



Best Web Hosting Provider In India 2024

Jr Ntr: స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ కోసమే ఈ మేకోవర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్!
Jr Ntr: ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తోన్న కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్నాయి. ఈ ఫొటోల్లో బ్లాక్ డ్రెస్‌లో మోడ్రన్‌గా ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ కొత్త లుక్ ప్రశాంత్ నీల్ మూవీ కోసమే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు.
Jr Ntr: స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. అతడి కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఎన్టీఆర్‌తో పాటు పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు దుబాయ్‌లో ఓ పెళ్లి వేడుకకు అటెండ్ అయ్యారు. ఈ పెళ్లి వేడుకల తాలూకు ఫొటోల్లో ఎన్టీఆర్‌తో పాటు ఆయన సతీమణి లక్ష్మి ప్రణతి, మహేష్‌బాబు భార్య నమ్రతతో పాటు కూతురు సితార, డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి కూడా కనిపించారు.
ఎన్టీఆర్ స్టైలిష్ లుక్…
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. ఫుల్ బ్లాక్ డ్రెస్‌లో కళ్లాద్ధాలు ధరించి కొత్త అవతారంలో దర్శనమిచ్చాడు. ఎన్టీఆర్ ఫొటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్, దేవర సినిమాల్లో పీరియాడిక్ లుక్‌లోనే ఎన్టీఆర్ కనిపించారు. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత మోడ్రన్ లుక్‌లో కనిపించడంలో అభిమానులు ఖుషి అవుతోన్నారు.
ప్రశాంత్ నీల్ మూవీ కోసమేనా?
ఎన్టీఆర్ కొత్త లుక్ ప్రశాంత్ నీల్ మూవీ కోసమే అంటూ సోషల్ మీడియా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ లుక్, క్యారెక్టరైజేషన్ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత సినిమాలకు భిన్నంగా స్టైలిష్, మాస్ అవతార్‌లో ఎన్టీఆర్‌ను ప్రశాంత్ నీల్ ప్రజెంట్ చేయబోతున్నట్లు చెబుతోన్నారు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో మొదలైంది. కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్‌ను ప్రశాంత్ నీల్ షూట్ చేస్తోన్నాడు. అయితే ఈ షెడ్యూల్‌లో మాత్రం ఎన్టీఆర్ పాల్గొనడం లేదు.మార్చి నెలాఖరు నుంచి ఆరంభమయ్యే సెకండ్ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొననున్నట్లు సమాచారం. ఆ తర్వాత విదేశాల్లో మూడో షెడ్యూల్‌ను షూట్ చేయనున్నట్లు సమాచారం.
కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో…
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 1960 టైమ్ పీరియడ్‌లో ఈ కథ సాగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ కన్ఫామ్ చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20న సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
సంక్రాంతికి రిలీజ్…
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ వెల్లడించారు.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
సంబంధిత కథనం