NNS 24th February Episode: మనోహరి తన భార్య అని అమర్‌కు చెప్పిన రణ్‌వీర్.. పోలీస్ స్టేషన్‌కు అమర్, మనోహరి

Best Web Hosting Provider In India 2024

NNS 24th February Episode: మనోహరి తన భార్య అని అమర్‌కు చెప్పిన రణ్‌వీర్.. పోలీస్ స్టేషన్‌కు అమర్, మనోహరి

Hari Prasad S HT Telugu
Feb 24, 2025 01:45 PM IST

NNS 24th February Episode: నిండు నూరేళ్ల సావాసం సోమవారం (ఫిబ్రవరి 24) ఎపిసోడ్లో మనోహరి తన భార్య అని అమర్ కు చెబుతాడు రణ్‌వీర్. అది విని అమర్, మనోహరి ఇద్దరూ షాక్ తింటారు.

మనోహరి తన భార్య అని అమర్‌కు చెప్పిన రణ్‌వీర్.. పోలీస్ స్టేషన్‌కు అమర్, మనోహరి
మనోహరి తన భార్య అని అమర్‌కు చెప్పిన రణ్‌వీర్.. పోలీస్ స్టేషన్‌కు అమర్, మనోహరి

NNS 24th February Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (ఫిబ్రవరి 24) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అనామికను ఇంట్లో నుంచి పంపించేయడానికి మనోహరి ప్లాన్ చేస్తుంది. అమర్ ను భాగీ కన్విన్స్ చేయకముందే ఆమెను దారుణంగా ఇరికిస్తుంది.

అమర్ రూమ్‌లో మనోహరి

పిల్లలను సమయానికి నిద్ర లేపకపోవడంతో అమర్ చేతిలో తిట్లు తిని ఉద్యోగం కోల్పోతుంది అనామిక. అయితే ఆమెను ఇంట్లోనే ఉంచడానికి అమర్ ను కన్విన్స్ చేస్తానని మిస్సమ్మ హామీ ఇస్తుంది. అది విని మనోహరి కొత్త ప్లాన్ వేస్తుంది. అందరి ముందూ అనామికను తిట్టిన మనోహరి.. తర్వాత ఆమె గదికి వెళ్తుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న తనకు ఓ బుక్ ఇవ్వాలని అనుకుంటున్నానని, అది తన రూమ్ లో ఉందని, వెళ్లి తీసుకురావాలని చెబుతుంది.

అయితే తన గదికి బదులు అమర్ గది అడ్రెస్ చెబుతుంది. అక్కడికి సందేహంతోనే అనామిక ఆ రూమ్ లోకి వెళ్తుంది. ఆమె వెనుకాలే వెళ్లిన మనోహరి తలుపు మూసి బయటి నుంచి గొళ్లెం పెడుతుంది. అటు మిస్సమ్మ దగ్గరికి వెళ్లి అనామికపై లేనిపోనివి కల్పించి చెబుతుంది.

అనామికపై అమర్ ఆగ్రహం

అనామిక రూమ్ లోకి వచ్చినప్పుడు అమర్ స్నానం చేస్తుంటాడు. ఆ గది అంతా చూసిన అనామికకు అది అమర్ రూమ్ అని అర్థం అవుతుంది. తర్వాత బాత్రూమ్ లో స్నానం చేస్తున్న శబ్దం వినిపిస్తుంది. గది నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తే తలుపు తెరుచుకోదు. ఇంతలో అమర్ బయటకు వస్తాడు. తాను గదిలోనే ఉన్నట్లు అనామిక చెబుతుంది. దీంతో ఆమెపై అమర్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

ఇంతలో మనోహరి వచ్చి బయట ఉన్న గొళ్లెం తీస్తుంది. ఆ వెంటే మిస్సమ్మ, రాథోడ్ కూడా వస్తారు. అమర్ రూమ్ నుంచి అనామిక రావడం చూసి మిస్సమ్మ షాక్ తింటుంది. ఇక ఈ అమ్మాయి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదని అమర్ గట్టిగా చెప్పడంతో మనోహరి కూడా ఆమెను మరింత ఇరికించే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆమెను కాపాడే అవకాశం లేదని మిస్సమ్మకు కూడా అర్థమవుతుంది.

పోలీస్ స్టేషన్ కు అమర్, మనోహరి

అమర్ కు రణ్‌వీర్ ఫోన్ చేస్తాడు. తనపై జరిగిన దాడి గురించి చెబుతాడు. మనోహరికి కూడా బెదిరింపు కాల్ వచ్చిందని అంటాడు. దీంతో మనోహరిని తీసుకొని పోలీస్ స్టేషన్ లో ఉన్న రణ్‌వీర్ ను కలవడానికి అమర్ వెళ్తాడు. అక్కడ మనోహరి కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది.

బయటకు వచ్చిన తర్వాత అమర్ లో అనుమానం మొదలవుతుంది. అసలు నీపై దాడి చేసిన వాడు మనోహరిని చంపుతానని ఎందుకు బెదిరించాడని రణ్‌వీర్ ను అమర్ అడుగుతాడు. అప్పుడు మనోహరి తన భార్య అని అతడు చెప్పగానే అమర్, మనోహరి, రాథోడ్ షాక్ తింటారు.

రణ్‌వీర్ చెప్పిన ఆ మాట విన్న అమర్ ఏం చేయబోతున్నాడు? అమర్ ముందు మనోహరి అడ్డంగా దొరికిపోయిందా? తర్వాత ఆమె పరిస్థితి ఏం కాబోతోంది అన్నది చూడాలంటే సోమవారం (ఫిబ్రవరి 24) ప్రసారమయ్యే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూడాల్సిందే.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024