OTT Top Movies: ఓటీటీలో ఈ వారం టాప్ 6 సినిమాలు- ఒక్కరోజే 3, తెలుగులో 4- సంక్రాంతికి వస్తున్నాంతోపాటు 2 బోల్డ్ సిరీస్‌లు!

Best Web Hosting Provider In India 2024

OTT Top Movies: ఓటీటీలో ఈ వారం టాప్ 6 సినిమాలు- ఒక్కరోజే 3, తెలుగులో 4- సంక్రాంతికి వస్తున్నాంతోపాటు 2 బోల్డ్ సిరీస్‌లు!

Sanjiv Kumar HT Telugu
Feb 24, 2025 01:36 PM IST

OTT Top Movies This Week To Streaming Telugu: ఓటీటీలోకి ఈ వారం టాప్ 6 సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్‌తోపాటు బోల్డ్ సిరీస్‌లు ఉన్నాయి. అందులో నాలుగు తెలుగు భాషలో, ఒకేరోజు మూడు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో లుక్కేద్దాం.

ఓటీటీలో ఈ వారం టాప్ 6 సినిమాలు- ఒక్కరోజే 3, తెలుగులో 4- సంక్రాంతికి వస్తున్నాంతోపాటు 2 బోల్డ్ సిరీస్‌లు!
ఓటీటీలో ఈ వారం టాప్ 6 సినిమాలు- ఒక్కరోజే 3, తెలుగులో 4- సంక్రాంతికి వస్తున్నాంతోపాటు 2 బోల్డ్ సిరీస్‌లు!

OTT Top Releases This Week Telugu: ఓటీటీలోకి ఈ వారం అంటే ఫిబ్రవరి 24 నుంచి మార్చి 2 వరకు టాప్ 6 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో బోల్డ్ నుంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాల వరకు ఉన్నాయి. మరి అవేంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.

ఏక్ బద్నామ్ ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2 ఓటీటీ

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోని బోల్డ్ వెబ్ సిరీస్‌ల్లో ఆశ్రమ్ సీజన్ ఒకటి. యానిమల్ విలన్ బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ ఇప్పటివరకు మూడు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు తాజాగా ఆశ్రమ్ మూడో సీజన్ పార్ట్ 2 కూడా రానుంది. ఏక్ బద్నామ్ ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2 ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

హిందీతోపాటు తెలుగు, తమిళం, బెంగాలీ భాషల్లో ఫిబ్రవరి 27 నుంచి అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో ఆశ్రమ్ 3 పార్ట్ 2 ఓటీటీ రిలీజ్ కానుంది. అది కూడా ఫ్రీగా చూసేలా అందుబాటులోకి రానుంది ఈ బోల్డ్ వెబ్ సిరీస్.

జిద గర్ల్స్ ఓటీటీ

ఐదుగురు అమ్మాయిల నేపథ్యంలో సాగే హిందీ అడల్ట్ డ్రామా వెబ్ సిరీస్‌ జిడ్డీ గర్ల్స్. ఉమాంగ్ బదానియా, అతియా తారా నాయక్, జైనా అలీ, అనుప్రియ కరోలీ, దీయా దామిని ప్రధాన పాత్రలుగా, సిమ్రాన్, నందితా తాస్, రేవతి ఇతర కీలక పాత్రల్లో నటించిన జిడ్డీ గర్ల్స్ అమెజాన్ ప్రైమ్‌లో ఫిబ్రవరి 27 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్‌తో ఈ సిరీస్ సాగినట్లుగా తెలుస్తోంది.

డబ్బా కార్టెల్ ఓటీటీ

లంచ్ బాక్సులో డ్రగ్స్ సరఫరా చేసే అంశాలతో తెరకెక్కిన హిందీ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్. సీనియర్ హీరోయిన్ జ్యోతిక, అర్జున్ రెడ్డి బ్యూటి షాలిని పాండే, షబానా అజ్మీ, గజరాజ్, నిమేషా సజయన్, అంజలి ప్రసాద్, సాయి తమంకర్ కీలక పాత్రల్లో నటించిన డబ్బా కార్టెల్ నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఫిబ్రవరి 28న రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి ఈ సిరీస్ హిందీలో ఓటీటీ స్ట్రీమింగ్ అవనుందని సమాచారం.

లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ ఓటీటీ

మలయాళ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ లవ్ అండర్‌ కన్‌స్ట్రక్షన్. కొత్త ఇల్లు కట్టుకోవడం, ప్రియురాలు, పెళ్లి అంశాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే ఓ యువకుడి కథగా తెరకెక్కిన లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 28 నుంచి తెలుగు, మలయాళంతో సహా 7 భాషల్లో లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ ఓటీటీ రిలీజ్ కానుంది.

సుడల్ ది వోర్టెక్స్ సీజన్ 2 ఓటీటీ

సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించి సూపర్ హిట్ అయిన ఓటీటీ తమిళ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సుడల్ ది వోర్టెక్ట్స్. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా సీజన్ 2 రానుంది. ఫిబ్రవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో సుడల్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఓటీటీ రిలీజ్ కానుంది.

సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ

ఈ ఏడాది తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్‌పై భారీ బజ్ ఏర్పడింది. అందుకే ఈ వారం ఓటీటీ సినిమాల్లో చాలా స్పెషల్‌గా ఈ మూవీ ఉండనుంది. మార్చి 1న అటు ఓటీటీ, ఇటు బుల్లితెరపై సంక్రాంతికి వస్తున్నాం మూవీనీ ప్రసారం చేయనున్నారు.

సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానెల్‌తోపాటు జీ5లో సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇలా ఇవి ఈ వారం టాప్ 6 ఓటీటీ రిలీజ్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో ఒక ఫిబ్రవరి 28న మూడు ఓటీటీ రిలీజ్ కానుండగా.. తెలుగులో 4 డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే, ఈ టాప్ 6లో ఐదు వెబ్ సిరీస్‌లు ఉంటే ఒక సినిమా మాత్రమే ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024