Karthika Deepam 2 Serial: జ్యోత్స్న దొంగ లెక్క‌లు – బండారం బ‌య‌ట‌పెట్టిన తాత – దీప‌ను కొడ‌తాన‌న్న కార్తీక్‌

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Serial: జ్యోత్స్న దొంగ లెక్క‌లు – బండారం బ‌య‌ట‌పెట్టిన తాత – దీప‌ను కొడ‌తాన‌న్న కార్తీక్‌

Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 ఫిబ్ర‌వ‌రి 24 ఎపిసోడ్‌లో జ్యోత్స్న చేస్తోన్న ఒక్కో త‌ప్పులు బ‌య‌ట‌ప‌డుతుంటాయి. కంపెనీ న‌ష్టాల‌ను క‌ప్పిపుచ్చి దొంగ లెక్క‌ల‌తో ప్రాఫిట్స్ చూపిస్తుంది. ఈ విష‌యం శివ‌న్నారాయ‌ణ‌కు తెలిసిపోవ‌డంతో మ‌న‌వ‌రాలిపై ఫైర్ అవుతాడు.

 
కార్తీక దీపం 2 ఫిబ్ర‌వ‌రి 24 ఎపిసోడ్‌
కార్తీక దీపం 2 ఫిబ్ర‌వ‌రి 24 ఎపిసోడ్‌
 

Karthika Deepam 2 Serial: జ్యోత్స్న అంటూ శివ‌న్నారాయ‌ణ గ‌ట్టిగా కేక‌లు వేయ‌డంతో పారిజాతం కంగారు ప‌డుతుంది. అంత‌గా గ‌ట్టిగా పిలుస్తున్నాడంటే మ‌ళ్లీ ఏం త‌ప్పు చేశావ‌ని మ‌న‌వ‌రాలిని నిల‌దీస్తుంది స‌త్య‌రాజ్ రెస్టారెంట్ గురించే అయ్యుంటుంది కంగారు ప‌డ‌కు అని కూల్‌గా జ్యోత్స్న బ‌దులిస్తుంది.

 

ఎందుకు అబ‌ద్ధం చెప్పించావు…

జ్యోత్స్న రాగానే…నాతో ఎందుకు అబ‌ద్ధం చెప్పించావు…అబ‌ద్ధాల‌తో న‌న్ను న‌మ్మించాల‌ని ఎందుకు అనుకున్నావ‌ని నిల‌దీస్తాడు. నిజం ఎప్ప‌టికీ బ‌య‌ట‌ప‌డ‌ద‌ని అనుకున్నావా అని అంటాడు. శివ‌న్నారాయ‌ణ దేని గురించి మాట్లాడుతున్నాడో తెలియ‌క జ్యోత్స్న‌ టెన్ష‌న్ ప‌డుతుంది. దాసు గురించి జ్యోత్స్న‌కు నిజం తెలిసిపోయిందా అని ద‌శ‌ర‌థ్ అనుకుంటాడు.

దొంగ లెక్క‌లు రాయించి…

కంపెనీ న‌ష్టాల్లో ఉంటే దొంగ లెక్క‌లు రాయించి ప్రాఫిట్స్ చూపించింద‌ని జ్యోత్స్న చేసిన త‌ప్పును శివ‌న్నారాయ‌ణ బ‌య‌ట‌పెడ‌తాడు. అకౌంటెంట్‌ను నిల‌దీస్తే సీఈవో జ్యోత్స్న చెబితేనే దొంగ లెక్క‌లు రాశాన‌ని ఒప్పుకున్నాడ‌ని శివ‌న్నారాయ‌ణ అంటాడు. జ్యోత్స్న త‌న ప‌రువు తీసింద‌ని శివ‌న్నారాయ‌ణ కోపంతో చిందులు తొక్కుతాడు. జ్యోత్స్నను ఎలా కాపాడాలో తెలియ‌క పారిజాతం స‌త‌మ‌త‌మ‌వుతుంది.

చేత‌కానిత‌నం…

నువ్వు జ్యోత్స్న‌ను గుడ్డిగా న‌మ్మావు…నీ న‌మ్మ‌కాన్ని జ్యోత్స్న నిల‌బెట్ట‌లేద‌ని ఎంప్లాయిస్ విష‌యంలో గొడ‌వ జ‌రిగిన‌ప్పుడే అర్థ‌మైంద‌ని ద‌శ‌ర‌థ్ కూడా కూతురినే త‌ప్పు ప‌డ‌తాడు. దొంగ‌లెక్క‌లు రాసి ప్రాఫిట్స్ చూపించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని కూతురిని సుమ‌తి నిల‌దీస్తుంది. త‌న చేత‌కానిత‌నం ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డుతుంద‌నే భ‌యంతోనే జ్యోత్స్న ఈ ప‌ని చేసి ఉంటుంద‌ని శివ‌న్నారాయ‌ణ అంటాడు. రెస్టారెంట్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా న‌డ‌ప‌టంలో, స్టాఫ్‌ను మ్యానేజ్‌లో చేయ‌డంలో అకౌంట్స్ రాయ‌డంలో ఫెయిలైంద‌ని జ్యోత్స్న‌కు శివ‌న్నారాయ‌ణ క్లాస్ ఇస్తాడు. నువ్వు టోట‌ల్లీ ఫెయిల్యూర్ అని చెబుతాడు.

 

దీనికి అంత‌టికి మ‌నం జ్యోత్స్న మీద పెట్టుకున్న న‌మ్మ‌కం అని ద‌శ‌ర‌థ్ అంటాడు. కాద‌ని కార్తీక్ అని శివ‌న్నారాయ‌ణ చెబుతాడు.

కార్తీక్ గురించి ఆలోచిస్తూ…

జ్యోత్స్న ఇర‌వై నాలుగు గంట‌లు కార్తీక్ గురించే ఆలోచించిస్తుంది…కార్తీక్ ఛీ కొట్టిన వాడే కావాల‌ని కోరుకుంటుంది. కోరుకున్న‌ది దొర‌క్క మూర్ఖురాలిగా జ్యోత్స్న మారిపోయింద‌ని ఫైర్ అవుతాడు. జ్యోత్స్న బాగు ప‌డాలంటే ఒక్క‌టే మందు ఉంద‌ని, అదే జ్యోత్స్న పెళ్లి అని శివ‌న్నారాయ‌ణ అంటాడు. మంచి సంబంధం చూసి వీలైనంత తొంద‌ర‌గా పెళ్లి చేద్ధామ‌ని అంటాడు.

బావే నా భ‌ర్త‌…

తాను పెళ్లిచేసుకోన‌ని జ్యోత్స్న అంటుంది. కార్తీక్ త‌న భ‌ర్త అని తాత‌య్య‌కు చెబుతుంది. ఛీ నోర్మూయ్ అని మ‌న‌వ‌రాలిని చీత్క‌రించుకుంటాడు శివ‌న్నారాయ‌ణ‌. కార్తీక్… దీప భ‌ర్త అని సుమిత్ర అంటుంది. మీ ఇద్ద‌రికి పెళ్లి కాలేద‌ని ద‌శ‌ర‌థ్ అంటాడు. కార్తీక్ త‌న భ‌ర్త అని మీరే చెప్పార‌ని త‌ల్లిదండ్రుల‌తో వాదిస్తుంది జ్యోత్స్న‌. నిన్ను వ‌ద్ద‌నుకున్న మ‌నిషి కోసం వెంప‌ర్లాడ‌టానికి సిగ్గుగా లేదా అని జ్యోత్స్న‌తో శివ‌న్నారాయ‌ణ అంటాడు. లేద‌ని జ్యోత్స్న బ‌దులిస్తుంది.

రెండు రోజులు టైమ్‌…

నీకు రెండు రోజులు టైమ్ ఇస్తున్నాను. నువ్వు పెళ్లికి స‌రే అంటే నీకు న‌చ్చిన‌వాడితో నీ పెళ్లి జ‌రుగుతుంది. లేదంటే మేము చూసిన‌వాడితోనే నీ పెళ్ల‌వుతుంద‌ని మ‌న‌వ‌రాలికి వార్నింగ్ ఇస్తాడు జ్యోత్స్న‌. పెళ్లి ఎప్పుడో చెబితే…మేము వ‌చ్చి అంక్షింత‌లు వేస్తామ‌ని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న పెళ్లిని ఆల‌స్యం చేయ‌ద్ద‌ని ద‌శ‌ర‌థ్ అంటుంది.

 

నా మ‌న‌సు మార‌దు…

నేను పెళ్లిచేసుకోన‌ని, బావే నా భ‌ర్త అని తాత‌య్య‌తో అంటుంది జ్యోత్స్న‌. నీకు రెండు రోజులు కూడా టైమ్ ఇవ్వాల్సిన ప‌నిలేద‌ని శివ‌న్నారాయ‌ణ అంటాడు. పెళ్లి విష‌యంలో త‌న మ‌న‌సు మార‌ద‌ని చెప్పి కోపంగా జ్యోత్స్న అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. అకౌంట్స్ విష‌యంలో జ్యోత్స్న‌ను ఏం అనోద్ద‌ని ద‌శ‌ర‌థ్‌, సుమిత్ర‌ల‌తో అంటాడు శివ‌న్నారాయ‌ణ‌. జ్యోత్స్న మ‌న‌సుతో ఆడుకొని మ‌న‌మే త‌ప్పు చేశావ‌ని, మ‌న వంశానికి ఒక్క‌గానొక్క వార‌సురాలు అని శివ‌న్నారాయ‌ణ అంటాడు. త‌ప్పు ఏదైనా జ‌రిగిందంటే అది నా వ‌ల్ల నా కూతురు వ‌ల్ల అని ద‌శ‌ర‌థ్ అంటాడు.

కొత్త రెస్టారెంట్ బాధ్య‌త‌లు…

స‌త్య‌రాజ్ రెస్టారెంట్ బాధ్య‌త‌ల‌ను దీప‌, కార్తీక్ చేప‌డ‌తారు. అక్క‌డి ఎంప్లాయిస్‌తో కార్తీక్ మాట్లాడుతాడు. మీరు రెస్టారెంట్ తీసుకొని మంచి ప‌ని చేశార‌ని కార్తీక్‌ను పొగుడుతారు. మీరు వ‌చ్చారంటే త‌ప్ప‌కుండా మ‌న రెస్టారెంట్ నంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌కు చేరుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటారు. వారిలో త‌న మాట‌ల‌తో స్ఫూర్తిని నింపుతాడు కార్తీక్‌. రెస్టారెంట్ బాగుండ‌టం కోసం ఏం చేయాలో చెబుతాడు.

ఉప్మా బిర్యానీ…

రెస్టారెంట్ మెనూ మార్చుదామ‌ని చెఫ్‌తో చెబుతాడు కార్తీక్‌. తెలుగు సంప్ర‌దాయ వంట‌లు చేయ‌డంలో దీప స్పెష‌ల్ అని అంటాడు. ఈ రోజు స్పెష‌ల్‌గా ఏం రాయ‌మంటార‌ని మేనేజ‌ర్ అడుగ‌తాడు. ఉప్మా బిర్యానీ రాయ‌మ‌ని దీప అంటుంది. అవి చేయ‌డం నాకు రాద‌ని చెఫ్ కంగారు ప‌డ‌తాడు. దీప చూసుకుంటుంద‌ని కార్తీక్ అంటాడు.

 

డ్రిల్ మాస్ట‌ర్ గుర్తొచ్చాడు.

సొంత వాళ్లైనా త‌ప్పు చేస్తే కొడ‌తాన‌ని అన్నారుగా…ఉప్మా బిర్యానీ స‌రిగ్గా రాక‌పోతే న‌న్ను కొడ‌తారా అని కార్తీక్‌ను అడుగుతుంది దీప‌. కొడ‌తాన‌ని కార్తీక్ బ‌దులిస్తాడు. మిమ్మ‌ల్ని చూస్తుంటే చిన్న‌ప్పుడు మా డ్రిల్ మాస్టార్ గుర్తుస్తున్నాడ‌ని, ఆయ‌న మాట‌ల‌తోనే భ‌య‌పెట్టేవాడ‌ని, మీరు చూపుల‌తోనే భ‌య‌పెడుతున్నార‌ని కార్తీక్‌తో అంటుంది.

జ్యోత్స్న ఎంట్రీ…

కార్తీక్ రెస్టారెంట్‌కు జ్యోత్స్న వ‌స్తుంది. కావాల‌నే కార్తీక్‌ను గుద్దుతుంది. నువ్వా ఎందుకొచ్చావ‌ని జ్యోత్స్న‌ను అడుగుతాడు కార్తీక్‌. ఫ‌స్ట్ డే క‌దా విష్ చేద్దామ‌ని వ‌చ్చాన‌ని దీప అంటుంది. అవ‌స‌రం లేదు వెళ్లిపోమ‌ని కార్తీక్ బ‌దులిస్తాడు. నేను క‌స్ట‌మ‌ర్‌గా వ‌చ్చాన‌ని మాట మార్చేస్తుంది దీప‌. త‌న‌కు ఉప్మా బిర్యానీ కావాల‌ని ఆర్డ‌ర్ ఇస్తుంది.

కండ‌లు పీకేస్తా…

వంట చేస్తోన్న దీప‌ను ఈగ‌లు తొలుకుంటున్నావా…రేప‌టి నుంచి నువ్వు ఇదే ప‌ని చేయాల‌ని జ్యోత్స్న సెటైర్లు వేస్తుంది. చీమ‌లు దులుపుతున్నాన‌ని దీప బ‌దులిస్తుంది. ఈ వెధ‌వ చీమ‌లు ఏంటో మ‌నం ఎక్క‌డున్నా వెతుక్కుంటూ వ‌స్తాయి అంటూ కౌంట‌ర్ వేస్తుంది. కానీ ఇప్పుడు బెల్లం నా ద‌గ్గ‌ర ఉంది. ఊరికే ఊపుకుంటూ వ‌స్తే కండ‌లు పీకేస్తాన‌ని అంటుంది.

జ‌నాలు రావాలి క‌దా…

ఈ రెస్టారెంట్‌కు ఎవ‌రూ రార‌ని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఇక బ‌య‌లుదేరితే మంచిద‌ని కార్తీక్ అంటాడు. ఇత‌ర క‌స్ట‌మ‌ర్స్ కోసం చేసిన ఫుడ్‌ను బ‌ల‌వంతంగా తీసుకుంటుంది జ్యోత్స్న‌.

 

దీప చేసిన ఉస్మా బిర్యానీ స్మెల్‌, టేస్ట్ అదిరిపోయాయ‌ని అంటుంది. స‌త్య‌రాజ్ రెస్టారెంట్‌లో ఇక నుంచి ఫుడ్ ఇలాగే ఉంటుంద‌ని జ్యోత్స్న‌తో అంటాడు కార్తీక్‌.

ఫుడ్ బాగుంద‌నే విష‌యం తెలియాలంటే జ‌నాలు రావాలి క‌దా అని జ్యోత్స్న అంటుంది. ఈ ఫుడ్ తిని నేను సింగిల్ రేటింగ్ ఇస్తాను. నెగెటివ్ కామెంట్స్ పెడ‌తాను. సోష‌ల్ మీడియాలో మీ రెస్టారెంట్‌ను ఎంత బ్యాడ్ చేయాలో అంత చేస్తాను. మీ రెస్టారెంట్‌కు ఎవ‌రిని రాకుండా చేస్తాన‌ని అంటుంది.

నేను గెలిపిస్తా…

150 అని కార్తీక్ అంటాడు. నువ్వు తిన్న ఫుడ్‌కు బిన్ అని చెబుతాడు. డ‌బ్బులు ఇచ్చి బ‌య‌లుదేరు అని అంటాడు. నువ్వు ఓడిపోతున్నావ‌నే విష‌యం నీకు తెలియ‌డం లేద‌ని కార్తీక్‌తో కోపంగా అంటుంది జ్యోత్స్న‌. కార్తీక్ గెలుపుకు ఇది తొలి మెట్టు అని దీప అంటుంది.నువ్వు ప‌క్క‌న ఉండ‌గా కార్తీక్ గెల‌వ‌లేడ‌ని జ్యోత్స్న చెబుతుంది. నేను గెలిపించి చూపిస్తాన‌ని దీప ఆన్స‌ర్ ఇస్తుంది. కార్తీక్ గెలుపును ఆప‌డం నీ త‌రం కాద‌ని దీప అంటుంది. అక్క‌డితో నేటి కార్తీక దీపం 2 సీరియ‌ల్ ముగిసింది.

 

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024