Nick Jonas: ఓటీటీలోకి వ‌చ్చిన ప్రియాంక చోప్రా భ‌ర్త హాలీవుడ్ కామెడీ మూవీ – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

Best Web Hosting Provider In India 2024

Nick Jonas: ఓటీటీలోకి వ‌చ్చిన ప్రియాంక చోప్రా భ‌ర్త హాలీవుడ్ కామెడీ మూవీ – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

Nelki Naresh HT Telugu
Feb 23, 2025 10:40 PM IST

Nick Jonas: ప్రియాంక చోప్రా భ‌ర్త నిక్ జోన‌స్ హీరోగా న‌టించిన హాలీవుడ్ మూవీ ది గుడ్ హాఫ్ ఓటీటీలోకి వ‌చ్చింది. జియోహాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కామెడీ డ్రామా మూవీ ర‌న్‌టైమ్ 96 నిమిషాలే కావ‌డం గ‌మ‌నార్హం.

నిక్ జోన‌స్
నిక్ జోన‌స్

Nick Jonas: ప్రియాంక చోప్రా భ‌ర్త నిక్ జోన‌స్ హీరోగా న‌టించిన హాలీవుడ్ కామెడీ డ్రామా మూవీ ది గుడ్ హాఫ్ ఓటీటీలోకి వ‌చ్చింది. జియో హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హాలీవుడ్ సినిమాకు రాబర్ట్ స్క్వార్ట్జ్‌మాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నిక్ జోన‌స్‌తో పాటు బ్రిట‌నీ స్నో, అలెగ్జెండ్రా షిప్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో స్క్రీనింగ్‌…

2023లోనే ది గుడ్ హాఫ్ షూటింగ్ పూర్త‌యింది. ట్రిబెక్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో స్క్రీనింగ్‌కు ఎంపికైంది. థియేట‌ర్ల‌లో మాత్రం 2024 జూలైలో రిలీజైంది. డీసెంట్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. ఈ సినిమాలో నిక్ జోన‌స్ యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఎమోష‌న‌ల్ రోల్‌లో మెప్పించాడ‌ని క్రిటిక్స్ పేర్కొన్నారు.

ది గుడ్ హాఫ్ క‌థ ఇదే…

ది గుడ్ హాఫ్ మూవీలో రెన్ వీలాండ్ అనే క్యారెక్ట‌ర్‌లో నిక్ జోన‌స్ న‌టించాడు. రెన్‌వీలాండ్ కుటుంబానికి దూరంగా ఒంట‌రిగా జీవితాన్ని సాగిస్తుంటాడు. త‌ల్లి చ‌నిపోయింద‌ని తెలిసి ఆమె అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు ఇంటికి వ‌స్తాడు. అక్క‌డ అత‌డికి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి? వీలాండ్ కుటుంబానికి దూరంగా వెళ్లిపోవ‌డానికి కార‌ణం ఏమిటి? విడిపోయిన త‌మ కుటుంబాన్ని క‌ల‌ప‌డం కోసం వీలాండ్ ఏం చేశాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

96 నిమిషాలే…

ది గుడ్ హాఫ్ మూవీ ర‌న్‌టైమ్ 96 నిమిషాలే కావ‌డం గ‌మ‌నార్హం. స్వ‌త‌హాగా పాప్ సింగ‌ర్ అయిన నిక్ జోన‌స్ హాలీవుడ్‌లో ప‌దికిపైగా సినిమాలు చేశాడు. మిడ్ వే, జుమాంజీ, గోట్‌, ల‌వ్ అగైన్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించాడు.

వెబ్‌సిరీస్‌ల‌తో ఫేమ‌స్‌…

సినిమాల కంటే హాలీవుడ్ వెబ్‌సిరీస్‌ల‌తోనే యాక్ట‌ర్‌గా ఎక్కువ‌గా ఫేమ‌స్ అయ్యాడు నిక్ జోన‌స్‌. కింగ్‌డ‌మ్‌, స్మాష్‌, మిస్ట‌ర్ స‌న్‌షైన్‌తో పాటు ప‌లు వెబ్‌సిరీస్‌ల‌తో న‌టుడిగా నిక్ జోన‌స్‌కు ప్ర‌తిభ వెలుగులోకి వ‌చ్చింది.

ప్రియాంక చోప్రాతో పెళ్లి…

2017లో ప్రియాంక చోప్రాతో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. 2018 జ‌న‌వ‌రిలో పెళ్లి చేసుకున్నారు. 2022లో స‌రోగ‌సీ ద్వారా ప్రియాంక చోప్రా, నిక్ జోన‌స్‌లు కూతురికి జ‌న్మ‌నిచ్చారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024