



Best Web Hosting Provider In India 2024

TG Wines Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్ – 3 రోజుల పాటు వైన్స్ షాపులు బంద్, ఎక్కడెక్కడంటే..?
Wine Shops Closed in Telangana : తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్ వచ్చేసింది. ఈనెల 25 నుంచి 27 వరకు పాటు పలు జిల్లాల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది.
మందుబాబులకు బ్యాడ్ న్యూస్…! రాష్ట్రంలోని మూడు రోజుల పాటు లిక్కర్ దుకాణాలు బంద్ కానున్నాయి. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా… అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని సగానికిపైగా జిల్లాల్లో ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా లిక్కర్ షాపులు క్లోజ్ కానున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్….
రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం-వరంగల్- నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎలక్షన్ జరగనుంది. దాదాపు ఎన్నికల ప్రచారం కూడా పూర్తి కావొచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉమ్మడి ఏడు జిల్లాల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.కల్లు కంపౌండ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా క్లోజ్ అవుతాయి. ఇక రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాల్లో కూడా ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది. ఈ గ్రామాలు… ఆయా జిల్లాల పరిధిలో ఉన్నప్పటికీ కమిషనరేట్ పరిధి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో… కొల్లూరు, ఆర్సీ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోజుల పాటు లిక్కర్ షాపులు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 25వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలోని క్లబ్బులు, పబ్బులు, స్టార్ హోటల్స్‌ల్లో సైతం లిక్కర్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించి… విరుద్ధంగా మద్యం విక్రయాలు, మద్యం సరఫరాకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్లు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా యాదాద్రి జిల్లా ఉంది. ఇక్కడ కూడా మద్యం షాపులు క్లోజ్…అవుతాయి. ఇక ఎన్నికలు జరిగే ఉమ్మడి 7 జిల్లాలకు సంబంధించి అక్కడి పోలీసులు ఆదేశాలు జారీ చేయనున్నారు.
పోలింగ్ కు విస్తృత ఏర్పాట్లు:
ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పట్టభద్రుల స్థానంలో 56 మంది, టీచర్ల స్థానంలో 15 మంది పోటీలో నిలిచారు. ప్రధానంగా గ్రాడ్యుయేట్ స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ తో పాటు బీఎస్పీ అభ్యర్థి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
ఇక పోలింగ్ కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడుతారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఆంక్షలు విధించనున్నారు.
సంబంధిత కథనం
టాపిక్