



Best Web Hosting Provider In India 2024

Navel Slip Treatment: బొడ్డు జరగడం లేదా కదలడం అంటే ఏంటి? కారణాలు, లక్షణాలు, నివారణ చర్యలేంటో తెలుసుకోండి
Navel Slip or Navel Displacement Treatment: బరువులు ఎత్తితే నాభి(బొడ్డు) జరిగిపోతుంది, కడుపులో నొప్పి వస్తుంది అనే మాటలు తరచూ వినే ఉంటారు. బొడ్డు జరగడం లేదా కదలడం అంటే ఏంటి? దీనికి కారణాలు, లక్షణాలతో పాటు నివారణ చర్యలేంటో ఇక్కడ తెలుసుకోండి.
అకస్మాత్తుగా బరువులు ఎత్తకూడదు, ఎగరకూడదు, ఇలా చేస్తే బొడ్డు జరిగిపోతుంది పొత్తి కడుపులో నొప్పి వస్తుంది వంటి మాటలు ఇప్పటికి చాలా సార్లు వినే ఉంటారు. నిజంగా ఇలా జరుగుతుందా అని ఎప్పుడైనా ఆలోచించారా? బొడ్డు పక్కకు జరగడం, జారిపోవడం వంటివి వాస్తవికంగా జరిగేవేనా అంటే అవుననే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీన్నే నాభి స్థానభ్రంశం(Navel Displacement), బొడ్డు జరగడం, నాభి జారిపోవడం(Navel Slip) అంటుంటారు. నాభి లేదా బొడ్డు జారడం అంటే ఏంటీ, దీని కారణాలు, లక్షణాలతో పాటు నివారణ చర్యలేంటో తెలుసుకుందాం.
నాభి(బొడ్డు) ఎందుకు జారుతుంది?
నిజానికి నాభి లేదా బొడ్డు అనేది శరీర కేంద్ర బిందువు. అనేక సార్లు ఇది దాని స్థానం నుంచి జారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అయితే..
- ఎక్కువ సార్లు బరువైన వస్తువులు ఎత్తడం,
- అకస్మాత్తుగా వంగడం,
- ఉదరం అంటే పొట్ట కండరాలపై అధిక ఒత్తిడి పడటం,
- వేగంగా మెట్లు ఎక్కడం,
- ఒకే కాలు మీద బరువు వేసి నిలబడం,
- కారం, మసాలా పదార్థాలు కలిగిన ఆహారాలను ఎక్కువగా తినడం
- సరైన భంగిమలో పనులు చేయకపోవడం
వంటి కారణాల వల్ల బొడ్డు జరగడం, కదలడం, జారడం వంటివి జరుగుతాయి. బలహీనంగా ఉన్నవారిలో ఈ సమస్య కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలకు, మహిళలకు చాలాసార్లు ఈ సమస్య వస్తుంది.
బొడ్డు జారితే ఏం జరుగుతుంది? దీని లక్షణాలేంటి?
- నాభి జారడం లేదా కదలడం వల్ల పొట్టలో తీవ్రమైన నొప్పి వస్తుంది.
- కొందరిలో జీర్ణక్రియ దెబ్బతింటుంది.
- చాలాసార్లు మలబద్ధకం, అతిసారంతో పాటు వాంతులు వస్తాయి.
- తలతిరగడం, కదలడం కష్టంగా మారడం జరుగుతుంది
- ఆందోళనగా అనిపిస్తుంది.
- మహిళలలో నాభి జారడం వల్ల ఋతు చక్రం ముందుగా లేదా ఆలస్యంగా వస్తుంది.
నాభి జారిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి
నాభి జారిందా లేదా అని తెలుసుకోవడానికి పెద్దలు రెండు పద్ధతులను చెబుతారు.
మొదటి పద్ధతి..
నాభిపై బొటనవేలు ఉంచి తేలికగా నొక్కండి, ఈ సమయంలో గుండె కొట్టుకునే శబ్దాన్ని అంటే నాడీ శబ్దాన్నివినండి. నాభిలో గుండె కొట్టుకునే శబ్దం వినబడితే బొడ్డు జరగలేదని అర్థం. గుండె కొట్టుకునే శబ్దం వినబడకపోతే బొడ్డు జారింది లేదా కదిలింది అని అర్థం చేసుకోండి.
రెండవ పద్ధతి ఏమిటంటే..
నాభి నుండి పాదాల వరకు కొలవడం. రెండు పాదాల నుండి నాభి దూరం ధాగం లేదా తాడుతో కొలవండి. రెండు పాదాల నుండి నాభి దూరంలో తేడా ఉంటే, అంటే నాభి జారింది.
బొడ్డు జారిపోయినప్పుడు ఉపశమనం పొందడం ఎలా?
వెన్నుకు మర్దన చేయించుకోండి
నాభి లేదా బొడ్డు జారినప్పుడు నిపుణుల సహాయంతో పొట్ట, వెన్నుకు మర్దనా చేయించుకోండి. ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
ఆవనూనె వేయండి
బొడ్డు జరిగినప్పుడు ఆవనూనెను తరచూ నాభిలో వేయడం వల్ల కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది.
ఉసిరి రసం లేదా సోంపులు
బొడ్డు కదిలినప్పుడు ఉసిరి రసం తాగడం లేదా సోంపులు తినడం వల్ల కూడా సమస్య త్వరగా తగ్గుతుంది.
సంబంధిత కథనం