



Best Web Hosting Provider In India 2024

Venkatesh: విక్టరీ వెంకటేష్ క్యారెక్టర్‌తో కమెడియన్ సప్తగిరి హీరోగా మూవీ.. దిల్ రాజు సంస్థలో రిలీజ్!
Comedian Sapthagiri New Movie With Venkatesh Role Name Pelli Kaani Prasad: హీరో విక్టరీ వెంకటేష్ నటించిన పాత్ర పేరును సినిమా టైటిల్‌గా తెరకెక్కిన చిత్రం పెళ్లికాని ప్రసాద్. ఈ మూవీలో కమెడియన్ సప్తగిరి హీరోగా చేస్తున్నాడు. తాజాగా పెళ్లికాని ప్రసాద్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
Comedian Sapthagiri Movie With Venkatesh Role Name Title: హీరో విక్టరీ వెంకటేష్ ఎన్నో విభిన్నపాత్రలు చేసి అలరించారు. ఆయన చేసిన ఐకానిక్ పాత్రలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటే పెళ్లి కాని ప్రసాద్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సినిమా మళ్లీశ్వరి.
ఆ పేరుతోనే పిలుస్తుంటారు
మళ్లీశ్వరి మూవీలో పెళ్లి కాని ప్రసాద్‌గా వెంకటేష్ పాత్ర చాలా బాగా పండింది. ఇప్పటికీ పెళ్లి కానీ యువకులను ఆ పేరుతోనే సరదాగా పిలుస్తుంటారు. ఇప్పుడు ఆ పెళ్లి కాని ప్రసాద్ అనే టైటిల్‌తోనే ఓ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కమెడియన్ సప్తగిరి హీరోగా చేశాడు. సప్తగిరికి జోడీగా ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటించింది.
అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్
అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో అవుట్-అండ్-అవుట్ ఎంటర్టైనర్‌గా పెళ్లి కాని ప్రసాద్ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని విజన్ గ్రూప్‌కు చెందిన కెవై బాబు, థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మిస్తున్నారు. చాగంటి సినిమాటిక్ వరల్డ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
దిల్ రాజు సంస్థతో రిలీజ్
పెళ్లి కాని ప్రసాద్ చిత్రాన్ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) విడుదల చేస్తోంది. టైటిల్, ఫస్ట్ లుక్‌తో సహా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లను మేకర్స్ రివిల్ చేశారు. ఈ సినిమా పెళ్లి కాని ప్రసాద్ అనే టైటిల్ పెట్టారు. ఇది ఐకానిక్ బ్లాక్‌బస్టర్ మల్లీశ్వరిలో విక్టరీ వెంకటేష్ క్యారెక్టర్‌ని గుర్తు చేస్తోన్న విషయం తెలిసిందే.
పెళ్లి కాని ప్రసాద్ ఫస్ట్ లుక్ పోస్టర్
పెళ్లి కాని ప్రసాద్ ఫస్ట్ లుక్ పోస్టర్ సప్తగిరి పాత్ర హ్యుమర్ నేచర్‌ని హైలైట్ చేస్తూ డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌ని ప్రజెంట్ చేస్తోంది. ఈ పోస్టర్ హిలేరియస్ డిజైన్‌గా, ఈ చిత్రం హై ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ పెళ్లి కాని ప్రసాద్ చిత్రానికి సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. మధు ఎడిటర్‌గా వర్క్ చేశారు.
పెళ్లి కాని ప్రసాద్ నటీనటులు
అలాగే, పెళ్లి కాని ప్రసాద్ సినిమాలో హీరోహీరోయిన్లు సప్తగిరి, ప్రియాంక శర్మతోపాటు మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ , అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, బాషా, శ్రీనివాస్, ప్రభావతి, రోహిణి, రాంప్రసాద్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, తాజాగా పెళ్లి కాని ప్రసాద్ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
పెళ్లి కాని ప్రసాద్ రిలీజ్ డేట్
మార్చి 21న థియేటర్లలో సప్తగిరి పెళ్లి కాని ప్రసాద్ సినిమాను విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమాతో హీరోగా కమెడియన్ సప్తగిరి ఎంతవరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.
సంబంధిత కథనం