Kollagottinadhiro Song Lyrics: హరి హర వీరమల్లు కొల్లగొట్టినాదిరో సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న క్లాస్ బీట్

Best Web Hosting Provider In India 2024

Kollagottinadhiro Song Lyrics: హరి హర వీరమల్లు కొల్లగొట్టినాదిరో సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న క్లాస్ బీట్

Hari Prasad S HT Telugu
Feb 24, 2025 05:39 PM IST

Kollagottinadhiro Song Lyrics: హరి హర వీరమల్లు మూవీ నుంచి కొల్లగొట్టినాదిరో అనే సూపర్ సాంగ్ వచ్చేసింది. అదిరిపోయే క్లాస్ బీట్ తో ఈ పాట అలరిస్తోంది. మరి ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. చూసి మీరూ పాడేయండి.

హరి హర వీరమల్లు కొల్లగొట్టినాదిరో సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న క్లాస్ బీట్
హరి హర వీరమల్లు కొల్లగొట్టినాదిరో సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న క్లాస్ బీట్

Kollagottinadhiro Song Lyrics: పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ నటిస్తున్న యాక్షన్ డ్రామా మూవీ హరి హర వీరమల్లు. ఈ మూవీ నుంచి సోమవారం (ఫిబ్రవరి 24) ఓ అదిరిపోయే సాంగ్ రిలీజైంది. కొల్లగొట్టినాదిరో అంటూ సాగిపోయే ఈ పాటను ఎంఎం కీరవాణి కంపోజ్ చేశాడు. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ నుంచి వచ్చిన రెండో పాట ఇది.

కొల్లగొట్టినాదిరో సాంగ్ రిలీజ్

కొల్లగొట్టినాదిరో అంటూ సాగే పాటను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సాంగ్ ను ఆస్కార్ విన్నర్ కీరవాణి కంపోజ్ చేయగా.. చంద్రబోస్ లిరిక్స్ అందించాడు. మంగ్లి, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహెరా, యామిని ఘంటసాలలాంటి వాళ్లు పాడారు. ఈ పాట ఇన్‌స్టాంట్ హిట్ గా నిలుస్తోంది. కీరవాణి మార్క్ బీట్ తో అలరిస్తోంది.

గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించాడు. ఈ రొమాంటిక్ సాంగ్ అదిరిపోయే బీట్ తో ఆకట్టుకుంటోంది. హరి హర వీరమల్లు మూవీని జ్యోతి కృష్ణతోపాటు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం బ్యాక్‌డ్రాప్ లో సాగే స్టోరీ ఇది. ఇందులో పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు.

కొల్లగొట్టినాదిరో సాంగ్ లిరిక్స్

కోర కోర మీసాలతో..

కొదమ కొదమ అడుగులతో..

కొంటె కొంటె చెణుకులతో..

కొలిమిలాంటి మగటిమితో..

సరసర వచ్చినాడు..

చిచ్చరపిడుగట్టివాడు

ఏదో ఏదో తలచినాడు..

ఎవ్వరినో వెతికినాడు..

ఎవరంట.. ఎవరంట.. ఎవరెవరెవరెవరెవంట..

ఎవరెంట.. ఎవరంట.. ఎవరెవరెవరెవరెవంట..

కొండపల్లి ఎండి బొమ్మ

కోలాకళ్లతో చూసిందమ్మా

తీయాతీయని తేనెలబొమ్మా..

తీయని తెరలే తీసిందమ్మా..

వజ్రాల జిలుగులున్నా..

రతనాల ఎలుగులున్నా..

కెంపుల్ల ఒంపులున్నా..

మొహరీల మెరుపులున్నా..

నా పైడి గుండెలోన ఏడి పుట్టించి..

మరిగించి.. మరిగించి.. కరిగించి.. కరిగించి..

కొల్లగొట్టినాదిరో.. కొల్లగొట్టినాదిరో.. కొల్లగొట్టి నా గుండెనే ముల్లే గట్టినాదిరో..

కొల్లగొట్టినాదిరో.. కొల్లగొట్టినాదిరో.. ముల్లే గట్టినాదిరో.. ముల్లే గట్టినాదిరో..

అయ్యయ్యయో.. అయ్యయ్యయో.. ఆ చిన్నదీ.. ఇంకేమీ చేసిందయ్యో..

అయ్యయ్యయో.. అయ్యయ్యయో.. ఆ కుర్రదీ.. ఏమంత్రమేసిందయ్యో..

కన్నులలోని కాటుక మేఘం..

చీకటి నాపై చిలికిందే..

మాటలతోనే మెలికేసిందే..

మర్మం ఏదో దాసిందే..

ఆడవాళ్ల మనసు అడవిలాంటిదని..

ఎరగని సంటోడివా..

అంత అమాయకుడివా..

పడుసు పిల్లతీరు పట్టుచిక్కదని

పసిగట్టలేనోడివా..

ఒట్టి సొంఠి కొమ్మువా..

లేత ఎన్నపూసవా..

అరే మీసాల రోషాల మొనగాన్ని పట్టేసి

పసివాన్ని చేసేసి.. పసరేదో పూసేసి..

కొల్లగొట్టినాదిరో.. కొల్లగొట్టినాదిరో.. కొల్లగొట్టి నా గుండెనే ముల్లే గట్టినాదిరో..

కొల్లగొట్టినాదిరో.. కొల్లగొట్టినాదిరో.. ముల్లే గట్టినాదిరో.. ముల్లే గట్టినాదిరో..

ఊపిరలోనీ.. ఆవిరి పవనాలే..

విరివిగ లేఖలే.. విసిరేనే..

ఉప్పెనలాగా.. పొంగే పౌరుషమే..

సొగసుకు సంకెలు వేసేనే..

చీకూచింతా లేనివాడి.. చిత్తం దోచావే..

పారాహుషార్ పోరాగాణ్ని.. పాగల్ జేశావే..

దారేదైనా దవ్వేదైనా.. నీడై ఉంటానే..

పేరేదైనా తీరేదైనా.. పెనివిటి అంటానే..

కొల్లగొట్టినాదిరో.. కొల్లగొట్టినాదిరో.. కొల్లగొట్టి నా గుండెనే ముల్లే గట్టినాదిరో..

కొల్లగొట్టినాదిరో.. కొల్లగొట్టినాదిరో.. ముల్లే గట్టినాదిరో.. ముల్లే గట్టినాదిరో..

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024