Mazaka Trailer Review: పెగ్గేసాక సిగ్గు ఏముంటుంది, బాలయ్య బాబు ప్రసాదం.. నవ్వించేలా డైలాగ్స్.. అదిరిపోయిన మజాకా ట్రైలర్

Best Web Hosting Provider In India 2024

Mazaka Trailer Review: పెగ్గేసాక సిగ్గు ఏముంటుంది, బాలయ్య బాబు ప్రసాదం.. నవ్వించేలా డైలాగ్స్.. అదిరిపోయిన మజాకా ట్రైలర్

Sanjiv Kumar HT Telugu
Feb 24, 2025 10:59 AM IST

Sundeep Kishan Mazaka Trailer Released And Review: సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటించిన మజాకా ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. బాలకృష్ణ జై బాలయ్య, బాలయ్య బాబు ప్రసాదం, పెగ్గేసాక సిగ్గేముంటుంది అంటూ హిలేరియస్ డైలాగ్స్‌తో కడుపుబ్బా నవ్వించేలా మజాకా ట్రైలర్ ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..!

సందీప్ కిషన్ మజాకా ట్రైలర్ రివ్యూ
సందీప్ కిషన్ మజాకా ట్రైలర్ రివ్యూ

Sundeep Kishan Mazaka Trailer Review: హీరో సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ మజాకా. సందీప్ కిషన్ సినీ కెరీర్‌లో 30వ సినిమాగా వస్తోన్న ఈ సినిమాకు ధమాకా డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించారు.

మజాకా ట్రైలర్ రిలీజ్

ఎంటర్‌టైనింగ్ అండ్ ఎంగేజింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ మజాకా మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మించారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా ఉన్నారు. తాజాగా ఫిబ్రవరి 23న మజాకా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

మజాకా ట్రైలర్ ఆద్యంతం కామెడీతో అదిరిపోయింది. మజాకా ట్రైలర్‌ రివ్యూలోకి వెళితే.. రావు రమేష్, సందీప్ కిషన్ తండ్రీ కొడుకులు. ఎటువంటి కట్టుబాట్లు, బాధ్యతలు లేకుండా జీవితాన్ని బ్యాచిలర్స్‌లా హాయిగా గడుపుతుంటారు. సందీప్‌కు రీతు వర్మపై ప్రేమ కలుగుతుంది. ఈ క్రమంలో వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. “అమ్మాయిలతో మాట్లాడటం సిగ్గండి.. పెగ్గేసాకా సిగ్గేం ఉంటదండి” అని సందీప్ కిషన్ చెప్పే డైలాగ్ బాగుంది.

మన్మథుడిలా ఉండాలి

ఇక మరోవైపు సందీప్ కిషన్ తండ్రి రావు రమేష్ అన్షుని ఇష్టపడతాడు. “ఆమెను పడేయాలంటే మన్మథుడులా ఉండాలి. మీరు మనవడిని ఎత్తుకునేలా ఉన్నారు” అనే డైలాగ్ కామెడీ తెప్పించింది. ఇలా సాఫీగా ఉన్న వీరి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ట్రైలర్ మజాకా మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్లింప్స్‌ని అందించింది.

సినిమాలో ఉండే వినోదం, ఉత్సాహాన్ని రుచి చూపించినట్లుగానే ఉంది. త్రినాధ రావు నక్కిన మార్క్ టేకింగ్‌తో నలుగురు ప్రధాన పాత్రల చుట్టూ హిలేరియస్ కథను రూపొందించారు. పుష్కలంగా హ్యుమర్‌ని క్రియేట్ చేశారు. “బాలయ్య బాబు ప్రసాదం. కళ్లకు అద్దుకుని తాగమని చెప్పు. తాగిన తర్వాత మూడు సార్లు జై బాలయ్య అనమని చెప్పు” అని హైపర్ ఆది మందు బాటిల్ ఇచ్చే సీన్ హైలెట్‌గా నిలిచింది.

హైలెట్‌గా సన్నివేశాలు

ఇలా బాలయ్య బాబు డైలాగ్స్ ట్రైలర్‌కు హ్యూమరస్ ముగింపును ఇచ్చింది. కాగా, ఇది సందీప్ కిషన్ ఫస్ట్ ఫుల్ లెంత్ ఫన్ రోల్. తన పాత్రని అద్భుతమైన ఎనర్జీతో చేశాడు. రావు రమేష్ తండ్రిగా ఆకట్టుకునే నటన కనబరిచారు. రీతు వర్మ పాత్ర కూడా ఆకట్టుకుంది. సందీప్ రీతు మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా ఉన్నాయి. అన్షు పాత్ర చాలా వినోదాన్ని అందించింది.

నిజార్ షఫీ ఆకట్టుకునే విజువల్స్‌ అందించారు. లియోన్ జేమ్స్ ఎనర్జిటిక్ నేపథ్య సంగీతం పండుగ వాతావరణాన్నితీసుకొచ్చింది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్యాలిటీలో ఉన్నాయి. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్షన్, పృథ్వి స్టంట్స్ ట్రైలర్ ఇంపాక్ట్‌ని మరింత పెంచింది.

అదిరిపోయిన కాంబో

ఇక దర్శకుడు త్రినాధ రావు నక్కినతో కలిసి పని చేసే ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలను రూపొందించడంలో తన నైపుణ్యాన్ని చూపించారు. హిట్ ప్రాజెక్టులను క్రియేట్ చేయడంలో మంచి ట్రాక్ రికార్డ్‌ ఉన్న ఈ జంట తమ సిగ్నేచర్ స్టయిల్‌లో హ్యుమర్ అండ్ డ్రామాని అందించినట్లుగా తెలుస్తోంది. కాగా, మజాకా సినిమా ఫిబ్రవరి 26న మహా శివరాత్రికి విడుదల కానుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024