ఫ్యాన్ గుర్తు బటన్ నొక్కి వైయ‌స్ జ‌గ‌న్‌ రుణం తీర్చుకోవాలి 

Best Web Hosting Provider In India 2024

అన‌కాప‌ల్లి: ఏటా 36 బటన్ లను నాలుగున్నరేళ్లుగా వైయ‌స్ జగన్ నొక్కుతున్నారు.. వచ్చే ఎన్నికల్లోప్రజలు ఫ్యాన్ గుర్తు బటన్ నొక్కి ఆయన రుణం తీర్చుకోవాల‌ని  స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో  అత్యంత ఉత్సాహంతో సాగుతున్న సామాజిక సాధికార  బస్సుయాత్ర కు శనివారం పెందుర్తి నియోజకవర్గంలో అశేష జనవాహిని మధ్య అపూర్వ స్వాగతం లభించింది.  నియోజకవర్గం పరిధిలోని పెందుర్తిలో నూతనంగా నిర్మించిన పాలిటెక్నిక్ కాలేజీ నూతన బ్లాక్ ను  డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే అదీప్ రాజు కలసి ప్రారంభించారు. అనంతరం బైక్ ర్యాలీతో స్వాగతం పలుకుతూ సబ్బవరం జంక్షన్ లో జరిగిన బహిరంగ సభకు చేరుకుంది. స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ఎంపీలు నందిగం సురేశ్, బీశెట్టి సత్యవతి, ఎమ్యేల్యేలు అదీప్ రాజు, కరణం ధర్మశ్రీ, గొల్ల బాబూరావు, పెట్ల ఉమాశంకర్ గణేశ్ బారీ బహిరంగ సభకు హాజరయ్యారు.

ఏటా 36 బటన్ లను నాలుగున్నరేళ్లుగా జగన్ నొక్కుతున్నారు.. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు బటన్ నొక్కి ఆయన రుణం తీర్చుకోవాలి – స్పీకర్ తమ్మినేని

ఈ సందర్భంగా సబ్బవరం జంక్షన్ లో ఏర్పాటు చేసిన బారీ బాహిరంగసభకు హాజరైన జన ప్రభంజనాన్ని ఉద్దేశించి  స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ, సామాజిక సాధికార యాత్ర ప్రతిపక్షాలకు కలవరం కలిగిస్తూ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందన్నారు. భారతదేశానికి దిక్సూచిగా సాధికార యాత్ర సాగుతోందని పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా ఆ ఫలాలను ఎవరికీ అందలేనందున సమాజంలో హెచ్చుతగ్గులు నెలకొన్నాయని, ఇది గమనించే  ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజునే జగన్ పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారని గుర్తు చేసారు. పేదరికం విద్య, వైద్యం, వ్వవసాయానికి, సంక్షేమానికి అనర్హత కారాదని జగన్ ఆనాడే సంకల్పించారని తెలిపారు. ఎన్నాళ్లుగానో అణగదొక్కిన కులాలను జగన్ ఉద్దరించే సాహసానికి పూనుకున్నారన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ తరహాలో ఆలోచన చేసి అణగారిన కులాలను గుర్తించి  వాటిలో భావసారూప్యత కలిగిన వాటిని కలిపి కార్పొరేషన్ లు  ఏర్పాటు చేసి నిదులు కేటాయించి సమాజంలో తగిన గుర్తింపును ఇచ్చారన్నారు. అత్మగౌరవం, ఆత్మాబిమానాన్ని గతంలో అణగదొక్కితే ఇప్పుడు దమ్ముతో తలెత్తుకుని తిరిగే అవకాశం జగన్ కల్పించారని, బడుగు,బలహీనవర్గాలనుంచి నలుగురు ఉప ముఖ్యమంత్రులు, ఎస్సీని హోమ్ మంత్రిని చేసారంటే జగన్ ధృఢ నిశ్చయానికి నిదర్శనమన్నారు. సమాజంలో మార్పు తీసుకురావాలని జగన్ పాదయాత్ర సమయంలోనే నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు అందుకు తాపత్రాయపడుతున్నారని వివరించారు. ప్రతీ సంవత్సరం 36 బటన్ లు నొక్కి అవినీతి లేకుండా ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారని, అందుకు ప్రతిగా వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి జగన్ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖ పాలనా రాజధానిగా సీఎం జగన్ ప్రకటించిన త్వరాత ప్రపంచ దిగ్గజ సంస్థలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని, జగన్ నిర్ణయంతో ఈ ప్రాంతంలో నాగరికతతో పాటుగా వివిధ రంగాల్లో విశేష వృద్ధిని భవిష్యత్తులో సాదించగలుగుతామన్నారు.

రాష్ట్రంలో 12 శాతం ఉన్న పేదరికం జగన్  పాలనలో 5 శాతానికి తగ్గింది.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సైకిల్ గుర్తు కూడా ఉండదు – ఎంపీ నందిగం సురేశ్

పార్లమెంట్ సభ్యులు నందిగం సురేశ్ మాట్లాడుతూ, రాష్రానికి దిక్సూచిగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు నిలవాలన్నది సీఎం  జగన్ సంకల్పమని, బడుగుల రాజ్యంగా రాష్ట్రాన్ని  నిలుపుతున్నారని పేర్కొన్నారు.  దళిత మహిళలను  హోమ్ మంత్రి చేయడంతో పాటుగా ఐదు మంత్రి పదవులు ఇచ్చి గౌరవం ఇచ్చారన్నారు.  మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేంద్రం ఇటీవల అమలుకు నిర్ణయం తీసుకుంటే, సీఎం జగన్ అధికారంలోకి రాగానే  మహిళలకు ప్రాధాన్యతను  ఇచ్చారన్నారు.  జగన్ చేస్తున్న పాలనను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడని, వెనుకబడిన వర్గాలపై ఆయన పెత్తనం చేస్తే, జగన్ మాత్రం చేయూతనిచ్చి అండగా నిలుస్తున్నారన్నారు.  ఆయన మనవడు తప్పితే మరెవరూ ఇంగ్లీషు మీడియం చదువుకోకూడదని చంద్రబాబు కోర్టుకు వెళితే, దళితుల బిడ్డలు కూడా ఆంగ్ల  మాధ్యమం చదువుకుని ఉన్నత స్థానాలకు  చేరాలని జగన్ ఆశించారన్నారు.  వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తు గల మరో పార్టీ కూడా పోటీ చేస్తుండటంతో  చంద్రబాబుకు సైకిల్ గుర్తు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేసారు.  జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం అప్పులు పాలవుతోందని ఆరోపించారని, మరి ఇప్పుడు గ్యారంటీలంటూ ఎలా హామీలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఐక్యరాజ్యసమితిలో దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర దళిత పిల్లలకు మాట్లాడే అవకాశం వచ్చిందంటే అది జగన్ చలవేనని కొనియాడారు. రాష్ట్రంలో పేదరికం 12 శాతం ఉండగా, ఇవాళ 5 శాతానికి తగ్గిందంటే దానికి కారణం జగన్ పాలన మాత్రమే కారణమని, 14 ఏళ్లు సీఎం గా చేసిన చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క శాతమైనా తగ్గిందా అని ప్రశ్నించారు. పేదల ఆకలి, కష్టం తెలిసిన నేత జగన్ అని,  ఒక  తరం కాదు ఒక చరిత్ర సాగాలంటే మళ్లీ సీఎం జగన్ కావాల్సిన అసవరం ఉందని ఉద్గాటించారు.

మామను వెన్నుపోటు పొడిచినట్లే రైతులను, మహిళలను బాబు వెన్నుపోటు పొడిచి మోసం చేసారు – డిప్యూటీ సీఎం బూడి

డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయాడు మాట్లాడుతూ, నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్ స్థిరంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా సుఖంగా, సంతోషంగా ఉన్నారంటే దానికి  కారణం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సామాజిక సాధికారత అని పేర్కొన్నారు. నాడు – నేడు ద్వారా పాఠశాల వ్యవస్థను సమూలంగా మార్చేసి బడులకు ఆధునిక వసతులు కల్పిస్తూ, అత్యాధునిక బోధన జరిపిస్తున్నారని గుర్తు చేసారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీల విషయంలో చంద్రబాబు ఏరు దాటాక తెప్ప తగలేసాడని ఎద్దేవా చేసారు.  మామను వెన్నుపోటు పోడిచి అధికారంలోకి వచ్చినట్లే, రైతులను, మహిళలను చంద్రబాబు మోసం  చేసాడని, సీఎం జగన్ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి రుణాల మాఫీలు చేపట్టారని, అవ్వాతాతలకు పెన్షన్ దఫాదఫాలుగా పెంచుతూ వస్తుండగా, వచ్చే జనవరి నుంచి రూ. 3 వేల పింఛన్ సగర్వంగా అందుకోబోతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆదరిస్తున్న జనమే వచ్చే ఎన్నికలకు జగన్ సైన్యమని పేర్కొన్నారు.

సీఎం జగన్ విశాఖ నుంచే పాలన చేసే పండుగ రోజులు దగ్గరలోనే ఉన్నాయి – ఎంపీ సత్యవతి

అనకాపల్లి ఎంపీ సత్యవతి మాట్లాడుతూ,  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్  కు ధీటుగా  నాడు – నేడు ద్వారా స్కూల్స్ ను రూపుదిద్ది భావితరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసారని, 17 కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఏర్పాటు చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని వివరించారు. వై ఏపీ నీడ్స్  జగన్, వై నాట్ 175 వంటి  నినాదాలపై ప్రజలు ఆలోచన చేసి ప్రజల చల్లని దీవెనలు జగన్ కి ఇచ్చి మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. దేశంలోని ఎంపీ లంతా జగన్ చేస్తున్న పాలనను, సచివాలయ, వాలంటీర్, విద్య, వైద్య రంగాల్లో చేపడుతున్న అంశాలపై కొనియాడుతున్నారని ఎంపీ సత్యవతి వివరించారు.  జగన్ విశాఖకు వచ్చే పండుగ రోజులు సమీపంలోనే ఉండటం ఆనందదాయకమన్నారు.

**ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ*, పెందుర్తిలో జరుగుతున్న సామాజిక సాధికార యాత్ర వచ్చే ఎన్నికల్లో సాగించే జైత్రయాత్ర అని అభివర్ణించారు. సాధికార సభకు వచ్చిన సభతో ఇతర రాజకీయ పక్షాలకు మతి పోయిందని వ్యాఖ్యానించారు. పెందుర్తిలో జనసంద్రం కనిపిస్తోందన్నారు. సీఎం జగన్ పాలనలో సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు జరుగుతున్నాయని  ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు.

పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు మాట్లాడుతూ*   పాదయాత్ర సమయంలో సీఎం ఈ ప్రాంతంలో పర్యటిస్తూ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చారని వెల్లడించారు.  అమ్మఒడి, రైతు బరోసా, డ్వాక్రా రుణ మాఫీ పథకాలు రాష్ట్రంలోనే అత్యథికంగా  రూ. 2 వేల కోట్ల పైగా నిధులు లబ్ధిదారుల అకౌంట్లలో సీఎం జగన్  పెందుర్తి నియోజకవర్గానికి జమ చేసారని  గుర్తు చేసారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో  ఏ పథకం కోసమైనా ప్రజలు ఎవరైనా సరే  స్థానిక ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగాల్సిన అవసరం లేకుండా వాలంటీర్ల ద్వారా నేరుగా అర్హులను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాలకు వర్తింప చేస్తున్నారన్నారు. ఐదేళ్లు సీఎంగా పని చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెబితే అనేక సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని, 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు అమలు చేసిన ఒక్క పథకం పేరైనా సరే గుర్తుకు వస్తుందా అని అదీప్ రాజు ప్రశ్నించారు..

పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ,* రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక జగన్ అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ద్రోహి అని, ఈ కులాలను అనేక సందర్బాల్లో ఘోరంగా అవమానాలకు గురి చేసారని గుర్తు చేసారు. సామాజిక సాధికారత కోసం సీఎం జగన్ యజ్జం సాగిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ గెలిపించి ఈ యజ్జానికి సహకరించాలని కోరారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *