Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు ఈ భాగాల్లో నొప్పిగా అనిపిస్తుంది, యూరిక్ ఆమ్లం ఇలా తగ్గించుకోండి

Best Web Hosting Provider In India 2024

Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు ఈ భాగాల్లో నొప్పిగా అనిపిస్తుంది, యూరిక్ ఆమ్లం ఇలా తగ్గించుకోండి

Haritha Chappa HT Telugu
Feb 24, 2025 04:30 PM IST

Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం కూడా పెరిగిపోతుంది. కాబట్టి శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిందో లేదో చెప్పే కొన్ని లక్షణాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి.

యూరిక్ యాసిడ్ ఎక్కువైతే కనిపించే లక్షణాలు
యూరిక్ యాసిడ్ ఎక్కువైతే కనిపించే లక్షణాలు (Adobe Stock)

యూరిక్ యాసిడ్ అనేది శరీరంలోనే ఉండే ఒక వ్యర్థ పదార్థం. ఇది అధిక మొత్తంలో శరీరంలో పేరుకు పోతే ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్లే శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగిపోతుంది.

మూత్రపిండాలు ఈ యూరిక్ యాసిడ్ ను ఫిల్టర్ చేస్తాయి. కానీ అధిక మొత్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతే కిడ్నీలు ఫిల్టర్ చేయలేక అలసిపోతాయి. అప్పుడు యూరిక్ యాసిడ్ స్ఫటికాల రూపంలో శరీరంమంతటా వ్యాపించి పేరుకుపోవడం మొదలుపడుతుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

శరీరంలో కొన్ని భాగాల్లో నొప్పిగా అనిపిస్తే అక్కడ యూరిక్ యాసిడ్ పేరుకుపోయిందేమోనని అనుమానించాల్సిందే. ఈ అధిక యూరిక్ యాసిడ్‌ని ఎలా వదిలించుకోవాలో తెలుసుకోండి.

ఈ భాగాల్లో నొప్పి వస్తే..

అధిక యూరిక్ యాసిడ్ వల్ల శరీరంలోని కొన్ని భాగాలలో నొప్పి అధికం అయిపోతుంది. కీళ్ళల్లో నొప్పులు అధికంగా ఉంటే యూరిక్ యాసిడ్ స్పటికాలు అక్కడ పేరుకుపోవడం వల్లే అలా జరుగుతోందని అనుమానించవచ్చు. అలాగే మోకాలిలో కూడా యూరిక్ యాసిడ్ స్ఫటికాలు పేరుకుపోయే అవకాశం ఉంది. మోకాలి నొప్పులు, చేతి వేళ్ళ నొప్పులు వస్తున్నా కూడా వారిలో యూరిక్ ఆసిడ్ అధికంగా ఉందని అర్థం చేసుకోవాలి. కాలివేళ్లు ఉబ్బి నొప్పి పెడుతూ ఉంటే అది యూరిక్ యాసిడ్ వల్లేనేమోనని అనుమానించాల్సిందే. యూరికి యాసిడ్ విపరీతంగా పెరిగిపోతే కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. కిడ్నీలలో నొప్పి కలుగుతుంది. ఇక్కడ చెప్పిన లక్షణాలు ఏవి మీలో ఉన్నా కూడా వైద్యులను కలవాల్సిన అవసరం ఉంది.

యూరిక్ యాసిడ్‌ను ఇలా వదిలించుకోండి

అధిక యూరికి యాసిడ్ లక్షణాలు కనిపిస్తే దాన్ని వదిలించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలను పాటించవచ్చు. నిమ్మరసాన్ని తరచూ తాగుతూ ఉండాలి. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అయితే ఈ నిమ్మరసాన్ని చల్లటి నీటిలో కాకుండా వేడి నీటిలో కలిపి తాగడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. అలాగే కాఫీని రోజులో రెండు సార్లు తాగడం అలవాటు చేసుకోవాలి. కాఫీ తాగితే యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. అది శరీరం నుండి బయటకు పోతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి తాగడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. ఇంట్లో ఉన్న పసుపు పొడి కూడా యూరిక్ యాసిడ్‌ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. కాబట్టి దీనికి శోధ నిరోధక లక్షణాలు అధికంగా ఉంటాయి. పసుపును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.

అలాగే జామకాయలు, ఆపిల్స్, ఓట్స్ చేసిన ఆహారాలను అధికంగా తినాలి. ఇలా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తింటే యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. అల్లం టీ తాగడం ద్వారా కూడా యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకోవచ్చు.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024