



Best Web Hosting Provider In India 2024

Mystery Crime Thriller OTT: ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చేసిన మోస్ట్ అవైటెడ్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ రెండో సీజన్
Suzhal 2 OTT Streaming: సుడల్ సీజన్ 2 స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఎంతగానో ఎదురుచూసిన ఈ సిరీస్ సీక్వెల్ నేడు అడుగుపెట్టింది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది.
సుడల్: ది వర్టెక్స్’ తమిళ వెబ్ సిరీస్‍కు రెండో సీజన్ కోసం చాలా కాలంగా చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూశారు. ఈ సిరీస్ తొలి సీజన్ ట్విస్టులు, గ్రిప్పింగ్ నరేషన్‍తో అంతలా ఆకట్టుకుంది. ఉత్కంఠతో ఊపేసింది. పుష్కర్ – గాయత్రి దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ తొలి సీజన్ 2022 జూన్‍లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రాగా.. భారీ సక్సెస్ అయింది. నేషనల్ వైడ్‍లో పాపులర్ అయింది. దీంతో రెండో సీజన్ కోసం నిరీక్షణ బాగా కొనసాగింది. మోస్ట్ అవైటెడ్ సిరీస్‍ల్లో ఒకటిగా నిలిచింది. ఎట్టకేలకు సుడల్ 2 సిరీస్ నేడు (ఫిబ్రవరి 28) స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.
ఐదు భాషల్లో స్ట్రీమింగ్
సుడల్ సీజన్ 2 నేడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల వచ్చిన ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగడంతో రెండో సీజన్‍పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సీజన్ నేడు ప్రైమ్ వీడియోలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. సుడల్ 2 సిరీస్‍లో ఐశ్వర్య రాజేశ్, కాథిర్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఫస్ట్ సీజన్‍లా సత్తాచాటుతుందా!
సుజల్ సీజన్ 2 కూడా ఫస్ట్ సీజన్‍లా సూపర్ సక్సెస్ అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. కథలో చాలా ట్విస్టులు ఉంటాయని ఇటీవల వచ్చిన ట్రైలర్ ద్వారా అర్థమైంది. ఐశ్వర్య రాజేశ్ జైలులో నుంచి బయటికి వస్తుందా.. లాయర్ హత్య చేసిందెవరు.. ఎనిమిది మంది అమ్మాయిలపై అనుమానం.. మిస్టరీగా మారిన కేసును ఎస్ఐ చక్రవర్తి (ఖాతిర్) దర్యాప్తు చేయడం ఈ సీజన్‍లో ఉండనున్నాయి. అష్టకాళి పండుగ కూడా ప్రధానంగా ఉంటుంది. తొలి సీజన్ ముగిసిన దగ్గరే ఈ రెండో సీజన్ మొదలుకానుంది.
సుడల్ ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అయింది. ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇండియాలో టాప్ సిరీస్‍ల్లో ఒకటిగా నిలిచింది. ఈ రెండో సీజన్ కూడా భారీ వ్యూస్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, తొలి సీజన్ మ్యాజిక్‍ను మళ్లీ రిపీట్ చేస్తుందా.. ప్రేక్షకులను ఆ స్థాయిలో మెప్పిస్తుందా అనేది చూడాలి.
సుడల్ వెబ్ సిరీస్‍ను దర్శక ద్వయం పుష్కర్ – గాయత్రి తెరకెక్కించారు. సుమారు మూడేళ్ల తర్వాత రెండో సీజన్ వచ్చేసింది. గ్రిప్పింగ్ నరేషన్, ఉత్కంఠభరితమైన మలుపులు ఉండేలా కనిపిస్తోంది. వాల్‍వాచర్స్ ఫిల్మ్స్ పతాకం ఈ సిరీస్‍ను నిర్మించింది. ఈ సిరీస్‍కు సామ్ సీఎస్ సంగీతం అందించారు.
సుడల్ 2 సీజన్‍లో ఐశ్వర్య రాజేశ్, ఖాతిర్, లాల్ లీడ్ రోల్స్ చేశారు. మంజిమా మోహన్, శరవణన్, గౌరి జీ కిషన్, సంయుక్త విశ్వనాథన్, కాయల్ చంద్రన్ కీలకపాత్రల్లో కనిపించారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈవారమే జిడ్డీ గర్ల్స్ అనే వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఐదుగురు అమ్మాయిల చుట్టూ ఈ న్యూఏజ్ డ్రామా సిరీస్ సాగుతుంది. కాలేజీలో కట్టుబాట్లను అమ్మాయిలు ఎదిరించడం చుట్టూ స్టోరీ ఉంటుంది. హిందీలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, తమిళం భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది.
సంబంధిత కథనం