


Best Web Hosting Provider In India 2024
SLBC Tunnel Accident : రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్.. ప్రభుత్వాన్ని అభినందించిన కాంగ్రెస్ అగ్రనేత
SLBC Tunnel Accident : ఎస్ఎల్‌బీసీ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే ప్రధాని మోదీ రేవంత్ రెడ్డితో మాట్లాడారు. తాజాగా రాహుల్ గాంధీ ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందించారు.
ఎస్ఎల్‌బీసీ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. సొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీశారు. దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించిందో చెప్పారు.
అక్కడే మంత్రులు..
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సంఘటన స్థలంలో ఉన్నారని.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ స్క్వాడ్‌లతో పాటు.. అవసరమైన సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న తీరును రాహుల్ గాంధీకి వివరించారు రేవంత్ రెడ్డి. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం, లోపల చిక్కుకున్న వారి కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు.
రాహుల్ సూచనలు..
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలతో పాటు.. ఆ కుటుంబాలను ఆదుకోవాలని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సూచించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిరంతర పర్యవేక్షణను అభినందించారు. శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలు అయ్యాయి. ఎనిమిది మంది సొరంగం లోపలే చిక్కుకుపోయారు.
అక్కడే బాధితులు..
శనివారం పనులు 13.6 కిలోమీటర్ దగ్గర జరిగాయి. అప్పుడే ప్రమాదం జరిగింది. మెషీన్ దాదాపు 80 మీటర్ల వరకూ జరిగిందని.. ప్రమాదం నుంచి తప్పించుకున్న వారు చెబుతున్నారు. అంటే పదమూడున్నర కిలోమీటర్ల దగ్గరే బాధితులు ఉండి ఉంటారనే అంచనాతో రెస్క్యూ సిబ్బంది పనిచేస్తున్నారు.
పనిముట్లు సిద్ధం..
ఆదివారం ఉదయం నుంచి పనులు మరింత ఊపందుకున్నాయి. మట్టి తొలగించడానికి సిబ్బంది, పనిముట్ల కోసం నాగర్ కర్నూలు జిల్లాతో పాటూ చుట్టుపక్కల జిల్లాలు, మున్సిపాలిటీలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి సిబ్బంది, యంత్రాలు, పనిముట్లు సేకరించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. నాగర్ కర్నూలు కలెక్టర్ ఆ బాధ్యతలు చూస్తున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలూ, ఉన్నతాధికారులూ ఇక్కడ పనులను పర్యవేక్షిస్తున్నారు.
మట్టి తొలగింపు కోసం..
ముందుగా దారిలో పేరుకుపోయిన మట్టి తొలగించడమే మంచిదని అధికారులు నిర్ణయించారు. ఆ తరువాతనే ఏ పని అయినా చేయగలమని భావిస్తున్నారు. అందుకోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది, గ్యాస్ కట్టర్లు, పారలతో కూడిన రైలు లోపలికి వెళ్లింది. తరువాత మిగతా బృందాలన్నీ లోపలికి వెళ్తున్నాయి.
టాపిక్