



Best Web Hosting Provider In India 2024

Mazaka: ఇద్దరు మగాళ్లు ఉన్న ఇంట్లోకి ఆ ఫొటో రావాలని పడే తపనే ఇది.. ధమాకా డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన కామెంట్స్
Director Trinadha Rao Nakkina About Mazaka In Trailer Launch: ధమాకా సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన కొత్త సినిమా మజాకా. సందీప్ కిషన్ హీరోగా నటించిన మజాకా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మీడియా అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు త్రినాథరావు నక్కిన.
Director Trinadha Rao Nakkina About Mazaka In Trailer Launch: సినిమా చూపిస్తా మావా మూవీతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన రవితేజ, శ్రీలీల జోడీగా తెరకెక్కించిన ధమాకా చిత్రం అంతకుమించిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు మరొ కొత్త సినిమాతో అలరించేందుకు రెడీ అయ్యారు డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన.
దర్శకుడు త్రినాథ రావు నక్కిన తెరకెక్కించిన లేటెస్ట్ తెలుగు కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం మజాకా. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్‌గా చేసింది. రావు రమేష్, మన్మథుడు హీరోయిన్ అన్షు మరో రెండు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా మజాకా మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
ఇప్పటికే మజాకా సినిమాకు, ప్రమోషన్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మజాకా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మజాకా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సందీప్ కిషన్, త్రినాథ రావు నక్కిన, రావు రమేష్, అన్షు ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పారు.
సందీప్ గారు.. ట్రైలర్ చాలా హిలేరియస్‌గా ఉంది. ఇంత వినోదం థియేటర్స్‌లో ఇవ్వడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
-మజాకా సినిమా రెండు గంటల పాటు లాఫ్ రైడ్‌గా ఉంటుంది. థియేటర్స్‌లో చాలా గట్టి నవ్వులు వినిపిస్తాయి. నా కెరీర్‌లో హయ్యస్ట్ నెంబర్స్ ఈ సినిమా ఇస్తుంది. థియేటర్స్‌లో ఫ్యామిలీస్ అంతా చూసే సినిమా ఇది.
-యూనిట్ అంతా మంచి ఎంటర్‌టైనర్ ఇవ్వడానికి కష్టపడి పని చేశాం. ఇందులో పాటలు ఫైట్లు తప్పా.. నాకు రావు రమేష్ గారికి ఈక్వెల్ స్క్రీన్ స్పెస్ ఉంటుంది. ఆయన అద్భుతంగా నటించారు. ఆయన వలన కథ మరింతగా పండింది.
త్రినాథ్ గారు.. మజాకాలో ఉండే మ్యాజిక్ ఏమిటి?
-నేను ప్రతి సీన్‌లో మ్యాజిక్ ఉండాలని నమ్ముతాను. నా ప్రతి సినిమాలో కూడా మ్యాజిక్ జరుగుతుంది. ఇందులో కూడా ఓ మ్యాజిక్ ఉంది. అది జరిగింది. శివరాత్రి నాడు డబుల్ మ్యాజిక్ జరుగుతుంది. డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది.
-ఈ సినిమాలో బ్యూటీఫుల్ ఎమోషన్ ఉంది. ఇద్దరే మగాళ్లు ఉన్న ఒక ఇంట్లో ఏ రోజుకన్నా ఒక ఫ్యామిలీ ఫోటో రావాలని పడే తపనే మజాకా. అందరూ కాసేపు తమ బాధలు మర్చిపోయి ఓ రెండు గంటల పాటు రిలాక్స్ అయి హాయిగా నవ్వుకునే సినిమా చేయడానికి ఇష్టపడతాను. ఇదే నా పార్ములా.
రావు రమేష్ గారు.. ఇందులో మీరు డ్యాన్సులు చేయడం చాలా కొత్తగా అనిపిస్తోంది. సోలో సాంగ్ వస్తే చేస్తారా?
-చేస్తాను. సినిమా అవకాశం రావడమే గొప్ప. అలాంటిది సాంగ్‌కి డ్యాన్స్ చేసే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాను. మజాకాలో ప్రతి సినిమా మజాతో చేశాను. ఇలాంటి సినిమా చేయడం నాకూ కొత్తే. కొత్తగా నవ్వించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్ యూ.
-ఇందులో రొమాంటిక్‌గా నటించడం చాలా సవాల్‌గా అనిపించింది (నవ్వుతూ). ఈ సినిమాతో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో ఒక ఎమోషనల్ సీన్ ఉంది. అది ఐకానిక్ సీన్‌గా నిలిచిపోతుంది. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.
సంబంధిత కథనం