



Best Web Hosting Provider In India 2024

Telugu Serial: ఏడాదికే ఎండ్ అయిన తెలుగు సీరియల్ – 342 ఎపిసోడ్స్‌తోనే శుభంకార్డు!
Telugu Serial: జెమిని టీవీలో టెలికాస్ట్ అవుతోన్న ఏవండోయ్ శ్రీమతిగారు సీరియల్‌కు ఏడాదికే ఎండ్ కార్డ్ పడింది. శనివారం నాటితో ఈ సీరియల్‌కు మేకర్స్ శుభంకార్డు వేశారు. గత ఏడాది జనవరిలో ఈ సీరియల్ ప్రారంభమైంది. ఈ సీరియల్‌లో పల్లవి గౌడ, హర్షిత్ శెట్టి కీలక పాత్రలు పోషించారు.
Telugu Serial: సీరియల్ అంటే ఏళ్లకు ఏళ్లు టెలికాస్ట్ కావడం కామన్. తక్కువలో తక్కువగా రెండు నుంచి మూడేళ్ల పాటైన సీరియల్స్‌ను నడిపిస్తుంటారు. 1500 ఎపిసోడ్స్ క్రాస్ చేసి నాలుగైదేళ్ల నుంచి టెలికాస్ట్ అయిన…అవుతోన్న సీరియల్స్ కూడా ఉన్నాయి. అయితే జెమిని టీవీలో ప్రసారమవుతోన్న ఏవండోయ్ శ్రీమతిగారు సీరియల్‌కు ఏడాదికే ముగింపు పడింది. శనివారం నాటి ఎపిసోడ్‌తో ఈ సీరియల్‌కు మేకర్స్ శుభంకార్డు వేశారు. కేవలం 342 ఎపిసోడ్స్‌తోనే ముగించారు.
గత ఏడాది జనవరిలో…
గత ఏడాది జనవరి 22న ఈ సీరియల్ మొదలైంది. ఈ ఫిబ్రవరి 22కు ఎండ్ కార్డ్ పడింది. ఈ సీరియల్‌లో పల్లవిగౌడ, హర్షిత్ శెట్టి లీడ్ రోల్స్‌లో నటించారు. శ్రీనివాస్, శాంతి, గుత్తికొండ భార్గవ, దేవిశ్రీ కీలక పాత్రల్లో కనిపించారు. ఈసీరియల్‌లో మిథున పాత్రలో పల్లవిగౌడ కనిపించగా…గౌతమ్ పాత్రను హర్షిత్ శెట్టి చేశాడు. మిథున, గౌతమ్ ఇద్దరికి వేర్వేరుగా పెళ్లవుతుంది.
కానీ అనుకోని పరిస్థితుల్లో తమ పిల్లలతో కలిసి భార్యాభర్తల్లా ఒకే ఇంట్లో అద్దెకుదిగుతారు గౌతమ్, మిథున. ఆ తర్వాత ఏమైంది? మిథున, గౌతమ్ మధ్య ప్రేమ ఎలా చిగురించింది? పెళ్లి పీటల మీద నుంచి మిథున ఎందుకు పారిపోయింది? కూతురి మంచితనాన్ని సుబ్బరాయుడు అర్థం చేసుకున్నాడా? లేదా? అనే కాన్సెప్ట్‌తో ఏవండోయ్ శ్రీమతిగారు సీరియల్ రూపొందింది.
టీఆర్‌పీలో…
డ్రామా ఆశించిన స్థాయిలో పండకపోవడం, టీఆర్‌పీలో వెనుకబడటంతో మేకర్స్ ఈ సీరియల్‌ను ముగించినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఏవండోయ్ శ్రీమతిగారు 0.51 రేటింగ్‌ను మాత్రమే దక్కించుకున్నది. అయినా జెమినిటీవీలో రేటింగ్ పరంగా టాప్‌లో ఉన్న సీరియల్‌గా ఏవండోయ్ శ్రీమతిగారు నిలిచింది.
పసుపు కుంకుమ సీరియల్‌తో…
జీ తెలుగులో టెలికాస్ట్ అయినా పసుపు కుంకుమ సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది పల్లవి గౌడ. ఈ సీరియల్‌లో సావిత్ర, అంజలి అనే రెండు క్యారెక్టర్స్‌లో కనిపించింది. ఆ తర్వాత తెలుగులో చందరగం, సావిత్రి, సూర్యకాంతంతో పాటు మరికొన్ని సీరియల్స్ చేసింది.
తెలుగులోకి ఎంట్రీ…
ప్రస్తుతం జీ తెలుగులో టెలికాస్ట్ అవుతోన్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తోంది. ఏవండోయ్ శ్రీమతిగారు సీరియల్‌తోనే హర్షిత్ శెట్టి తెలుగులోకి అరంగేట్రం చేశాడు.
సంబంధిత కథనం