



Best Web Hosting Provider In India 2024

TGSRTC Shivaratri Buses : మహాశివరాత్రికి 3 వేల స్పెషల్ బస్సులు – అదనపు ఛార్జీలు అమలు, రూట్ల వారీగా వివరాలివే
మహా శివరాత్రి వేళ తెలంగాణ ఆర్టీసీ 3 వేల ప్రత్యేక బస్సులను నడపనుంది. ఇందులో శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ సర్వీసులు ఉంటాయని పేర్కొంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండనున్నాయి.
మహాశివరాత్రి వేళ ప్రయాణికులకు ఇబ్బందులు కలగుండా తెలంగాణ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. శివరాత్రి సందర్భంగా మొత్తం 3 వేల ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.
- రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.
- ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి.
- ఇందులో ప్రధానంగా శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ సర్వీసులు ఉంటాయని ఆర్టీసీ పేర్కొంది.
- ఇక వేలాలకు 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బస్సులతో పాటు ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప వంటి పలు ప్రముఖ ఆలయాలకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
- హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్ బీ, బీహెచ్ ఈఎల్ నుంచి శ్రీశైలానికి బస్సులు వెళ్తాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.
టికెట్ల ఛార్జీలపై కీలక ప్రకటన:
శివరాత్రికి ప్రత్యేక బస్సులను ప్రకటించిన నేపథ్యంలో టికెట్ ఛార్జీలపై కూడా ఆర్టీసీ అప్డేట్ ఇచ్చింది. రెగ్యూలర్ సర్వీసుల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. కానీ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు అదనపు చార్జీలు ఉంటాయని పేర్కొంది.
ఈ మేరకు స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబవర్రి 24 నుంచి 27 వరకు నడిచే ప్రత్యేక బస్సుల్లో సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయని ఆర్టీసీ పేర్కొంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపింది. ఆర్టీసీ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవచ్చని సూచించింది.
ఇక గత శివరాత్రి కంటే ఈసారి 809 బస్సులను అదనంగా ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ప్రకటించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా… బస్సులను ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండీ సజ్జనార్ అధికారులను ఆదేశించారు.
మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో ప్రకారం… పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. తప్పనిసరిగా జీరో టికెట్లను తీసుకోవాలని సూచించారు.
సంబంధిత కథనం
టాపిక్