


Best Web Hosting Provider In India 2024

Thriller Movie: బిగ్‌బాస్ ఆదిత్యం ఓం థ్రిల్లర్ మూవీకి రిలీజ్‌కు ముందే అవార్డులు -థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
Thriller Movie: బిగ్‌బాస్ ఫేమ్ ఆదిత్య ఓం నటిస్తోన్న థ్రిల్లర్ మూవీ బంధీ ఫిబ్రవరి 28న రిలీజ్ కానుంది. సింగిల్ క్యారెక్టర్‌తో ప్రయోగాత్మకంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు తిరుమల రఘు దర్శకత్వం వహించారు.
Thriller Movie: బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ ఆదిత్య ఓం హీరోగా నటిస్తోన్న బంధీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. సింగిల్ క్యారెక్టర్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీని ఫిబ్రవరి 28న రిలీజ్ కానుంది.
థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీకి తిరుమల రఘు దర్శకత్వం వహిస్తూ గల్లీ సినిమా బ్యానర్ మీద వెంకటేశ్వర రావు దగ్గు తో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే బంధీ మూవీ నేషనల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అయ్యింది. అవార్డులను సొంతం చేసుకుంది.
పర్యావరణ సంరక్షణ…
దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ నేపథ్యంతో కూడిన థ్రిల్లర్ మూవీగా బంధీ నిలుస్తుందని మేకర్స్ చెబుతోన్నారు. ఈ సినిమాలో ఆదిత్య ఓం ఎదుర్కొనే పరిస్థితులు, వాతావరణ సమస్యలపై అతడు పోరాడే తీరు ఉత్కంఠను పంచుతుందని అంటున్నారు.
డూప్స్ లేకుండా..
అటవీ ప్రాంతంలో రియల్ లొకేషన్స్ మధ్య బంధీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎటు వంటి డూప్స్ లేకుండా ఆదిత్య ఓం చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు హైలెట్ కానున్నాయి. ప్రకృతిని నాశనం చేస్తున్న మానవాళికి ఓ కనువిప్పులా మంచి సందేశంతో ఈ సినిమా ఆకట్టుకుంటుందని తెలిపారు.
లాహిరి లాహిరి లాహిరిలో…
బంధీ కంటే ముందు తెలుగులో హీరోగా ఇరవై వరకు సినిమాలు చేశాడు ఆదిత్య ఓం.కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన లాహిరి లాహిరి లాహిరిలో మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆదిత్యం ఓం. ఆ తర్వాత ధనలక్ష్మి ఐ లవ్ యూ,ప్రేమించుకున్నాం పెళ్లికి రండితో పాటు తెలుగులో పలు సినిమాలు చేశాడు. హిందీలో బందూక్, మాసాబ్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు.
బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్…
బిగ్‌బాస్ సీజన్ 8లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు ఆదిత్యం ఓం. 32వ రోజు హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. బిగ్‌బాస్‌లో పాల్గొన్నందుకు ఆదిత్య ఓమ్‌కు భారీగానే రెమ్యూనరేషన్ దక్కినట్లు సమాచారం. వారానికి మూడు లక్షల రెమ్యూనరేషన్‌తో ఆదిత్య బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం మూడు వారాలకు గాను పదిహేను లక్షలకుపైనే ఆదిత్య ఓంకు దక్కినట్లు చెబుతోన్నారు.
సంబంధిత కథనం