Best Web Hosting Provider In India 2024

Brahmamudi February 24th Episode: రాజ్‌కు బెయిల్ రద్దు- దొంగతనంతో అదరగొట్టిన లాయర్- భర్తకు వ్యతిరేకంగా కావ్య సాక్ష్యం
Brahmamudi Serial February 24th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 24 ఎపిసోడ్‌లో కోర్టులో రాజ్ లాయర్ అనామిక లాయర్‌ను దొంగతనంతో ఇరికించి మంచి పాయింట్‌తో అదరగొడతాడు. దాంతో కోర్టులో అంతా చప్పట్లు కొడతారు. అనామిక షాక్ అవుతుంది. కానీ, రాజ్‌కు బెయిల్ రద్దు చేస్తున్నట్లు జడ్జ్ చెబుతాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంటికి వచ్చిన అప్పును ధాన్యలక్ష్మీ, రుద్రాణి నానా మాటలు అంటారు. ఇంటివాళ్లనే అరెస్ట్ చేసి ఏం మెడల్స్ సాధించావ్. అసలు రాజ్‌ను అరెస్ట్ చేయడానికి ఆ అనామిక దగ్గర ఎంత లంచం పుచ్చుకున్నావ్ అని రుద్రాణి అంటుంది. దాంతో అప్పు ఫైర్ అవుతుంది.
మర్యాదగా మాట్లాడండి
కాస్తా మర్యాదగా మాట్లాడండి. నా ప్రాణం పోయినా అలాంటి పని చేయను. ఆయన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చినందుకు నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. దయచేసి నన్ను అనుమానించకండి అని అప్పు అంటుంది. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరు నిన్ను తీసుకురమ్మని ప్రతి ఒక్కరు నన్ను ఒప్పించారు. ఇప్పుడు నువ్ అక్కకే ఇలా చేశావ్. నిన్ను ఏమనాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది. అమ్మా.. అప్పు తన డ్యూటీ చేసింది. అలా చేయకుంటే జాబ్‌కు ద్రోహం చేసినట్లు అవుతుంది అని కల్యాణ్ అంటాడు.
పాపం రాజ్ అక్కడ పోలీస్ స్టేషన్‌లో ఎలా ఉన్నాడో అని స్వప్న అంటుంది. దాంతో అపర్ణ ఏడుస్తుంది. సుభాష్ ఓదార్చుతాడు. చట్టం నిర్దోషికి శిక్ష వేయదు అని చెబుతాడు. ఆయనకేం కాదు. దీని వెనుక ఎవరున్నారో కనిపెడదాం. ఆయన్ను నిర్దోషిగా బయటకు తీసుకొద్దాం. నా చెల్లెలు చట్టానికి లోబడి చేసింది. దయచేసి దాన్ని తప్పు బట్టకండి ప్లీజ్ అని కావ్య చెబుతుంది. అప్పును లోపలికి తీసుకెళ్తాడు కల్యాణ్.
తర్వాత రాజ్‌ను ఇలా చూడటానికేనా నేను తిరిగి వచ్చిందని సీతారామయ్య అంటాడు. రాజ్ ఏ తప్పు చేయలేదు. నిర్దోషిలా బయటకు వస్తాడు ఇందిరాదేవి అంటుంది. ఏ నేరం చేయనివాడికి ఏంటీ శిక్ష అని అపర్ణ అంటుంది. శిక్ష కాదు వాడి నిజాయితీకి పరీక్ష. రేపు కోర్టులో న్యాయ దేవత అందరి కళ్లు తెరిపిస్తుంది అని సుభాష్ అంటాడు. ఇటు కావ్య, అటు రాజ్ ఇద్దరు బాధతో ఉంటారు. ఇంట్లో అంతా ఏడుస్తూ ఉంటారు. కాసేపటికి అపర్ణకు భోజనం తీసుకుని వెళ్తుంది కావ్య. నాకు ఆకలి లేదు అని అపర్ణ అంటుంది.
చావు నాకు వచ్చి న బాగుండేది
ఆకలి చచ్చిపోయిందా. ఇలా తినకుండా ఉంటే మనం చచ్చిపోవాల్సి వస్తుంది అని కావ్య అంటుంది. ఆ చావు ఏదో నాకు వచ్చిన బాగుండేది అని అపర్ణ అంటుంది. ఆ మాట విని అప్పు ఆగుతుంది. అయ్యో అవేం మాటలు అత్తయ్య అని కావ్య అంటుంది. నా కొడుకును ఇలాంటి దుస్థిలో చూడటానికా నేనింకా బతికి ఉంది. తప్పు చేయలేదని తెలిసినా అరెస్ట్ చేశారుగా. ఇన్నాళ్లు కాపాడుకున్న గౌరవం, సంపాదించుకున్న పేరు ఏమైపోవాలి. రేపు సమాజంలో వాడు ఎలా తలెత్తుకుని తిరగాలి అని అపర్ణ అంటుంది.
ఇది నిందారోపణతో చేసిన అరెస్ట్ మాత్రమే. శిక్ష పడలేదు కదా. అప్పటివరకు మనం ఆయన్ను అక్కడ ఎందుకు ఉండనిస్తాం. సమాజంలో ఆయన వాల్యూ ఎప్పటికీ తగ్గదు. తల్లిగా మీ బాధ నేను అర్థం చేసుకోగలను. మీరు కుంగిపోతుంటే నేను చూడలేకపోతున్నాను. ఆయన్ను తొందర్లో బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది. ఆల్రెడీ అప్పు నేను అదే పనిలో ఉన్నాం. ఏ తప్పు చేయని ఆయన్ను అరెస్ట్ చేసినందుకు అప్పు చాలా బాధపడుతుంది అని కావ్య చెబుతుంది.
అది విని అక్కడి నుంచి అప్పు వెళ్లిపోతుంది. ఎందుకే ఇలా చేశావ్. ఇందుకేనా నువ్ పోలీస్ అయింది. నా వాళ్లనే నేను శిక్షించుకుంటున్నానా. అయ్యో అనుకుంటూ అప్పు కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో వచ్చిన కల్యాణ్ వచ్చి ఓదారుస్తాడు. నువ్వెందుకు బాధపడుతున్నావ్ అంటాడు. నా వల్ల కావట్లేదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ గిల్టీనెస్ నాలో ఎక్కువైపోతుంది. సొంత బావని అరెస్ట్ చేసుకుని ఎలా ధైర్యంగా ఉండను. ఇలా తెలిస్తే పోలీస్ అయ్యేదాన్ని కాదు. నా గోల్ నా వాల్లకు శత్రువులుగా మారుస్తుందంటే నాకు అక్కర్లేదు అని అప్పు హగ్ చేసుకుని ఏడుస్తుంది.
పోలీస్‌గా ఆలోచించు
భవిష్యత్తులో ఇలాంటివి చాలా వస్తాయి. నువ్ ధైర్యంగా ఉండాలి. నువ్వు ఏ తప్పు చేయలేదు. నా అప్పు ఏ తప్పు చేయదు. ఇంకా ఎవరి మాటలు పట్టించుకోకు అని కల్యాణ్ అంటాడు. అపర్ణ గురించి అప్పు చెబుతుంది. వీళ్లందరి బాధకు నేనే కారణం అయ్యాను అని అప్పు అంటుంది. అన్నయ్యను అరెస్ట్ చేసిన ఈ చేతులతోనే ఎలా ఇంటికి తీసుకురావాలో ఆలోచించు, అన్నయ్య నిర్దోషి అని సమాజానికి చూపించు. అప్పుడు నువ్ చేసింది తప్పు కాదని అందరూ అనుకుంటారు. ఒక పోలీస్‌గా ఆలోచించు. పరిష్కారం అదే వస్తుంది అని కల్యాణ్ ధైర్యం చెబుతాడు.
మరుసటి రోజు ఉదయం అంతా కోర్టులో ఉంటారు. జడ్జ్ వస్తాడు. ముద్దాయి ఎక్కడ అనేసరికి రాజ్‌ను అప్పు తీసుకొస్తుంది. బోనులో ఉన్న ఈ రాజ్ అమాయుకుడు కాదు. తన ప్రత్యర్థి సామంత్‌తో ఆస్తి విభేదాలు ఉన్నాయి. అతని మీద కసి, కోపం పెంచుకుని సామంత్‌ను అతి దారుణంగా హత్య చేశారు. చంపిన తర్వాత తన శవాన్ని కారులో పెట్టి దర్జాగా ఇంటికి తీసుకెళ్లాడు. శవాన్ని మాయం చేయాలని చూస్తుంటే పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి కఠిన శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుతున్నాను అని అనామిక లాయర్ అంటాడు.
రాజ్ తరఫున మరో లాయర్ వాదిస్తాడు. నా ముద్దాయి కుటంబానికి చాలా పరువు ప్రతిష్టలు ఉన్నారు. ఆయన చాలా సౌమ్యులు. విదేశాల్లో చదువుకుని వచ్చారు. ముఖ్యంగా ఆవేశపరులు కాదు. కసి కోపం ఉన్నవాళ్లు అంతకన్నా కాదు అని డిఫెన్స్ లాయర్ అంటాడు. ఆయన గుణగణాలు కోర్టుకు అవసరం లేదు. అతను పథకం ప్రకారం హత్య చేశారా, క్షణికావేశంలో చేశారా అనేది కావాలి. పాయింట్‌కు రండి అని జడ్జ్ అంటాడు.
నిరపరాధి అంటే ఎలా
అసలు నా క్లైంట్‌కు ఈ హత్యకు ఏ సంబంధం లేదు. హత్య జరిగిన రాత్రి అతనికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫ్యాక్టరీ గురించి కాల్ వస్తే వెళ్లి వాళ్లను తరిమేసి ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం పోలీసులు రావడం, కారులో శవం దొరకడం ఇదంతా ఎవరో గిట్టని వాళ్లు చేసిన పని. కాబట్టి నా క్లైంట్‌ను నిరపరాధిగా భావించి విడుదల చేయాలని కోరుతున్నాను అని లాయర్ అంటాడు. గుణగణాలు చెప్పి, ఇంటి నేపథ్యం చెప్పి నిరపరాధి అంటే ఎలా అని పీపీ అంటాడు.
మరి అపరాధి అనడానికి ఏ సాక్ష్యాలు ఉన్నాయని డిఫెన్స్ లాయర్ అంటాడు. ఇద్దరు లాయర్స్ వాదించుకుంటారు. తర్వాత గొడవ పడతారు. ఏంటీ మీదకు వస్తున్నారు. కొడతారా అని రాజ్ లాయర్ అంటాడు. జడ్జ్ ఆర్డర్ అంటూ పీపీ గారు ఏంటిది అని అంటాడు. ఇంత ఆవేశం ఏంటండి బాబు. అయ్యో నా వాచ్.. నా వాచ్ ఏది.. నా వాచ్ ఎవరో దొంగలించారు యువరానర్. ఇప్పుడు ఈయన నా మీదకు వచ్చారు. ఈయనే తీసుంటారు అని రాజ్ లాయర్ అంటాడు.
నాకేం అవసరం అని అనామిక లాయర్ అంటాడు. ఈ వాచ్ గోల ఏంటని జడ్జ్ అడిగితే.. అయ్యో అది మా అత్తగారు పెట్టింది. అది లేకుంటే మా ఆవిడ ఇంట్లోకి రానివ్వదు. వాచి లేకుంటే నాకు వాచిపోతుంది. ఒకసారి పీపీ జేబులో చెక్ చేయించండి అని రాజ్ లాయర్ అంటాడు. దాంతో కానిస్టేబుల్ వచ్చి చూస్తే వాచ్ ఉంటుంది. దొరికింది. ఇది నా వాచే. ఈయనే దొంగ అని రాజ్ లాయర్ అంటాడు. నా జేబులో ఉంటే దొంగ అవుతానా అని అనామిక లాయర్ అంటాడు.
ఎవరైనా శవం పెట్టి ఉండొచ్చు
మరి నా క్లైంట్ ఎలా నేరస్థుడు అవుతాడు. యువరానర్ అచ్చం ఇలాగే నా క్లైంట్ విషయంలో జరిగింది. పీపీ గారిని దొంగ అన్నందుకు నన్ను క్షమించండి. ఇందాక నా మీదకు వచ్చినట్లు నేనే వాచ్ పెట్టాను. ఆయనకు తెలియకుండా నేను వాచ్ పెట్టినట్లే నా క్లైంట్ కారులో కూడా ఎవరైనా శవం పెట్టి ఉండొచ్చు కదా. నోట్ దిస్ పాయింట్ యువరానర్ అని రాజ్ లాయర్ అంటాడు.దాంతో అంతా చప్పట్లు కొడతారు. డిఫెన్స్ లాయర్ గారు చాలా చక్యంగా నన్ను ముద్దాయిని చేసి ముద్దాయిని నిజాయితీ పరుడిని చేశారు అని అనామిక లాయర్ అంటాడు.
కానీ, ముద్దాయి ఎంతటి ఆవేశపరుడో తెలియజేయటానికి ఒకరిని బోనులోకి రావాల్సిందిగా కోరుతున్నాను. అది ముద్దాయి భార్య అని లాయర్ అంటాడు. దాంతో కావ్య వచ్చి బోనులో నిల్చుంటుంది. హత్య జరగడానికి ముందు రోజు సామంత్‌తో గొడవ పడటానికి వెళ్లారా, సామరస్యంగా మాట్లాడటానికి వెళ్లారా అని లాయర్ అంటే.. అది అతను అని కావ్య అంటుంది. ఆవేశంగా వెళ్లారు కదా. సమాధానం చెప్పండి అని లాయర్ గద్దిస్తాడు. దాంతో అవును అని కావ్య చెబుతుంది.
కావ్యను నిందించిన అపర్ణ
తర్వాత సామంత్, నందా విషయం జడ్జ్‌కు చెబుతుంది కావ్య. సామంత్‌కు వార్నింగ్ ఇవ్వడానికి మాత్రమే వెళ్లాం. కానీ, చంపాలనే ఉద్దేశంతో కాదు అని కావ్య చెబుతుంది. తర్వాత ముద్దాయికి బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు లేకుండా చేస్తే ఆ రిస్క్ కోర్టు తీసుకునేందుకు సిద్ధంగా లేదు. కాబట్టి బెయిల్ రెజెక్ట్ చేస్తున్నాను అని జడ్జ్ అంటాడు. తర్వాత ఇంట్లో భర్తకే వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతావా. నువ్ చెప్పిన సాక్ష్యం వల్ల వాడి జీవితమే ప్రశ్నగా మారిపోయింది. ఈరోజు నా కొడుకు విషయంలో తప్పు చేసేసావ్ అని కావ్యను నిందిస్తుంది అపర్ణ. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్