Which AC is Good: సమ్మర్ హీట్ తట్టుకోలేక AC కొనాలనుకుంటున్నారా? ఎటువంటి AC తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి!

Best Web Hosting Provider In India 2024

Which AC is Good: సమ్మర్ హీట్ తట్టుకోలేక AC కొనాలనుకుంటున్నారా? ఎటువంటి AC తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu
Feb 24, 2025 10:30 AM IST

Which AC is Best: వేసవిలో AC కొనడమే సొల్యూషన్, ఫ్యాన్, కూలర్‌లు సరిపోవడం లేదని ఫిక్సయిపోయారా? అయితే, రండి.. ACలలోని రకాలు, వాటి మెయింటైనెన్స్ గురించి తెలుసుకుందాం. దానిని బట్టే మీ అవసరానికి ఏది సూట్ అవుతుందో తెలుస్తుంది.

మీకు సెట్ అయ్యే AC కోసం వెదుకుతున్నారా?
మీకు సెట్ అయ్యే AC కోసం వెదుకుతున్నారా? (Pixabay)

వేసవి వేడికి తట్టుకోలేక చాలా AC బాట పడుతుంటారు. కొత్తగా AC కొనుగోలు చేసేవారికి మార్కెట్లో ఆఫర్లు ఊరిస్తూ ఏది కొనుగోలు చేయాలో తెలియక తికమక పెడుతుంటాయి. మరి, మీరు ఆఫర్ చూసి కొనాలనుకుంటున్నారా? మీ అవసరాన్ని బట్టి సరిపడ కెపాసిటీ AC కొనాలనుకుంటున్నారా? డిసైడ్ చేసుకోండి. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ప్రొడక్టులు ఈజీగా దొరికేస్తున్నాయి. దీంతో మీ ఇంటికి లేదా వర్క్ లొకేషన్‌కి కొత్త ఎయిర్ కండిషనర్ (AC) కొనుగోలు చేయడం ఈ రోజుల్లో కష్టమైన పని కాదు. దీని కోసం AC కెపాసిటీ, విద్యుత్ ఖర్చు చేసుకునే సామర్థ్యం, స్మార్ట్ ఫీచర్లు గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఉత్తమమైన దానిని ఎంచుకోవడానికి, AC రకం, బ్రాండ్, టన్నులు వంటి ప్రాథమిక ఫీచర్లను తప్పనిసరిగా పరిశీలించాలి.

ACల్లో రకాలు:

ప్రధానంగా రెండు రకాల ACలు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు తగినదాన్ని మీరే ఎంచుకోవచ్చు. మీ అవసరాలపై మీరు స్పష్టంగా ఉంటే, కావలసినదాన్ని ఎంచుకోవడం చాలా సులభం.

స్ప్లిట్ AC

స్ప్లిట్ ACలు, పేరు సూచించినట్లుగా, రెండు వేరు వేరు యూనిట్లుగా విభజించి ఉంటాయి. ఇండోర్ యూనిట్ అన్ని ప్రాథమిక భాగాలను కలిగి ఉంటే, అవుట్‌డోర్ యూనిట్ కంప్రెసర్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇంటిని అందంగా కనిపించేలా చేస్తుంది. ఇంటి అలంకరణ స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి మీ కంప్రెసర్ యూనిట్‌ను బాల్కనీలో సులభంగా ఉంచవచ్చు. కిటికీ ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా, దీన్ని మీ ఇంటి ఏ గదిలోనైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. స్ప్లిట్ ACలు కొంత ఖరీదైనవి.

విండో ACలు

విండో ACలు ఎక్కువగా సింగిల్ రూమ్‌లకు ఉపయోగిస్తారు. ఇందులో అన్ని చల్లబరిచే యూనిట్లు ఒకే కాంపాక్ట్ యూనిట్‌లో అమర్చి ఉంటాయి. ఈ ACలు చౌకగా రావడంతో పాటు వీటి మెయింటైనెన్స్ కూడా చాలా సులభం. ఎందుకంటే, ఒకవేళ వేరేది రీప్లేస్ చేయాలనుకుంటే కూడా మళ్ళీ ఇన్‌స్టాల్ చేయడం చాలా సులభం.

సామర్థ్యం – గది పరిమాణం

చిన్న గదులు (120 చదరపు అడుగుల వరకు) → 1 టన్ను AC సరిపోతుంది.

మధ్య తరహా గదులు (121-180 చదరపు అడుగులు) → 1.5 టన్ను AC సరిపోతుంది.

పెద్ద గదులు (180+ చదరపు అడుగులు) → 2 టన్ను AC సరిపోతుంది.

ఇంధన సామర్థ్యం లేదా స్టార్ రేటింగ్

విద్యుత్ వినియోగాన్ని స్టార్ రేటింగ్ తో సూచిస్తారు. 5 స్టార్ ఉంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తుందని, 3 స్టార్ ఉంటే కాస్త ఎక్కువని ఇలా స్టార్లు తగ్గే కొద్దీ విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతూ ఉంటుంది. 5 స్టార్ ఉంటే విద్యుత్తు ఆదా ఎక్కువ.

కూలింగ్ టెక్నాలజీ

ఇన్వర్టర్ టెక్నాలజీ – విద్యుత్ వినియోగాన్ని ఆదా చేస్తుంది. స్థిరమైన చల్లదనాన్ని అందిస్తుంది.

డ్యూయల్-ట్రిపుల్ ఇన్వర్టర్ AC – మరింత సమర్థవంతమైనది

ఇన్వర్టర్ ACకి నాన్-ఇన్వర్టర్ ACకి ఉన్న తేడా

ఇన్వర్టర్ ACలు నిర్దిష్ట వేగంతో పెద్ద గదిని చల్లబరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ ఇన్వర్టర్ టెక్నాలజీ ఎక్కువగా స్ప్లిట్ ACలకు ఉంటుంది. కానీ, ఇటీవల కాలంలో విండో ACలు కూడా ఈ టెక్నాలజీతో వస్తున్నాయి. ఇన్వర్టర్ ACలు.. నాన్-ఇన్వర్టర్ ACల కంటే మరింత సమర్థవంతమైనవి. విద్యుత్ బిల్లులను తగ్గించి డబ్బును ఆదా చేస్తాయి.

ఎయిర్ ఫిల్టర్లు, ప్యూరిఫికేషన్

ధూళి, అలర్జీలను తొలగించడానికి PM 2.5 ఫిల్టర్లు లేదా HEPA ఫిల్టర్లను ఎంచుకోవడం బెటర్.

బ్రాండ్, వారంటీ

ఉత్తమ వారంటీతో నమ్మదగిన బ్రాండ్‌ను ఎంచుకోండి. AC కంప్రెసర్‌పై కనీసం 5 సంవత్సరాల వారంటీ ఉండాలి.

ఇంటికి లేదా ఆఫీసుకు AC కొనుగోలు చేసే ముందు ఈ అన్ని విషయాలను గుర్తుంచుకొని కొనుగోలు నిర్ణయం తీసుకోండి. అలాగే, కొన్నిసార్లు ఆన్‌లైన్ మార్కెట్ ధరలోనే షాపింగ్ మాల్స్‌లో కూడా ఆఫర్ సేల్ ఉంటుంది. వేసవి ప్రత్యేక సేల్ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, ఉచిత ఇన్‌స్టాలేషన్ వంటి విషయాలను కూడా గమనించండి. లేకపోతే స్టెబిలైజర్, ఇన్‌స్టాలేషన్ ఖర్చు ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024