంటుంది. అయితే మామూలు సమయంలో పర్లేదు కానీ పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో వీటిని తొలగించకపోతే పిల్లలు చదువు మీద దృష్టి పెట్టలేరు. ఎప్పుడూ చూసినా చేయి తలలో గోక్కోవడానికి, ధ్యాస పేల కారణంగా వచ్చే దురద వైపుకీ మారుతుంది. పేల సమస్యను తగ్గించుకోవడానికి మీరు ఇప్పటి వరకూ రకరకాల రెమిడీస్ ట్రై చేసి ఉంటారు, ఖరీదైన షాంపూలను కూడా వాడి విసిగిపోయి ఉంటారు. కానీ అవేవి కలిగించని ఉపశమనం ఈ రెమిడీ మీకు కలిగిస్తుంది.
ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈజీగా ఇంట్లోనే మీరే సహజమైన, శక్తివంతమైన హోం రెమిడీని తయారు చేసుకోవచ్చు. ఇది మీకూ, మీ పిల్లలకు పేల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. పరీక్షలు మొదలవకముందే షాంపూలో కొన్నింటిని కలిపి మీ పిల్లలకు తలస్నానం చేయించారంటే ఒక్క పేను కూడా లేకుండా పోతుంది. హాయిగా, ప్రశాంతంగా చదువుకుంటారు.
పేలు పోవాంటే షాంపూలో కలపడానికి ఏమేం కలపాలి?
- ఒక పెద్ద అల్లం ముక్క
- నిమ్మకాయ
- నీరు
- షాంపూ
పేల సమస్య తగ్గించుకునే రెమిడీని ఎలా తయారు చేయాలి?
- ముందుగా ఒక అల్లం ముక్క తీసుకుని తొక్క తీసి శుభ్రంగా కడగండి.
- తర్వాత ఈ అల్లం ముక్కను సన్నగా తురుముకోండి.
- ఇప్పుడు ఒక క్లాత్ లేదా టీ జల్లెడ సహాయంతో అల్లం తురుము నుంచి గట్టిగా రసాన్నిపిండి పక్కన పెట్టుకోండి.
- తరువాత ఈ రసాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని దాంట్లోనే సగం చెక్క నిమ్మరసం, ఒక స్పూన్ నీళ్లు వేసి కలపండి.
- తరువాత దీంట్లో మీరు రెగ్యులర్ గా ఉపయోగించే మీకు నచ్చిన షాంపూ వేసి బాగా కలపండి.
అంతే పేలు పోవడానికి హోం రెమిడీ రెడీ అయినట్లే.
ఈ రెమిడీని తలకు ఎలా అప్లై చేయాలి?
- పేల కోసం మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలంటే తల శుభ్రంగా ఉండాలని గుర్తుంచుకోండి.
- శుభ్రంతా తల స్నానం చేసి జుట్టు ఆరిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ పేల మందును తలకు, మాడకు బాగా పట్టించండి. (తలకు నూనె లేకుండా ఉంటేనే ఈ రసం చక్కగా తలంతా పడుతుంది).
- ఈ మిశ్రమాన్ని తలంతా అప్లై చేసిన తర్వాత పావు గంట పాటు అలాగే ఉంచి తర్వాత గోరు వెచ్చటి లేదా చల్లటి నీటితో తలస్నానం చేయాలి.
ఇలా వరుసగా రెండు నుంచి మూడు వారాలు చేశారంటే మీ తలలో పేలు అనేవి లేకుండా పోతాయి. పరీక్షలు మొదలు కాకముందే పిల్లలకు ఇది అప్లై చేసి వారిని పేల సమస్య నుంచి తప్పించుకునేలా చేయండి.
అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, జింజెరోల్ (gingerol) అనే యాంటీబాక్టీరియల్ గుణాలు పేల సమస్యను తగ్గించడంలో చక్కటి పాత్ర పోషిస్తాయి. అలాగే నిమ్మకాయలో ఉండే అమ్లతా (acidic), యాంటీసెప్టిక్ గుణాలు పేలను, వాటి అండాలను నాశనం చేయడంలో సహాయపడతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం