Nadal Focus On Maaya Rajeshwaran: 15 ఏళ్ల ఇండియన్ టెన్నిస్ స్టార్ పై నాదల్ కన్ను.. ఫొటో వైరల్

Best Web Hosting Provider In India 2024

Nadal Focus On Maaya Rajeshwaran: 15 ఏళ్ల ఇండియన్ టెన్నిస్ స్టార్ పై నాదల్ కన్ను.. ఫొటో వైరల్

మల్లోర్కాలోని రఫెల్ నాదల్ అకాడమీలో భారత యువ టెన్నిస్ సంచలనం మాయ రాజేశ్వరణ్ శిక్షణ పొందుతోంది. ఆమె ట్రెయినింగ్ ను తీక్షణంగా వీక్షిస్తున్న నాదల్ ఫొటో వైరలవుతోంది.

 
అకాడమీలో మాయ రాజేశ్వరణ్ ప్రాక్టీస్ ను తీక్షణంగా చూస్తున్న నాదల్
అకాడమీలో మాయ రాజేశ్వరణ్ ప్రాక్టీస్ ను తీక్షణంగా చూస్తున్న నాదల్ (Rafael Nadal Academy)

 

టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కన్ను భారత యువ టెన్నిస్ సంచలనంపై పడింది. లెజెండరీ టెన్నిస్ ప్లేయర్ ఫోకస్ లో పడ్డ 15 ఏళ్ల ఆ అమ్మాయి పేరు మాయ రాజేశ్వరణ్ రేవతి. కోయంబత్తూర్ కు చెందిన మాయ తన అసాధారణ నైపుణ్యాలతో అదరగొడుతోంది. స్పెయిన్ లోని మల్లోర్కాలో ఉన్న నాదల్ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ పొందే ఛాన్స్ పట్టేసింది.

 

దిగ్గజం సమక్షంలో

15 ఏళ్లకే మాయ రాజేశ్వరణ్ దిగ్గజం నాదల్ సమక్షంలో ట్రెయినింగ్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. 100 పర్సెంట్ స్కాలర్షిప్ తో ఈ రఫెల్ నాదల్ అకాడమీలో ఆమె ప్రాక్టీస్ సాగుతోంది. ఈ సందర్భంగా మాయ ప్రాక్టీస్ సెషన్ కు నాదల్ హాజరయ్యాడు. ఆమె ఆడుతుంటే తీక్షణంగా చూశాడు. ఆ సమయంలో క్లిక్ మనిపించిన ఫొటో సోషల్ మీడియాాలో వైరల్ గా మారింది. మాయ తన టాలెంట్ తో నాదల్ ను ఆకట్టుకుంటుందనే కామెంట్లు వస్తున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rafa Nadal Academy by Movistar (@rafanadalacademy)

ఐ ఎమోజీతో

మాయ ప్రాక్టీస్ ను నాదల్ చూస్తున్న ఫొటోను రఫెల్ నాదల్ అకాడమీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. దీనిపై నాదల్ రియాక్టయ్యాడు. ఐ (కళ్లు) ఎమోజీ పెట్టాడు. దీంతో మాయ ప్రాక్టీస్ ను నిశితంగా గమనిస్తున్నాడనే అర్థం వచ్చేలా నాదల్ కామెంట్ చేశాడని అర్థం చేసుకోవచ్చు. చిన్నతనంలోనే రాకెట్ పట్టిన మాయ అంచెలంచెలుగా ఎదుగుతోంది. తక్కువ వయసులోనే గొప్ప ఆటతీరు ప్రదర్శిస్తోంది.

నాదల్ కామెంట్
నాదల్ కామెంట్

డబ్ల్యూటీఏ పాయింట్

ఇటీవల ఎల్ అండ్ టీ ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ 125 సిరీస్‌లో యువ మాయా అసాధారణ ప్రదర్శనతో సెమీస్ వరకూ వెళ్లింది. ఈ క్రమంలో ఇటలీకి చెందిన 264వ ప్రపంచ ర్యాంకర్ నికోల్ ఫోస్సా హ్యూర్గోపై 6–3, 3–6, 6–0తో గెలిచింది. ఆ తర్వాత ప్రపంచ 434వ ర్యాంకర్ జెస్సికా ఫైలా (అమెరికా)ను 7–6(9), 1–6, 6–4 తో చిత్తుచేసింది. ఈ అద్భుత విజయాలతో డబ్ల్యూటీఏ పాయింట్ సాధించిన యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్ గా హిస్టరీ క్రియేట్ చేసింది.

 
 
Whats_app_banner
 

సంబంధిత కథనం

 


Best Web Hosting Provider In India 2024


Source link