Best Web Hosting Provider In India 2024

హామీల అమలుపై ఎక్కడా స్పష్టత లేదు
వైయస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు భయపడుతున్నారు
మాజీ మంత్రి ఆర్కె రోజా ఆగ్రహం
చంద్రబాబుకు అయిదేళ్ళ పాలనకే ప్రజలు ఓటు వేశారు
గవర్నర్ ప్రసంగంలో విజన్ 2047 గురించి మాట్లాడించడం హాస్యాస్పదం
ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఈ దేశంలో ఎక్కడా లేదు
ప్రపంచంలో ఒక్క తాలిబన్ పాలనలోనే ప్రతిపక్షం లేదు
ఎక్కడైనా అధికారపక్షంకు పీఏసీ చైర్మన్ పదవిని ఇస్తారా?
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే తమ తప్పులను ప్రశ్నిస్తారనే భయం
మాజీ మంత్రి ఆర్కె రోజా ధ్వజం
తాడేపల్లి: బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం పచ్చి అబద్దాలను చెప్పించిందని మాజీ మంత్రి ఆర్కె రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ అయిదేళ్ళలో హామీల అమలు ఎలా చేస్తారో చెప్పకుండా విజన్ 2047 గురించి గవర్నర్ ప్రసంగంలో మాట్లాడించడం అర్థరహితమని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడ అసెంబ్లీ సాక్షిగా ఎండగడతారోననే భయంతోనే వైయస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఏమన్నారంటే…
గవర్నర్ ప్రసంగంలో వైయస్ జగన్ గారిని తిట్టిస్తూ, చంద్రబాబును పొగిడించుకునే కార్యక్రమం చేశారు. ఎన్నికలు ముందు సూపర్ సిక్స్ తో పాటు 143 హామీలు ఇచ్చారు. నేడు గవర్నర్ ప్రసంగంలో ఏ హామీ గురించి ఎలాంటి స్పష్టత లేకపోవడం దురదృష్టకరం. బడ్జెట్ ప్రసంగం అనగానే విద్య, వైద్య, వ్యవసాయ, ఇరిగేషన్ రంగాలపై ఎలాంటి లక్ష్యాలతో, ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారోనని అందరూ ఆసక్తిగా చూస్తారు. కానీ విజన్-2047 పేరుతో కాకమ్మ కబుర్లతో ప్రసంగాన్ని ముగించారు. ప్రజలు చంద్రబాబుకు ఇచ్చిందే అయిదేళ్ళ పాలనాకాలం. ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ అయిదేళ్ళలో ఎలా అమలు చేస్తారో చెప్పకుండా 2047 నాటికి ఏం చేస్తారో చెప్పడం అంటే, ఇప్పుడు ఏమీ చేయను అని చెప్పినట్లే.
నమ్మినవారిని మోసం చేయడం చంద్రబాబుకు అలవాటు
గవర్నర్ ప్రసంగంలో మద్యం రేట్లు పెంచం అని చెప్పించారు. ఇటీవలే మద్యం రేట్లను ఎలా పెంచారో పత్రికల్లో వచ్చిన కథనాలు చూస్తే తెలుస్తుంది. ప్రతి బాటిల్ పై రూ.10 లకు పైగా పెంచారు. మేం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచం అని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. నేడు తొమ్మిదినెలల కాలంలోనే ఏకంగా రూ.15వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం ప్రజలపై మోపారు. గవర్నర్ ప్రసంగంలో మాత్రం విద్యుత్ చార్జీల భారం లేదని చెప్పించడం చంద్రబాబు అబద్దాలకు పరాకాష్ట. ఇళ్ళలోని మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు, అన్నదాత సుఖీభవం, మహిళలకు ఉచిత బస్సు, తల్లికివందనం వంటి హామీలపై గవర్నర్ ప్రసంగంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. నిరుద్యోగులుకు భృతి ఇస్తామని, కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటిని అమలు చేయకుండా ఇప్పటికే పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులు, వాలంటీర్లను తొలగించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏదో చేస్తారని ఆశించిన ఉద్యోగస్తులకు ఐఆర్, డీఏ, పీఆర్సీల అమలు ప్రసక్తే లేదు. అన్ని వర్గాలను మోసం చేయడం అలవాటైన చంద్రబాబును నమ్మిన వారిని చూస్తే జాలి కలుగుతోంది. వైయస్ జగన్ మనస్సున నాయకుడు. ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేసే నేత.
ప్రతిపక్ష హోదాపై వపన్ వ్యాఖ్యలు అర్థరహితం
ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల సభలో ఎక్కువ సమయం కేటాయిస్తారు, ప్రజాసమస్యలపై ఎక్కువ సేపు మాట్లాడే అవకాశం ఉంటుందని వైయస్ జగన్ గారు ఈ హోదా అడుగుతున్నారు. దీనిపై డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ అర్థంలేకుండా మాట్లాడారు. ఎక్కడో జర్మనీ గురించి మాట్లాడుతున్నారు. ఎక్కువ సీట్లు వచ్చిన జనసేనకు ప్రతిపక్ష హోదా వస్తుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి ప్రతిపక్ష నాయకుడుగా ఈ ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబు చేసే తప్పులను నిలదీయాలని కోరుతున్నాం. ఆ పనిమాత్రం చేయలేరు. చంద్రబాబుకు కష్టం వస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు, రోడ్డు మీద పడుకుంటారు. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకపోయినా, విద్యార్దులు తమకు న్యాయం చేయాలని రోడ్ల మీదికి వచ్చినా తనకేమీ పట్టనట్లు ఆసుపత్రిలో పడుకుంటారు. గ్రూప్ -2 అభ్యర్ధుల ఆవేదనను అర్థం చేసుకోకుండా మాజీ సీఎం వైయస్ జగన్ గారిపైన బుదరచల్లే ప్రయత్నం చేస్తున్నారు. పదకొండు సీట్లు ఉన్న వైయస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ఎందుకు భయపడుతున్నారు. గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వం వల్లే రాష్ట్రం దెబ్బతిన్నదని చెప్పించారు, వైయస్ జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన సభకు వస్తారు, ఆయనను సభలోనే నిలదీయండి. అలా చేసే ధైర్యం మాత్రం కూటమి ప్రభుత్వానికి లేదు. ఇప్పటి వరకు ఎల్లో మీడియాలో ఎటువంటి ఆధారాలు లేకుండా వైయస్ జగన్ గారిపై విషప్రచారం చేస్తున్నారు. ఇలాగే అసెంబ్లీలో చేయాలంటే ఆధారాలు చూపించాల్సి వస్తుందని కాబట్టి, వైయస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, ప్రతిపక్ష గొంతే వినిపించకుండా కుట్ర చేస్తున్నారు. హుందాతనం గురించి వపన్ కళ్యాణ మాట్లాడటం హాస్యాస్పదం. తన స్వలాభం కోసం ప్రజలను గాలికి వదిలేశారు. పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర ప్రజలకు, తనను నమ్మి ఓట్లు వేసిన వారికి ఈ తొమ్మిది నెలల్లో ఏం చేశారు? నోటికి వచ్చినట్లు వైయస్ జగన్ గారిపైన అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ నిర్వహించేంది చంద్రబాబు, పవన్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటే వినడానికి కాదు.
మీడియాపైనా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూసే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇస్తారు. కానీ ఏపీలో మాత్రం తమ అవినీతి బయటకు రాకుండా ఉండేందుకు అధికారపక్షమే పీఏసీ చైర్మన్ పదవిని తమ ఎమ్మెల్యేకు ఇచ్చుకుంది. దేశంలో తాలిబన్ల పాలనలోనే ఇలా ప్రతిపక్షం అనేది లేకుండా చేసి పాలిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా చంద్రబాబు తాలిబన్ల మాదిరిగా పాలన చేస్తున్నారు. అసెంబ్లీలో వారికి భజన చేసే ఎల్లో మీడియా తప్ప, మిగినలి నాలుగు చానెళ్ళను రానివ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గం. మీడియా మీద రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసే తప్పులను ఎవరూ ఎత్తి చూపించ కూడదనేదే వీరి ఉద్దేశం. గ్రూప్-2 అభ్యర్ధులు కూటమి పార్టీలను నమ్మి ఓట్లేసినందుకు మా చెప్పులతో మా చెంపలను వాయించుకుంటున్నామని మీడియా ముందు తమ నిరసనను తెలియచేశారు. ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ విదేశాల్లో కూలింగ్ గ్లాస్ లు పెట్టుకుని, క్రికెట్ మ్యాచ్ చూస్తూ కాలక్షేపం చేశారు.