



Best Web Hosting Provider In India 2024

Rose Water: ఈ ఒక్క పదార్థాన్ని రోజ్ వాటర్‌లో కలిపి రాత్రిపూట ఫేస్ మసాజ్ చేసుకుంటే ఉదయానికల్లా మెరుపు వచ్చేస్తుంది
Rose Water: రోజ్ వాటర్ చర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచుతుంది. ఆ రోజ్ వాటర్‌తో రాత్రిపూట మసాజ్ చేయడం వల్ల చర్మకాంతి రెట్టింపు అవుతుంది. రోజ్ వాటర్‌తో మసాజ్ ఎలా చేయాలో తెలుసుకోండి.
చర్మం అద్దంలా మెరవాలని అందరికీ ఉంటుంది. రోజ్ వాటర్‌ను ఉపయోగించే వనితల సంఖ్య కూడా ఎక్కువే. అయితే రోజ్ వాటర్‌ను చర్మ సౌందర్యానికి ఎలా ఉపయోగించాలో ఎంతోమందికి తెలియదు. రోజ్ వాటర్‌ను వాడడం వల్ల చర్మసంబంధిత సమస్యలు కూడా చాలావరకు తగ్గిపోతాయి. అయితే రోజ్ వాటర్‌లో ప్రతిరోజూ రాత్రి విటమిన్ ఈ క్యాప్సూల్ లేదా విటమిన్ ఇ నూనె కలిపి ముఖానికి మసాజ్ చేయడం వల్ల మీ అందం రెట్టింపు అవుతుంది.ఉదయం లేచి ముఖాన్ని చూసుకుంటే కొత్త మెరుపు కనిపిస్తుంది.
రోజ్ వాటర్ ఉపయోగాలు
రోజ్ వాటర్‌లో విటమిన్ ఈ కలిపి ఫేస్ మసాజ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇది ముఖం మీద రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. ముఖం పైన ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. చర్మంపై ఉన్న చికాకును, ఎరుపును తొలగిస్తుంది. అలాగే ముఖంపై సహజంగానే ఉండే తేమను తిరిగి పొందేలా చేస్తుంది. రంగు కూడా మెరుగు పడుతుంది.
మొటిమలు రాకుండా
చలికాలంలో రోజ్ వాటర్, విటమిన్ ఈ క్యాప్సూల్ కలిసి పొడి చర్మంపై తేమను నిలిచి ఉండేలా కాపాడతాయి. అంటే చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. దీనివల్ల మొటిమలు, మచ్చలు వంటివి రాకుండా ఉంటాయి. రాత్రిపూట విటమిన్ ఈ క్యాప్పుల్ కలిపిన రోజ్ వాటర్ తో ముఖాన్ని మసాజ్ చేయడం వల్ల ఉదయం మీ చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.
ఇలా ఫేస్ మసాజ్
రోజ్ వాటర్‌లో కొన్ని చుక్కల విటమిన్ ఈ ను కలపండి. లేదా విటమిన్ ఇ క్యాప్సూల్ ను ఓపెన్ చేసి అందులో ఉన్న పొడిని వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి అప్లై చేసి చేతి వేళ్ళతో నెమ్మదిగా మసాజ్ చేయండి. అలా పావుగంట సేపు మసాజ్ చేయాలి. తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత సంతోషంగా తృప్తిగా నిద్రపోవాలి. ఉదయం లేవగానే మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి. కొత్త కాంతి కనబడుతుంది. ప్రకాశవంతంగా అనిపిస్తుంది. ముఖానికి ఎన్ని మసాజులు చేసినా కంటి నిండా నిద్ర ఎంతో అవసరం. ఇదే చర్మానికి ఎక్కువ అందాన్ని ఇస్తుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్