


Best Web Hosting Provider In India 2024

Brahmamudi Promo: రాజ్ చంపాడని కావ్యతోనే చెప్పించిన లాయర్.. మీనా పూలకొట్టు మూయించేందుకు ప్రభావతి కుట్ర!
Brahmamudi Gunde Ninda Gudi Gantalu Latest Episode Promo: స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియో హాట్‌స్టార్) ఓటీటీలో ప్రసారం అవుతోన్న బ్రహ్మముడి, గుండె నిండా గుడి గంటలు సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ప్రోమోలో చూపించారు. సామంత్‌ను రాజే చంపాడని కావ్యతోనే చెప్పిస్తాడు లాయర్.
Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో పోలీస్ స్టేషన్‌లో రాజ్‌ను ఇన్వెస్టిగేట్ చేసిన అప్పు ఇంటికి వస్తుంది. రాగానే, అనామిక ఎలాంటిదో తెలిసి కూడా రాజ్‌ను అరెస్ట్ చేస్తావా, ఇందుకేనా నిన్ను నా కొడుకు పోలీస్‌ను చేసింది అని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ.
నా డ్యూటీ చేశాను
ధాన్యలక్ష్మీకి సపోర్టింగ్‌గా రుద్రాణి సెటైర్లు వేస్తుంది. దీంతో ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఎంత పేరు వచ్చింది అని వెటకారంగా అంటుంది. నేను నా డ్యూటీ చేశాను అని అప్పు చెప్పిన వినిపించుకోరు. దాంతో కల్యాణ్‌తోపాటు అంతా అందులో తను చేసిందేం లేదని సపోర్ట్ చేస్తారు. అప్పును తప్పుపట్టడంలో అర్థం లేదని అంటారు.
మరుసటి రోజు సామంత్ మర్డర్ కేసుపై కోర్టులో వాదనలు జరుగుతాయి. అనామిక తరఫు లాయర్ కావ్యను విచారించాల్సిందిగా కోరడంతో బోనులోకి వస్తుంది. హత్య జరగడానికి ముందు రోజు మీరు, మీ భర్త కలిసి సామంత్ ఇంటికి వెళ్లారా, వార్నింగ్ గానీ అలాంటివి ఏమైనా ఇచ్చారా అని లాయర్ అడిగితే.. ఇంకోసారి ఇలా చేస్తే.. అని కావ్య చెప్పబోతుంది. మధ్యలోనే చంపేస్తామని అన్నారు అవునా అని లాయర్ అంటాడు.
చంపేయాలన్నంత కోపం
అవును కావ్య అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. సామంత్‌ను రాజే చంపేశాడు అనే అనుమానం వచ్చేలా కావ్యతోనే చెప్పిస్తాడు లాయర్. ముద్దాయికి సామంత్‌ను చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ, అక్కడ అందరిముందు చంపడం కుదరదు కాబట్టి ప్లాన్ ప్రకారం దారి కాచి చంపేసి శవాన్ని ఎలాగో మాయం చేయాలో తెలియక తన కారు డిక్కీలోనే పెట్టుకుని ఇంటికెల్లిపోయాడు యువరానర్ అని అనామిక తరఫు లాయర్ అంటాడు.
దాంతో రాజ్, అప్పు అంతా షాక్ అవుతారు. అనామిక మాత్రం తాను అనుకుంది సాధిస్తున్నట్లు గర్వంగా నవ్వుతుంది. అనంతరం అనామికను వచ్చి బోనులో నిల్చుంటుంది. అక్కడ సామంత్‌పై ప్రేమ ఉన్నట్లు, కల్యాణ్‌తో విడిపోయినందుకు, బిజినెస్‌కు అడ్డు వస్తున్నందుకే రాజ్ ఇలా చేశాడని పెద్ద డ్రామా చేస్తుంది అనామిక.
Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో మీనాకు బాలు షాప్ పెట్టించడంపై అటు ప్రభావతి ఇటు శ్రుతి ఇద్దరు రగిలిపోతారు. తనపై కోపం, ఇగోతోనే మీనాకు బాలు షాప్ పెట్టించాడని రవితో వాదిస్తుంది శ్రుతి. కానీ, రవి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు.
అవమానంగా ప్రభావతి
అయినా శ్రుతి వినదు. ఇక మీనా షాప్ పెట్టిందని ప్రభావతికి అందరు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెబుతుంటే కోపంతో రగిలిపోతుంది. పూలకొట్టుకు తన పేరు పెట్టి అవమానించారని మండిపడుతుంది. ఎలాగైనా మీనా పూలకొట్టు మూయించాలని, ఎప్పటిలా మీనా ఇంటికే పరిమితం కావాలని కుట్ర చేస్తుంది ప్రభావతి.
మరోవైపు బాలు తనకు పూలకొట్టు షాప్ పెట్టించడంపై మురిసిపోతుంది మీనా. తన సంతోషాన్ని భర్త బాలుతో చెప్పుకుంటుంది. ఇంక ఈ జీవితం అంతా వంట రూమ్‌కే పరిమితమా అనుకుని బాధపడ్డాను. నా మీద నాకు నమ్మకం పెరిగింది. దీనంతటికి కారణం మీరేనండి అని మీనా ఎమోషనల్‌గా బాలుకు చెబుతుంది.
బాలుకు ఎర్ర గులాబీ
అయినా ఇప్పుడు ఏమైంది. ఇది ప్రారంభం మాత్రమే. మనం పూల వ్యాపారాన్ని డెవలప్ చేయడానికి నేను చాలా ప్లాన్స్ వేసుకున్నాను అని బాలు చెబుతాడు. ఎన్ని ప్లాన్స్ అయినా వేయండి కచ్చితంగా మనం ఎదుగుతామని, మీరు పక్కన ఉంటే నేను ఏదైనా సాధించగలను అని అనిపిస్తుంది అని మీనా అంటుంది.
తర్వాత అయ్యో అసలు విషయం మర్చిపోయాను అని మీనా చెబుతుంది. మీరు కళ్లు మూసుకోండి అని బాలుకు చెబుతుంది మీనా. కాసేపు వాదించిన తర్వాత బాలు కళ్లు మూసుకుంటాడు. తర్వాత చేతిలో ఒక రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్ పట్టుకుని ఇప్పుడు కళ్లు తెరవమంటుంది. ఎర్ర గులాబీ చూసి బాలు సంతోషిస్తాడు. నాకు ధైర్యాన్ని ఇచ్చి నాలో నమ్మకం పెంచినందుకు ఇది మీకోసం అని ఎర్ర గులాబీ ఇస్తుంది మీనా. అది బాలు తీసుకుని చూస్తాడు.
సంబంధిత కథనం