OTT March Movies: మార్చిలో ఓటీటీలోకి రానున్న టాప్-5 తెలుగు సినిమాలు.. రెండు బ్లాక్‍బస్టర్లు.. ఓ అల్ట్రా డిజాస్టర్ కూడా..

Best Web Hosting Provider In India 2024

OTT March Movies: మార్చిలో ఓటీటీలోకి రానున్న టాప్-5 తెలుగు సినిమాలు.. రెండు బ్లాక్‍బస్టర్లు.. ఓ అల్ట్రా డిజాస్టర్ కూడా..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 27, 2025 10:34 PM IST

OTT March Movies: ఓటీటీల్లో మార్చి నెలలో కొన్ని తెలుగు చిత్రాలు రానున్నాయి. రెండు బ్లాక్‍బస్టర్ సినిమాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి. మార్చిలో స్ట్రీమింగ్‍కు రానున్న టాప్-5 తెలుగు చిత్రాలు ఏవంటే..

OTT March Movies: మార్చిలో ఓటీటీలోకి రానున్న టాప్-5 తెలుగు సినిమాలు.. రెండు బ్లాక్‍బస్టర్లు.. ఓ అల్ట్రా డిజాస్టర్ కూడా..
OTT March Movies: మార్చిలో ఓటీటీలోకి రానున్న టాప్-5 తెలుగు సినిమాలు.. రెండు బ్లాక్‍బస్టర్లు.. ఓ అల్ట్రా డిజాస్టర్ కూడా..

మార్చి నెలలో వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఎంట్రీ ఇచ్చేందుకు కొన్ని తెలుగు సినిమాలు రెడీ అయ్యాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బ్లాక్‍బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం కూడా స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది. సూపర్ హిట్ తండేల్ కూడా ఓటీటీలో అడుగుపెట్టనుంది. అల్ట్రా డిజాస్టర్ అయిన లైలా కూడా ఇదే నెలలో ఓటీటీలోకి రానుంది. మరో రెండు తెలుగు చిత్రాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. మార్చి నెలల్లో ఓటీటీల్లోకి వచ్చే టాప్-5 తెలుగు చిత్రాలు ఇవే..

సంక్రాంతికి వస్తున్నాం

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.300కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ కామెడీ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజై అదరగొట్టింది. ఈ సినిమా భారీ సక్సెస్ అవడంతో ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమైంది. ఎట్టకేలకు మార్చి ఆరంభంలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా జీ తెలుగు టీవీ ఛానెల్‍లో మార్చి 1న ప్రసారం కానుంది. అదే రోజున జీ5లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుందని తెలుస్తోంది. ఎట్టకేలకు మార్చి మొదట్లోనే ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో వెంకీ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేసిన ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ ఇచ్చారు.

లైలా

మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ఘోరమైన ఫలితాన్ని దక్కించుకుంది. లేడీ గెటప్‍లోనూ విశ్వక్ కనిపించిన ఈ కామెడీ యాక్షన్ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకొని అల్ట్రా డిజాస్టర్ అయింది. రామ్‍నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. ఈ లైలా సినిమా మార్చి రెండో వారంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది.

తండేల్

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తండేల్ చిత్రం రూ.100కోట్లకు పైగా కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ అయింది. రియల్ స్టోరీ ఆధారంగా చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజైంది. తండేల్ మూవీ మార్చిలోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. మార్చి 7న స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇస్తుందనే రూమర్లు ఉన్నాయి. స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బాపు

తెలంగాణ విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో రూపొందిన బాపు చిత్రం ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజైంది. దయాకర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ, సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. బాపు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియోహాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. మార్చి రెండో వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

మజాకా

సందీప్ కిషన్ హీరోగా నటించిన మజాకా చిత్రం తాజాగా ఫిబ్రవరి 27వ తేదీన రిలీజైంది. ఈ కామెడీ ఎంటర్‌టైనింగ్ మూవీకి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లో స్ట్రీమింగ్‍కు తెచ్చేలా ఓటీటీ డీల్ జరిగిందని సమాచారం. దీన్ని బట్టి మార్చి చివరి వారంలో మజాకా మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. థియేట్రికల్ రన్‍పై స్ట్రీమింగ్ డేట్ ఆధారపడనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024