Best Web Hosting Provider In India 2024

తాడిపత్రి: అనంతపురం జిల్లా రాజకీయాల్లో తాడిపత్రి నియోజకవర్గానిది ఓ ప్రత్యేకత. అక్కడ గతంలో కనిపించిన పెత్తందారీ పోకడలు ఇప్పుడు కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనం ఈరోజు తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి, సామాజిక సాధికారయాత్రలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బహిరంగసభను విజయవంతం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, ఉషశ్రీచరణ్, ఎంపీలు నందిగం సురేష్, తలారి రంగయ్య, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.