Golden Blood Group: అరుదైన గోల్డెన్ బ్లడ్ ఇది, ప్రపంచంలో కేవలం 45 మందికే ఈ బ్లడ్ గ్రూపు ఉంది

Best Web Hosting Provider In India 2024

Golden Blood Group: అరుదైన గోల్డెన్ బ్లడ్ ఇది, ప్రపంచంలో కేవలం 45 మందికే ఈ బ్లడ్ గ్రూపు ఉంది

 

Golden Blood Group: అరుదైన బ్లడ్ గ్రూప్ గోల్డెన్ బ్లడ్. ఇది ప్రపంచంలో కేవలం 45 మందికే ఉంది. ఈ గోల్డెన్ బ్లడ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.

 
ప్రపంచంలో అరుదైన బ్లడ్ గ్రూపు ఇదిగో
ప్రపంచంలో అరుదైన బ్లడ్ గ్రూపు ఇదిగో 

బ్లడ్ గ్రూప్ అనగానే అందరికీ A, B, O రక్తవర్గాలే ఎక్కువ గుర్తుకువస్తాయి. కానీ ఎవరికీ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ మాత్రం తెలియదు. ఎందుకంటే దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. A పాజిటివ్, B పాజిటివ్, O పాజిటివ్ వంటి సాధారణ బ్లడ్ గ్రూపులే గుర్తొస్తాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్.. గోల్డెన్ బ్లడ్ గ్రూప్. దీని శాస్త్రీయ నామం Rh Null. ఒక పరిశోధన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ బ్లడ్ గ్రూపును కలిగి ఉన్నవారు 45 మంది మాత్రమే ఉన్నారు.

 

ఆ 45 మంది కూడా జపాన్, ఐర్లాండ్, అమెరికా, బ్రెజిల్, కొలంబియా దేశాలలో నివసిస్తున్నారు. ఈ బ్లడ్ గ్రూపులో యాంటీజెన్ ఉండదు. అందుకే ఇది అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ గా మారింది. ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ ఉన్న వారిలో రక్త కణాల్లో ప్రోటీన్ పూర్తిగా ఉండదు. అందుకే ఇది ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. మిగతా బ్లడ్ గ్రూపులు అన్నింటిలో కూడా ఎర్ర రక్త కణాలలో ఉపరితలంపై ప్రోటీన్ ఉంటుంది.

ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ ఎలా తయారవుతుంది

ఇది ఒక అరుదైన రక్త వర్గం. శరీరంలో జరిగే ఒక మ్యుటేషన్ వల్ల ఇది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ మ్యుటేషన్ శరీరంలో Rh ప్రోటీన్ ఉత్పత్తిని ఆపివేస్తుంది. దీనివల్ల ప్రోటీన్ లేకుండా ఈ రక్త వర్గం ఏర్పడుతుంది. అయితే ఈ బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్న వ్యక్తులకు ఆరోగ్య సమస్యలు ఏవీ రావు. వారు సాధారణమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారు.

రక్త హీనత సమస్య

ఈ అరుదైన Rh Null బ్లడ్ గ్రూపును శాస్త్రవేత్తలు 1960లో కనిపెట్టారు. ఈ బ్లడ్ గ్రూపు కలిగిన వారు తరచూ రక్తహీనత సమస్యతో బాధపడతారు. కాబట్టి వారు ఇనుము అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినాల్సి వస్తుంది. అయితే వీరికి రక్తం అవసరమైనప్పుడు దాతలు దొరకడం చాలా కష్టం. అందుకే దాతలు నుండి ఎప్పటికప్పుడు రక్తాన్ని సేకరించి ప్రత్యేకంగా నిల్వ చేస్తారు. ఇది ఇతరులకు ఎవ్వరికీ దానంగా ఇవ్వరు. ఈ రక్తాన్ని ఎవరి నుండి తీసుకుంటారో మళ్లీ అదే వ్యక్తికి అవసరమైనప్పుడు ఇస్తారు. అంటే గోల్డెన్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి అప్పుడప్పుడు తన రక్తాన్ని తానే నిల్వ చేసుకొని దాచుకోవాల్సి వస్తుంది.

 

బ్లడ్ గ్రూప్ కోసం నెట్‌వర్క్

ప్రపంచవ్యాప్తంగా గోల్డెన్ బ్లడ్ ఉన్న వారి కోసం ఒక నెట్ వర్క్ ఉంది. అందులో Rh Null బ్లడ్ గ్రూపు కలవారు. తమ పేరును నమోదు చేసుకుంటారు. దీని వల్ల అత్యవసరమైన సమయాల్లో ఎవరికైనా రక్తాన్ని మీరు దానం చేయగలరు.

రక్తం మన శరీరంలో అత్యవసరమైన పదార్థం. ప్రతి కణానికి ఆక్సిజన్ అందించడానికి రక్తం ప్రతి క్షణం ప్రవహిస్తూనే ఉంటుంది. ఎర్ర రక్తకణాలు ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ తీసుకొని శరీరం అంతా వ్యాపిస్తాయి. వాటిని మోసుకెళ్ళే బాధ్యత రక్తానిదే.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024