
ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
ది.24-8-2022(బుధవారం) ..
చందర్లపాడు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
పేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు ..
చందర్లపాడు గ్రామంలోని సచివాలయం-1 పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు , ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు ,సాగునీరు -డ్రైనేజీలు -సిమెంట్ రోడ్ల ఏర్పాట్లకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని తెలిపారు , ప్రజా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు , టిడిపి నాయకులు ప్రభుత్వంపై ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజల ఆశీస్సులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే ఉన్నాయని చెప్పారు , రాష్ట్రంలో ప్రశాంత పాలన సాగుతుంటే ప్రతిపక్షాలు -ఎల్లో మీడియా ఏదో ఒక విషయాన్ని భూతద్దంలో చూపుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ,
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కస్తాల పున్నమ్మ , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు , పార్టీ నాయకులు యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ , కందుల నాగేశ్వరరావు, జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు ..